Home / INTERNATIONAL (page 6)

INTERNATIONAL

ఉక్రెయిన్‌లోని ఇండియన్స్ కోసం 24×7 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్.

ఉక్రెయిన్‌పై రష్యా గురువారం ఉదయం యుద్ధం ప్రారంభించడంతో ఒక్కసారిగా అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులకు సాయం చేసేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అక్కడ ఉన్న మనోళ్లు ఎలాంటి సమాచారం, సాయం కావాలన్న ఈ హెల్ప్‌లైన్‌ ద్వారా అధికారులను సంప్రదించవచ్చు. ఈ విషయాన్ని …

Read More »

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మొదలైంది. రష్యన్ సైన్యం ఉక్రెయిన్లోకి ప్రవేశించింది. ఉక్రెయిన్ రాజధాని కేవ్పై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడిని గద్దె దింపుతామన్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. మరోవైపు రష్యాకు పొరుగున ఉన్న బాల్టిక్ దేశాలకు అమెరికా 800 మంది సైనికులను, 40 యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను పంపింది.

Read More »

రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం

రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ పై మిలటరీ ఆపరేషన్ (యుద్ధం) ప్రకటించారు. ఉక్రెయిన్ సైనికులు వారి ఆయుధాలను వదిలేసి, ఇళ్లకు వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఉక్రెయిన్ ను ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. పుతిన్ ప్రకటనతో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటానియో గుటెరస్ అప్రమత్తమయ్యారు. శాంతికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఐరాస సెక్యూరిటీ జనరల్ అత్యవసరంగా భేటీ అయింది.

Read More »

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన నిర్ణయం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్లోని డోనెట్స్, లుహాన్క్ ప్రాంతాలను స్వతంత్ర స్టేట్స్ గా ప్రకటిస్తూ డిక్రీపై సంతకం చేశారు. దీంతో ఈ చర్యను పుతిన్ వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు పరిగణిస్తున్నారు. ఇక రష్యా నిర్ణయంపై మండిపడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. తమ దేశ భద్రతపై అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తో మాట్లాడారు.

Read More »

మరోకసారి వార్తల్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్

చిత్రవిచిత్ర నిర్ణయాలు, శిక్షలతో వార్తల్లో నిలిచే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తాజాగా మరోసారి తెరపైకి వచ్చారు. కిమ్ తన తండ్రి జోంగ్ ఇల్ సమాధి ప్రాంతంలో ఏటా కింజోంగిలియా అనే పూలమొక్కలను నాటిస్తారు. వాటి సంరక్షణకు ఇద్దరు తోటమాలీలను నియమించగా.. వాతావరణ మార్పుల వల్ల ఈఏడాది ఆ మొక్కలకు పూలు పూయలేదు.దీంతో ఆగ్రహించిన కిమ్ వారిద్దరిలో ఒకరికి 3, మరొకరికి 6 నెలల జైలుశిక్ష విధించారు.

Read More »

కరోనా ముప్పుపై WHO చీఫ్ అథనోమ్ కీలక వ్యాఖ్యలు

కరోనా ముప్పుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డా.టెడ్రోస్ అథనోమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాలపాటు ఉంటుందని, వైరస్ సోకే ముప్పు కూడా అదే స్థాయిలో ఉంటుందని హెచ్చరించారు. ఇక కామన్వెల్త్ దేశాల్లో కేవలం 42 శాతం, ఆఫ్రికా దేశాల్లో సగటు వ్యాక్సినేషన్ రేటు కేవలం 23 శాతమేనని చెప్పారు. వ్యాక్సిన్ పంపిణీలో దేశాల మధ్య వ్యత్యాసం ఉందని, అలా కాకుండా అందరికీ అందించడమే ప్రపంచ …

Read More »

వారంలో ఏకంగా 2.1 కోట్ల మందికి కరోనా

ప్రపంచవ్యాప్తంగా గత వారంలో కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరిగాయి. జనవరి 17 నుంచి 23 వరకు ఏకంగా 2.1 కోట్ల మంది కరోనా బారిన పడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడించాయి. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఒక వారంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని WHO పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ వల్లే కేసులు ఊహించనంతగా పెరిగాయని తెలిపింది. ఇదే వారంలో ప్రపంచవ్యాప్తంగా 50 వేల మంది కరోనాతో …

Read More »

ప్రపంచవ్యాప్తంగా గత వారంలో 1.8 కోట్ల కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా గత వారం 1.8 కోట్ల కరోనా కేసులు నమోదైనట్లు WHO తెలిపింది. అంతకుముందు వారంతో పోల్చితే కేసులు 20 శాతం పెరిగినట్లు వెల్లడించింది. మరణాల సంఖ్య స్థిరంగా 45 వేలుగా ఉన్నట్లు పేర్కొంది. ఆఫ్రికా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో కరోనా కేసులు పెరిగినట్లు పేర్కొంది. ఒమిక్రాన్ వ్యాప్తి తగ్గుతోందని, కేసులు కూడా తగ్గుతాయని అభిప్రాయపడింది.

Read More »

శ్రీలంకకు అండగా భారత్

విదేశీ మారక ద్రవ్యం కొరత, పెరిగిన అప్పులతో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు మరోసారి భారత్ సాయం అందించింది. పెట్రోలియం ఉత్పత్తులు కొనుక్కోవడం కోసం 500 మిలియన్ డాలర్లను అప్పుగా ఇవ్వనుంది. ఈ నెల మొదట్లో ఆ దేశానికి 900 మిలియన్ డాలర్ల ఫారెక్స్ సపోర్ట్ను, గత వారం 400 మిలియన్ డాలర్లను భారత్ మంజూరు చేసింది. ఆ దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ప్రజలు ఇబ్బందులు …

Read More »

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విధ్వంసం

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తోంది. అన్ని దేశాల్లో కలిపి ఒక్కరోజు వ్యవధిలోనే 31 లక్షల కొత్త కేసులు వెలుగు చూశాయి. ఒక్క అమెరికాలోనే 8 లక్షల మందికి పాజిటివ్గా తేలింది. అన్నిదేశాల్లో కలిపి కరోనా వల్ల మరో 7,855 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసులు సంఖ్య 31 కోట్ల 93 లక్షలకు చేరువైంది.

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum