గత రెండు వారాలుగా నడుస్తున్న ఉక్రెయిన్ తో భీకర యుద్ధం వేళ.. అణ్వాయుధాల వాడకంపై రష్యా కీలక ప్రకటన చేసింది. ‘మాకు ఒక జాతీయ భద్రతా విధానం ఉంది.
ఉక్రెయిన్ పై సైనిక చర్య నేపథ్యంలో మా దేశానికి అస్థిత్వానికి ముప్పు ఏర్పడినప్పుడు మాత్రమే.. మా విధానానికి అనుగుణంగా మేం వాటిని ఉపయోగిస్తాం’ అని రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు.
పేస్కోవ్ వ్యాఖ్యలను అమెరికా తప్పుబట్టింది. అణ్వాయుధ దేశమైన రష్యా బాధ్యతగా ఉండాలని సూచించింది.