దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,937 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాజాగా 35,909 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా.. మరో 417 మంది మహమ్మారి బారినపడి మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,25,513కు చేరింది. ఇందులో 3,14,924 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 4,31,342 మంది ప్రాణాలను …
Read More »ఎర్రకోట నుండి ప్రధాని మోదీ పలు కీలక ప్రకటనలు
ఈరోజు దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి ప్రసంగించిన ప్రధాని మోదీ పలు కీలక ప్రకటనలు చేశారు. దేశవ్యాప్తంగా గల అన్ని సైనిక పాఠశాలల్లో ఇకపై బాలికలకు కూడా ప్రవేశం కల్పించనున్నట్లు మోదీ ప్రకటించారు. ఇంతవరకూ బాలురకు మాత్రమే సైనిక స్కూళ్లలో ప్రవేశం కల్పించేవారు. భారత రక్షణ రంగంలో యువతులకూ ప్రాధాన్యత కల్పిస్తున్న నేపధ్యంలో సైనిక స్కూళ్లలో బాలికలకు ప్రవేశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జమ్ముకశ్మీర్ …
Read More »ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేసిన ప్రధాని మోదీ
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేశారు. అంతకు ముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అజయ్‌భట్ స్వాగతం పలికారు. ఆ తర్వాత త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగుర వేసి, గౌరవ వందనం సమర్పించారు. …
Read More »దేశంలో తగ్గని కరోనా ఉధృతి
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 36,083 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 37,927 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అవగా.. మరో 493 మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,21,92,576కు పెరిగింది. ఇందులో 3,13,76,015 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,85,336 యాక్టివ్ కేసులున్నాయి. మహమ్మారి …
Read More »రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ అన్‌లాక్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నేతల అకౌంట్లను.. ట్విట్టర్ సంస్థ అన్‌లాక్ చేసింది. ఇటీవల ఢిల్లీలో రేప్, హత్యకు గురైన ఓ తొమ్మిదేళ్ల బాలిక ఫ్యామిలీ ఫోటోను ట్వీట్ చేసిన నేపథ్యంలో రాహుల్‌తో పాటు ఆ పార్టీ నేతల అకౌంట్లను ట్విట్టర్ సంస్థ తాత్కాలికంగా లాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం రాహుల్ .. ట్విట్టర్‌పై విరుచుకుపడ్డారు. భారతీయ రాజకీయ …
Read More »మళ్లీ మొదలయిన కరోనా విజృంభణ
ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 7 లక్షలకు పైగా కేసులు నమోదుకాగా, 10 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. శుక్రవారంనాటికి మొత్తం 20.65 కోట్ల కేసులు నమోదుకాగా, 43.6 లక్షల మంది మరణించారు. ముఖ్యంగా అమెరికా, భారత్, బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇరాన్‌లో కేసులు పెరుగుతున్నాయి. 135కు పైగా దేశాల్లోకి విస్తరించిన డెల్టా వేరియంట్ కారణంగానే ఈ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. …
Read More »దేశంలో కొత్తగా 38,667 కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 38,667 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,21,56,493కు చేరింది. ఇందులో 3,13,38,088 మంది బాధితులు కోలుకోగా, 3,87,673 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,30,732 మృతిచెందారు. శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 478 మంది మరణించగా, మరో 35,743 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉందని …
Read More »దుబాయ్ వెళ్లేందుకు అది అవసరం లేదు
చెన్నై నుంచి దుబాయ్ వెళ్లే ప్రయాణికులు ఇకపై కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లు సమర్పించాల్సిన అవసరం లేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ నెల ఆరు నుంచి దుబాయ్‌కి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆ సందర్భంగా చెన్నై నుంచి వచ్చే ప్రయాణికులు నెగిటివ్ సర్టిఫికెట్, ఆర్టీపీసీఆర్ పరీక్షలకు సంబంధించిన ధ్రువపత్రాలు సమర్పించా లని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం వాటిని రద్దు చేసినట్లు చెన్నై విమానాశ్రయ అధికారులు …
Read More »కరోనా మరణాలు పెరుగుతాయి.. వచ్చే 4 వారాలు కష్ట కాలమే..!
రోజుకు లక్షపైగా కరోనా కేసులు నమోదవుతున్న అమెరికాలో మున్ముందు పరి స్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) పేర్కొం ది. డెల్టా వేరియంట్ ఉధృతి నేపథ్యంలో రానున్న 4 వారాల్లో ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు పెరుగుతాయని సీడీసీ అంచనా వేసింది. సెప్టెంబరు 6 నాటికి రోజుకు 9,600-33000కు పైగా కొవిడ్ రోగులు ఆస్ప్రతుల పాలవుతారు. సెప్టెంబరు 4 నాటికి మరణాల సంఖ్య …
Read More »దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం 41,195 పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా అవి 40 వేలు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 2.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 40,120 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,21,17,826కు చేరింది. ఇందులో 3,13,02,345 మంది బాధితులు కోలుకోగా, మరో 3,85,227 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి …
Read More »