Home / INTERNATIONAL / కరోనా మరణాలు పెరుగుతాయి.. వచ్చే 4 వారాలు కష్ట కాలమే..!

కరోనా మరణాలు పెరుగుతాయి.. వచ్చే 4 వారాలు కష్ట కాలమే..!

 రోజుకు లక్షపైగా కరోనా కేసులు నమోదవుతున్న అమెరికాలో మున్ముందు పరి స్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) పేర్కొం ది.

డెల్టా వేరియంట్‌ ఉధృతి నేపథ్యంలో రానున్న 4 వారాల్లో ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు పెరుగుతాయని సీడీసీ అంచనా వేసింది. సెప్టెంబరు 6 నాటికి రోజుకు 9,600-33000కు పైగా కొవిడ్‌ రోగులు ఆస్ప్రతుల పాలవుతారు.

సెప్టెంబరు 4 నాటికి మరణాల సంఖ్య 3,300-12,600 ఉండొచ్చని వివరించింది. ఇప్పటికే అమెరికా దక్షిణాది రాష్ట్రాల్లో ఆస్పత్రుల్లో చేరికలు అధికంగా ఉన్నాయి. రోగులకు వైద్య సేవలు అందించడం క్లిష్టమవుతోంది.