Home / INTERNATIONAL / మళ్లీ మొదలయిన కరోనా విజృంభణ

మళ్లీ మొదలయిన కరోనా విజృంభణ

ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 7 లక్షలకు పైగా కేసులు నమోదుకాగా, 10 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. శుక్రవారంనాటికి మొత్తం 20.65 కోట్ల కేసులు నమోదుకాగా, 43.6 లక్షల మంది మరణించారు. ముఖ్యంగా అమెరికా, భారత్‌, బ్రెజిల్‌, రష్యా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఇరాన్‌లో కేసులు పెరుగుతున్నాయి.

135కు పైగా దేశాల్లోకి విస్తరించిన డెల్టా వేరియంట్‌ కారణంగానే ఈ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒకవైపు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చురుగ్గా సాగుతున్నప్పటికీ, డెల్టా విజృంభణతో అమెరికా, బ్రిటన్‌ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అగ్రరాజ్యంలో రోజూవారీ కేసులు లక్షన్నర దాటుతుండగా, బ్రిటన్‌లో రోజూ సుమారు 35 వేల కేసులు నమోదవుతున్నాయి.

కరోనా తొలిసారిగా వెలుగుచూసిన చైనాలోనూ వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజూవారీ కేసులు వంద మార్కును దాటుతుండటంతో మహమ్మారి కట్టడికి అక్కడి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు బయటకు రాకుండా బయటినుంచి తాళాలు, ఇంటి తలుపులకు అడ్డుగా ఇనుపరాడ్లను పెట్టి దిగ్బంధిస్తున్నారు.