రాహుల్ గాంధీ పై కాంగ్రెస్ సీనియర్ నేత పీజే కురియన్ విమర్శలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా గతంలో రాహుల్ గాంధీ రాజీనామా చేయడం ఆయనలోని నిలకడలేమీకి నిదర్శనమన్నారు. పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఆయన ముందుండి పోరాడాలన్నారు. రాహుల్ గాంధీ అందరితో చర్చించిన తర్వాత పరిష్కారాన్ని గుర్తించాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు.
Read More »దేశంలో మళ్లీ కరోనా విజృంభణ
దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 1,247 మంది వైరస్ బారిన పడ్డారు. నిన్న సోమవారం దేశంలో వెలుగు చూసిన కేసులతో(2,183) పోల్చితే ఈ రోజు మంగళవారం కరోనాకేసుల సంఖ్య తగ్గింది. ఒకరు మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 11,860 ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్య 5,21,966కు చేరింది. కరోనా విజృంభిస్తుండటంతో హర్యాణా ప్రభుత్వం మాస్క్ తప్పనిసరి చేసింది.
Read More »ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడక్కడే ఆరుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలోని డిఒరియాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గౌరీబజార్ -రుద్రాపూర్ రోడ్డు మార్గంలోని ఇందూపూర్ కాళీ మందీర్ మలుపు వద్ద ఆర్ధరాత్రి SVU-బస్సు రెండు ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే సంఘటనా స్థలంలోనే ఐదుగురు మరణించగా.. ఓ …
Read More »ఇండియన్ ఆర్మీకి కొత్త చీఫ్..
ఇండియన్ ఆర్మీకి కొత్త చీఫ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండేను ఆర్మీ చీఫ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఈ పోస్టులో నరవణే ఉన్నారు. ఏప్రిల్ 30న ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త చీఫ్‌ను కేంద్రం నియమించింది. నరవణే తర్వాత సీనియర్‌గా ఉండటంతో మనోజ్ పాండేను నియమించింది. మరోవైపు బిపిన్ రావత్ అకాల మరణంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) …
Read More »ఓబీసీలకు మోదీ సర్కారు శుభవార్త
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఓబీసీలకు శుభవార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం . ఇందులో భాగంగా ఓబీసీల ఆదాయపరిమితిని రూ.10 లక్షలకు పెంచేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు కసరత్తు చేస్తోంది. సరిగ్గా ఐదేండ్ల కిందట అంటే 2017లో రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచింది బీజేపీ ప్రభుత్వం. తాజాగా దేశంలో ఉన్న పలు వివిధ రాజకీయ పార్టీలు ఈ పరిమితిని …
Read More »PK కాంగ్రెస్ లో చేరనున్నారా…?
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరనున్నారా? .. దేశంలో రానున్న రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల్లో ఆ పార్టీ కోసం పీకే బృందం పనిచేయనుందా? ఈ ప్రశ్నలకు తాజా పరిణా మాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.నిన్న శనివారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా, రాహుల్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలతో పీకే సమావేశమయ్యారు. రెండేళ్ల తర్వాత అంటే …
Read More »BJP కి దిమ్మతిరిగే షాక్
దేశంలో నాలుగు రాష్ర్టాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో నాలుగు అసెంబ్లీ..ఒక ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికలకు ముందు హిజాబ్, హలాల్ వంటి వివాదాస్పద అంశాలను తెరపైకి తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న కమలదళానికి తమ ఓటుతో బుద్ధిచెప్పారు ఓటర్లు. ఒక లోక్‌సభ, నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో …
Read More »వావ్.. హర్భజన్ గొప్ప మనసు.. ఎందుకో తెలుసా?
క్రికెటర్‌గా ఎంతో కీర్తి గడించిన హర్భజన్ సింగ్ ఇటీవల రాజకీయాల్లో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. మొదటి నుంచీ సేవా భావం ఉన్న భజ్జీ ఇవాళ మళ్లీ గొప్ప మనసు చాటుకున్నాడు. దీనికి సంబంధించిన ఓ కీలక ప్రకటన చేశారు. దేశం కోసం ఏదైనా చేస్తానంటూ ట్వీట్ చేసిన హర్భజన్.. రాజ్యసభ ఎంపీగా తనకొచ్చే జీతాన్ని రైతు కుమార్తెల చదువు, వాళ్ల సంక్షేమానికి వెచ్చిస్తానని ప్రకటించాడు. …
Read More »పంజాబ్ ప్రజలకు సూపర్ న్యూస్..ఇకపై ఫ్రీ!
పంజాబ్‌లో సీఎం భగవంత్ మాన్ ఆధ్వర్యంలోని ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం అక్కడి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆప్ సర్కారు నెలరోజుల పాలన పూర్తయిన సందర్భంగా కొత్త కానుక ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంటికీ నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు వెల్లడించింది. ఈ పథకాన్ని ప్రకటించేందుకు ముందు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో భగవంత్‌మాన్ సమావేశమై చర్చించారు. దీంతో ప్రభుత్వంపై …
Read More »ప్రపంచ ఆకలి సూచీలో భారత్ కు 101 స్థానం
ప్రపంచ ఆకలి సూచీ-2021 ప్రకారం భారత్ 101వ ప్లేస్లో నిలిచింది. మొత్తం 116 దేశాల్లో సర్వే నిర్వహించగా.. మనకంటే పాకిస్తాన్ (92), నేపాల్, బంగ్లాదేశ్ (76), మయన్మార్(71) మెరుగైన స్థానాల్లో ఉండటం గమనార్హం. చైనా సహా 18 దేశాలు టాప్ ఉన్నాయి. ఇక 2020లో భారత్ 94వ స్థానంలో ఉండగా తాజాగా 7 స్థానాలు దిగజారింది. ఆకలి, పౌష్టికాహార లేమి తదితర అంశాల ఆధారంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఈ …
Read More »