దసరా పండుగ సందర్భంగా దక్షిణ మద్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నది. సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్, కాకినాడకు నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్-నర్సాపూర్ స్పెషల్ ట్రెయిన్ (07456) ఈ నెల 14న రాత్రి 10.55 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుందని, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నర్సాపూర్ చేరుతుందని తెలిపారు. నర్సాపూర్-సికింద్రాబాద్ స్పెషల్ (07455) ఈ నెల 17న సాయంత్రం 6 గంటలకు బయల్దేరి …
Read More »దేశంలో కొత్తగా 21,257 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 21,257 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,39,15,569కి చేరింది. ఇందులో 2,40,221 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,32,25,221 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,50,127 మంది వైరస్ వల్ల మరణించారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 24,963 మంది బాధితులు మహమ్మారి బారినుంచి బయటపడగా, 271 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Read More »సింగరేణి కార్మికులకు రూ.72, 500 బోనస్
దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల కార్మికులకు లాభాల ఆధారిత బోనస్ (పీఎల్ ఆర్) రూ.72, 500 చెల్లించేందుకు కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు అంగీకరించాయి. ఈ మేరకు ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో యాజమాన్యాలు బోనస్‌పై చర్చించి పరస్పర అంగీకారానికి వచ్చాయి. గతేడాది బోనస్ రూ.68,500గా నిర్ణయించగా ఈసారి బోనస్ మొత్తాన్ని పెంచారు.ఈ నిర్ణయంతో సింగరేణి వ్యాప్తంగా 43 వేల మంది కార్మికులకు లబ్ధి కలగనుంది.
Read More »దేశంలో కొత్తగా 20,799 Carona Cases
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,799 పాజిటివ్ కేసులను నమోదు కాగా, 180 మంది మరణించారు. మరో 26,718 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 2,64,458 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,48,997 మంది. దేశంలో ఇప్పటి వరకు 90.79 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.
Read More »రైతులపై కార్లను ఎక్కించిన కేంద్ర మంత్రి తనయుడు
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖీరీ ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాక సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడి ఆశిష్ మిశ్రాపై మర్డర్ కేసు నమోదైంది. ఆశిష్ మిశ్రాతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, ఆయన కుమారుడిపై రైతులు లఖింపురి ఖీరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లడంతో …
Read More »West Bengal By Poll-భారీ ఆధిక్యంలో మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ ఉప ఎన్నికలో దూసుకెళ్తున్నారు. సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి ప్రియాంకా టిబ్రేవాల్‌పై నాలుగో రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి 12,435 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. నాలుగో రౌండ్ వరకూ మమతకు 16397 ఓట్లు, ప్రియాంకాకు 3692 ఓట్లు వచ్చాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా.. బీజేపీ నేత సువేందు చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. …
Read More »WestBengal ByPoll – ఆధిక్యంలో దీదీ
పశ్చిమ బెంగాల్‌లో మూడు అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికలకు ఆదివారం కౌంటింగ్ జరుగుతోంది. 10 గంటల వరకు అందిన ఫలితాల ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. రెండవ రౌండ్ కౌంటింగ్ ముగిసిన తర్వాత 2,800 ఓట్ల ఆధిక్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. భవానీపూర్, జంగిపూర్, సంసెర్గంజ్ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతోంది. భవానీపూర్ స్థానం నుంచి సీఎం మమతా బెనర్జీ పోటీ చేశారు. …
Read More »దేశంలో కొత్తగా 22,842 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 22,842 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,38,13,903కు చేరింది. ఇందులో 3,30,94,529 మంది కోలుకోగా, 4,48,817 మంది బాధితులు మృతిచెందారు. మరో 2,70,557 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో యాక్టివ్ కేసులు 199 రోజుల కనిష్టానికి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక గత 24 గంటల్లో 25,930 మంది కరోనా నుంచి బయటపడ్డారని, 244 మంది చనిపోయారని తెలిపింది. కాగా, …
Read More »కాంగ్రెస్ పార్టీకి షాకిస్తున్న వలసల పర్వం
కాంగ్రెస్ పార్టీకి వలసల పర్వం షాకిస్తున్న నేపధ్యంలో పంజాబ్, చత్తీస్‌ఘఢ్ అనుభవాల తర్వాత తాజాగా మేఘాలయలో ఆ పార్టీకి సంక్షోభం ఎదురుకానుంది. సీనియర్ నేత, మాజీ సీఎం ముకుల్ సంగ్మా కాంగ్రెస్‌ను వీడనున్నారనే ప్రచారం ఊపందుకుంది. సంగ్మాతో పాటు దాదాపు 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరతారని సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసే దిశగా మేఘాలయలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో …
Read More »దేశంలో కొత్తగా 18,795 కరోనా కేసులు
ఇండియాలో కొత్త 18,795 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 179గా ఉంది. కొత్తగా 26,030 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. ఇప్పటి వరకు వైరస్ బారిన పడి దేశంలో 4,47,373 మంది మరణించారు. మరో వైపు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకున్నది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కోటి మందికిపైగా …
Read More »