Home / NATIONAL / దేశంలో కొత్తగా 18,795 క‌రోనా కేసులు

దేశంలో కొత్తగా 18,795 క‌రోనా కేసులు

ఇండియాలో కొత్త 18,795 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 179గా ఉంది. కొత్త‌గా 26,030 మంది వైర‌స్ నుంచి కోలుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ చెప్పింది.

ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ బారిన ప‌డి దేశంలో 4,47,373 మంది మ‌ర‌ణించారు. మ‌రో వైపు కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరందుకున్న‌ది. గ‌త 24 గంట‌ల్లోనే దేశ‌వ్యాప్తంగా కోటి మందికిపైగా వ్యాక్సిన్ ఇచ్చారు.

ఇక మొత్తం టీకాలు తీసుకున్న‌వారి సంఖ్య 87 కోట్లు దాటింది. ఈ ఏడాది మార్చి 11వ తేదీ త‌ర్వాత ఒకే రోజు 20 వేల కేసుల క‌న్నా త‌క్కువ సంఖ్య‌లో కేసులు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టిసారి. నిన్న‌టితో పోలిస్తే కేసులు సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింది. నిన్న 26 వేల కేసులు న‌మోదు కాగా, 276 మంది మ‌ర‌ణించారు.