Home / SLIDER (page 389)

SLIDER

బాబాయ్‌గా అదే నేను నీనుంచి కోరుకుంటున్నా: బాలకృష్ణ

నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన బింబిసార సక్సెస్‌పై బాలకృష్ణ స్పందించారు. సినిమా అద్భుతంగా ఉందని ఇలాంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించినందుకు హ్యాట్సాఫ్ అంటూ కొనియాడారు. మొదటి సినిమా అయినప్పటికీ డైరెక్టర్ వశిష్ఠ్‌కి తనని తాను ఫ్రూవ్‌ చేసుకున్నావని త్వరలో మనం కలిసి పనిచేద్దాం అని అన్నారు బాలయ్య. కొత్త వారికి గొప్ప అవకాశాలిచ్చిన ఘనత తమ కుటుంబానికే దక్కుతుందని చెప్పారు. ఇలాంటి మరిన్ని సినిమాలను నువ్వు అందించాలని అదే నేను …

Read More »

రూ.80లక్షల కోట్ల అప్పు.. ఎవర్ని ఉద్దరించారు?: కేటీఆర్‌ ఫైర్‌

దేశ సంపదను పెంచే తెలివితేటలు ప్రధాని మోదీ ప్రభుత్వానికి లేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. సంపదను పెంచి పేదలక సంక్షేమానికి ఖర్చు చేసే మనసు వారికి లేదన్నారు. ఉచిత పథకాలు వద్దంటూ ఇటీవల ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పేదల పొట్ట కొట్టేందుకే ఉచిత పథకాలపై చర్చకు తెరతీశారని కేటీఆర్‌ విమర్శించారు. పేదల …

Read More »

ఎల్‌ఐసీ పాలసీదార్లకు గుడ్‌ న్యూస్‌..

ఎల్‌ఐసీ పాలసీదారులకు ఇది గుడ్‌ న్యూస్‌. ఇప్పటికే రద్దయిన పాలసీలను రెన్యువల్‌ చేసుకోవడానికి ఎల్‌ఐసీ ఓ మంచి అవకాశం కల్పించింది. కొంత మొత్తంలో ఫైన్‌తో పాలసీలను రెన్యువల్‌ చేసుకోవచ్చు. కొన్ని కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో ప్రీమియంలు సకాలంలో చెల్లించపోయి పాలసీ రద్దు అయితే అలాంటి వారికి అవకాశం కల్పిస్తున్నట్లు ఎల్‌ఐసీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇది పర్సనల్‌ పాలసీలకు మాత్రమే వర్తిస్తుంది. ఈనెల 17 నుంచి అక్టోబర్‌ 21 …

Read More »

లవర్‌కి హెచ్‌ఐవీ.. ఆ బ్లడ్‌ ఎక్కించుకున్న గర్ల్‌ఫ్రెండ్‌

ప్రియుడు లేదా ప్రియురాలిపై ప్రేమ ఉంటే దాన్ని ఎన్నో విధాలుగా వ్యక్తం చేయొచ్చు. కుటుంబసభ్యులు ఒప్పుకోకపోతే దానికీ ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయినా ఇవేమీ పట్టవన్నట్లు కొంతమంది మూర్ఖంగా వ్యవహరిస్తుంటూ కుటుంబాలను తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంటారు. అలాంటి ఘటనే అస్సాంలో చోటుచేసుకుంది. సౌల్‌కుచి జిల్లాకు చెందిన ఓ యువకుడిని ఓ యువతి ప్రేమిస్తోంది. ఫేస్‌బుక్‌లో చిగురించిన స్నేహం ప్రేమగా మారింది. ఒకరంటే ఒకరు విడిచి ఉండలేని విధంగా వారిద్దరూ ప్రేమలో …

Read More »

ఆ క్షణం నేను ఎంతో బాధపడ్డా: నాగచైతన్య

తన కెరీర్‌ ప్రారంభంలో జరిగిన ఓ సంఘటన తననెంతో బాధపెట్టిందని సినీనటుడు నాగచైతన్య అన్నారు. ఆ సంఘటనతో సినిమాల కోసం థియేటర్‌కు వెళ్లడమే మానేశానని చెప్పారు. ‘లాల్‌సింగ్‌ చడ్డా’ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా ఆయన ఓ ఇంటర్యూలో మాట్లాడారు. ప్రేక్షకుల రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూద్దామని తొలి సినిమా ‘జోష్‌’ ఆడుతున్న థియేటర్‌కు వెళ్లానన్నారు. ప్రేక్షకుల మధ్యే కూర్చొని సినిమా చూశానని.. తనను వాళ్లు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో …

Read More »

నేను వెనక్కి తగ్గను.. ఆయన్ను డిస్మిస్‌ చేయాల్సిందే: కోమటిరెడ్డి

చండూరు సభలో కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్‌చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సారీ చెప్పినా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శాంతించేలా కనిపించడం లేదు. అద్దంకి దయాకర్‌ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించిన తర్వాతే రేవంత్‌ చెప్పిన సారీపై ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్‌ సారీ చెప్పిన అంశాన్ని మీడియా ప్రతినిధులు కోమటిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఈ విధంగా …

Read More »

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సారీ చెప్పిన రేవంత్‌

కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సారీ చెప్పారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడిన నేపథ్యంలో ఆ నియోజకవర్గంలోని చండూరులో నిర్వహించిన కాంగ్రెస్‌ బహిరంగసభలో పార్టీ నేత అద్దంకి దయాకర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వెంకట్‌రెడ్డిని ఉద్దేశిస్తూ దయాకర్‌ పరుష పదజాలాన్ని వాడారు. దీన్ని ఆ పార్టీలోని కొంతమంది సీరియస్‌గా పరిగణించారు. అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని దయాకర్‌ఫై ఆగ్రహం వ్యక్తం …

Read More »

రక్షాబంధన్ స్పెషల్‌.. సెలబ్రిటీలు షేర్‌ చేసిన పిక్స్‌ ఇవే..

సోదరుడికి రాఖీ కట్టిన హీరోయిన్‌ హన్సిక సోదరితో సచిన్‌ టెండుల్కర్ మహేశ్‌బాబు కూతురు, కొడుకు అన్నలు వరుణ్‌తేజ్‌, రామ్‌చరణ్‌తో నిహారిక కేటీఆర్‌ కొడుకు హమాన్షు, కూతురు అలేఖ్య  వేడుకల్లో క్రికెటర్‌ దీపక్‌ చాహర్‌  

Read More »

ఆ నటితో కొణిదెల పవన్‌తేజ్ ఎంగేజ్‌మెంట్

ఈ కథలో పాత్రలు కల్పితం సినిమాతో వెండితెరకు పరిచయమైన కొణిదెల హీరో పవన్‌తేజ్ నిశ్చితార్థం బుధవారం ఘనంగా జరిగింది. ఇదే సినిమాలో హీరోయిన్‌గా నటించిన మేఘనతో పవన్‌తేజ్ పెళ్లిపీటలెక్కనున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకున్నాడు పవన్‌తేజ్.   ఈ కార్యక్రమానికి మెగాస్టార్ సతీమణి సురేఖ, సాయిధరమ్‌ తేజ్, రాజీవ్‌ కనకాల, సుమ, డైరెక్టర్ మెహర్ రమేశ్‌ తదితరులు హాజరయ్యారు. ” నిశ్చితార్థం జరిగింది. ప్రేమతో మా ప్రయాణం …

Read More »

తెలంగాణ ఎంసెట్ ఫలితాల విడుదల

రాష్ట్రంలో నేడు ఎంసెట్ ఫలితాలను ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. జులై నెలలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ఎంసెట్ పరీక్షలు జరిగాయి. ఇంజనీరింగ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్‌లో 88.34 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జేఎన్‌టీయూలో ఈ రిజల్స్ విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డికి ఫస్ట్ ర్యాంక్‌, సాయిదీపికకు సెకండ్ ర్యాంక్, కార్తికేయకు థర్డ్ ర్యాంక్ వచ్చాయి. అగ్రికల్చర్ విభాగంలో నేహాకు ఫస్ట్ ర్యాంక్, రోహిత్‌కు సెకండ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat