Home / SLIDER (page 487)

SLIDER

మీ చర్మం మెరవాలా..?

ఈ రోజుల్లో మాటిమాటికీ చర్మం పొడిబారిపోవడం అన్నది చికాకు కలిగించే వ్యవహారమే. ఈ సమస్యకు సోయాబీన్‌ ఆయిల్‌లో పరిష్కారం ఉందని అంటున్నారు వైద్య నిపుణులు. ♥ సోయా గింజల నుంచి తీసే ఈ నూనెలో లినోలెయిక్‌ యాసిడ్లు అధికం. ఇవి చర్మంలోని తేమను నిలిపి ఉంచుతాయి. ఒంట్లో నీటి శాతాన్ని పట్టి ఉంచి, చర్మం పొడిబారకుండా ఫ్యాటీ యాసిడ్లను విడుదల చేస్తాయి. తద్వారా చర్మం మృదువుగా ఉంటుంది. ♥ సోయాబీన్‌ నూనెను చర్మానికి …

Read More »

కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

తెలంగాణ  రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. హనుమాన్‌ జయంతి సందర్భంగా అర్ధరాత్రి నుంచే అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమాన్‌ మాలదారులు కాలినడకన తరలివస్తున్నారు. అంజన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. భారీసంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో కొండగట్టు కాషాయమయమయింది. ఆలయ పరిసరాలు జై శ్రీరామ్‌.. హనుమాన్‌ నామస్మరణతో మారుమోగుతున్నది.

Read More »

ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కోమటిపల్లి గ్రామంలో కాంగ్రెస్ నేతలు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో రెండు వర్గాల మధ్య జరిగిన వివాదంతో ఘర్షణ జరిగింది. జహీరాబాద్‌ లోక్‌సభ ఇన్‌ఛార్జ్‌ మదన్‌మోహన్‌రావు, ఎల్లారెడ్డి అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌ సుభాష్‌రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గల నేతలు ఒకరిపైఒకరు దాడి చేసుకున్నారు. ఇప్పటికే తెలంగాణలో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి.. ఇలాంటి …

Read More »

వెనకుండి రెచ్చగొట్టడం కాదు.. మీడియా ముందుకు రండి: వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌

పచ్చని కోనసీమలో కొన్ని సంఘ విద్రోహ శక్తులు అశాంతిని రేకెత్తించాయని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ఆరోపించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే కోనసీమకు డా బీఆర్‌ అంబేడ్కర్‌ పేరును రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందని చెప్పారు. చంద్రబాబు కూడా అంబేడ్కర్‌ జిల్లా పేరు పెడతామని చెప్పారని సుభాష్‌చంద్రబోస్‌ గుర్తుచేశారు. బయట ఒకలా..లోపల మరోలా చెప్పొద్దని.. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ మీడియా ముందుకు రావాలన్నారు. వెనుకనే ఉండి రెచ్చగొట్టడం సరికాదని ఆగ్రహం …

Read More »

ఘోరం.. బిల్డింగ్‌ కింద సుమారు 200 డెడ్‌బాడీలు..

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌లోని చాలా పట్టణాలు, నగరాలు ఇప్పటికే ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా పోర్ట్‌ సిటీ మేరియుపోల్‌ తీవ్రంగా నష్టపోయింది. మూడునెలలుగా రష్యా జరుపుతున్న దాడిలో వందలాది మంది చనిపోయారు. ఆ నగరంలో తాజాగా భయానక వాతావరణం నెలకొంది. కూలిపోయిన ఓ భవనం కింద సుమారు 200 డెడ్‌బాడీలు లభ్యమయ్యాయి. భవనం శిథిలాలను కార్మికులు తొలగిస్తుండగా మృతదేహాలను గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. డెడ్‌బాడీలు కుళ్లిపోయిన స్థితిలో …

Read More »

అంబేడ్కర్‌ పేరుకు అన్ని పార్టీలూ మద్దతు పలికాయి: సజ్జల

జిల్లాల విభజన సందర్భంలో కోనసీమ జిల్లాకు డా.బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలనే డిమాండ్లు వచ్చాయని.. దానికి అన్ని పార్టీలు కూడా మద్దతు పలికాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విస్తృతంగా డిమాండ్‌ ఉండటంతోనే అంబేడ్కర్‌ పేరును ప్రభుత్వం పెట్టిందని చెప్పారు. మహానేత అంబేడ్కర్‌ పేరు పెడితే అందరూ ఓన్‌ చేసుకోవాలని  సజ్జల అన్నారు. ప్రస్తుత పరిస్థితుల వెనుక ఏ శక్తులు ఉన్నాయో కానీ.. గతంలో మాత్రం అన్ని …

Read More »

అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత.. మంత్రి విశ్వరూప్‌ ఇంటికి నిప్పు!

అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ‘కోనసీమ’ జిల్లా పేరును మార్చవద్దంటూ అక్కడి యువకులు ఒక్కసారిగా భారీ ఆందోళనకు దిగారు. అమలాపురం పట్టణంలోని క్లాక్‌ టవర్‌ సెంటర్‌ వద్దకు చేరుకుని ‘కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడికి పోలీసులు చేరుకుని వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొందరు యువకులను అదుపులోకి తీసుకోగా వారు తప్పించుకుని పరుగులెత్తారు. వారిని పోలీసులు వెంబడించడం.. ఈ క్రమంలో …

Read More »

మంత్రి ఆదిత్య థాకరేతో మంత్రి KTR భేటీ

మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే, మంత్రి కే.టి.ఆర్ ను దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఐటి, లైఫ్ సైన్సెస్, ఫార్మా వంటి రంగాల్లో సాధిస్తున్న పురోగతి పైన చేపట్టిన కార్యక్రమాలపై ఆదిత్య థాకరే ఆసక్తి చూపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన హరితహారం, …

Read More »

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో నిరంజన్ రెడ్డి భేటీ

ఢిల్లీలోని కృషి భవన్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి భేటీ అయ్యారు. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, ఆయిల్ ఫామ్ కోసం ప్రాంతీయ పరిశోధన సంస్థ ఏర్పాటుపై నిరంజన్ రెడ్డి తోమర్‌తో చర్చించారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, జోగులంబా గద్వాల్, మరికొన్ని జిల్లాల్లో నల్ల తామర తెగులుతో రైతులు నష్టపోయారని తోమర్‌కు వివరించారు. ఈ తెగుళ్లను మార్కెట్లో ఉన్న మందులు …

Read More »

ప్ర‌తీ జిల్లాలో రేడియోల‌జీ ల్యాబ్ – మంత్రి హ‌రీశ్‌రావు

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 రేడియోలజీ ల్యాబ్ కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నామ‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో అన్నీ రకాల వైద్య పరీక్షలు పేదలకు అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. సిద్దిపేట జిల్లా ప్ర‌భుత్వ స‌ర్వ‌జ‌న ఆస్ప‌త్రిలో రేడియోల‌జీ హ‌బ్‌ను మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌డ్పీ చైర్మ‌న్ రోజాశ‌ర్మ‌, వైస్ చైర్మ‌న్ క‌న‌క‌రాజు, మున్సిప‌ల్ మాజీ చైర్మ‌న్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat