Breaking News
Home / LIFE STYLE / మీ చర్మం మెరవాలా..?

మీ చర్మం మెరవాలా..?

ఈ రోజుల్లో మాటిమాటికీ చర్మం పొడిబారిపోవడం అన్నది చికాకు కలిగించే వ్యవహారమే. ఈ సమస్యకు సోయాబీన్‌ ఆయిల్‌లో పరిష్కారం ఉందని అంటున్నారు వైద్య నిపుణులు.

♥ సోయా గింజల నుంచి తీసే ఈ నూనెలో లినోలెయిక్‌ యాసిడ్లు అధికం. ఇవి చర్మంలోని తేమను నిలిపి ఉంచుతాయి. ఒంట్లో నీటి శాతాన్ని పట్టి ఉంచి, చర్మం పొడిబారకుండా ఫ్యాటీ యాసిడ్లను విడుదల చేస్తాయి. తద్వారా చర్మం మృదువుగా ఉంటుంది.

♥ సోయాబీన్‌ నూనెను చర్మానికి రాసినప్పుడు అది చర్మం పైపొరల్లోకి ఇంకి పోయి.. తేమ ఆవిరైపోకుండా అడ్డుకుంటుంది. చర్మ నిర్మాణంలో కీలకమైన సిరమిడ్లు అనే కొవ్వులతయారీకి సోయా నూనె ఉపయోగపడుతుంది.

♥ సోయాలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు.. అతినీలలోహిత కిరణాల వల్ల చర్మం దెబ్బతినకుండా రక్షిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు పగుళ్లకు గురికాకుండా కాపాడతాయి.

♥ ఇందులో ఉండే విటమిన్‌ -ఇ, ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్లు, లెసిథిన్‌, జెనెస్తీన్‌.. లాంటివి చర్మాన్ని కాలుష్యాల నుంచి రక్షిస్తాయి. చర్మకణాల మరమ్మతులో సాయపడతాయి.

♥ ఈ నూనెలోని విటమిన్‌-ఇ చర్మానికి నిగారింపునిస్తుంది. పగుళ్లూ, దురదలు దరిచేరకుండా చేస్తుంది. కాస్మొటిక్‌ సర్జరీల తర్వాత చర్మం కోలుకునేందుకూ ఈ నూనె ఉపయోగపడుతుంది. ఇందులోని లిపిడ్‌లుగా పిలిచే ఆర్గానిక్‌ కాంపౌండ్‌లు చర్మ పునర్నిర్మాణానికి ఎంతగానో సహాయ పడతాయి.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum