ఈ రోజుల్లో ఒక్క హిట్ వచ్చిందంటే చాలు హీరోయిన్లకు మంచి గుర్తింపు వచ్చేస్తుంది. కృతి శెట్టి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రస్తుతం ఈమె వరస సినిమాలతో బిజీగా ఉంది. కృతి తర్వాత జాతిరత్నాలు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఫరియా అబ్దుల్లా కూడా మంచి గుర్తింపే తెచ్చుకుంది. కానీ అవకాశాలు మాత్రం అంతగా రావడం లేదు. జాతిరత్నాలు సూపర్ హిట్ అవ్వడంతో దాదాపు అందరికీ గ్యాప్ లేకుండా ఆఫర్లు వచ్చాయి. ముఖ్యంగా …
Read More »ఎఫ్ 3 లో సీనియర్ హీరోయిన్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇందులో సీనియర్ హీరోయిన్‌ని తీసుకోనున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా చాలా వరకు పూర్తయిందట. మరో షెడ్యూల్ షూటింగ్ జరిగితే …
Read More »నాగ్ మూవీలో హాట్ యాంకర్
కింగ్ నాగార్జున నటిస్తున్న సినిమాలో బుల్లితెర హాట్ యాంకర్..హీరోయిన్ రష్మీ గౌతమ్ నటించే అవకాశం దక్కించుకుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ‘వైల్డ్ డాగ్’తో వచ్చిన నాగార్జున సూపర్ హిట్ అందుకున్నాడు. ఆయన నెక్స్ట్ సినిమాను ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల షూటింగ్ మొదలై కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. త్వరలో మళ్ళీ సెట్స్ మీదకు రానున్న …
Read More »తమిళనాడు వ్యాప్తంగా 3000 పడకలను ఏర్పాటు చేసిన హైదరాబాద్ మేఘా సంస్థ
దేశంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా పేషంట్లను ఆదుకునేందుకు వివిధ ప్రభుత్వాలకు సహాయసహకారాలు అందిస్తున్న విధంగానే హైదరాబాద్ కు చెందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ . తాజాగా తమిళనాడు వ్యాప్తంగా ఉచితంగా 2500 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా మదురైలో కేవలం 72 గంటల్లోనే 500 ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకర్లను, బెడ్స్ ను, ఆస్పత్రులకు …
Read More »యువతకే ముప్పు ఎక్కువ
భారత్ ను సెకండ్ వేవ్ వణికిస్తున్న సమయంలో యువత ఎక్కువగా మహమ్మారి బారిన పడుతున్నారు. మే నెలలోని మొత్తం కేసుల్లోని దాదాపు 26 శాతం.. 18-30 ఏళ్ల వారిలోనే నమోదయ్యాయి. వీరి తర్వాత 31-40 ఏళ్ల వారు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. 18-44 ఏళ్ల వయసువారికి వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చినా.. టీకాల కొరతతోనే చాలా రాష్ట్రాల్లో అది అమలు కావట్లేదు.
Read More »వంటలక్క మాస్ లుక్..పోలా అదిరిపోలా
బుల్లితెరపై డీసెంట్ గా ఉండే వంటలక్క.. తాజాగా ఓ మాస్లుక్తో నెట్టింట వైరల్ గా మారింది. నటి ప్రేమి విశ్వనాథ్ కొత్త లుక్ను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. లుంగీ కట్టు, పూల చొక్కా, చేతిలో సిగరెట్, నోటి నుంచి గుప్పుమని పొగ చూసి.. ‘వాట్ ఏ ఫోజ్’ అంటున్నారు. అల వైకుంఠపురములో అల్లుఅర్జున్ లుక్ను అచ్చుగుద్దినట్లు దించేసిన ప్రేమి.. ఆ ఫొటో తన బ్రదర్ తీసినట్లు పేర్కొంది.
Read More »తానేమి తక్కువ కాదంటున్న నిధి అగర్వాల్
టాలీవుడ్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ సేవా కార్యక్రమాలతో అందరి మనసులు గెలుచుకుంటోంది. గతేడాది కరోనా సమయంలో తన వంతు సాయం చేసిన నిధి.. తాజాగా ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ పేరుతో ఒక ఆర్గనైజేషన్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కష్టకాలంలో ఎవరికి సాయం కావాలన్నా అడగాలని, తనకు చేతనైన సాయం చేస్తానని తెలిపింది. ఆర్గనైజేషన్ కోసం తనతో పాటు తన టీం కూడా పని చేస్తుందని నిధి పేర్కొంది.
Read More »బ్లాక్ ఫంగస్ కేసుల్లో 65% ఆ 5రాష్ట్రాల్లోనే
దేశంలో మొత్తం బ్లాక్ ఫంగస్ కేసుల్లో 65% ఐదు రాష్ట్రాల్లో ఉన్నాయని కేంద్రం తెలిపింది. గుజరాత్లో 2,859, మహారాష్ట్రలో 2,770, APలో 768, మధ్యప్రదేశ్లో 752, తెలంగాణలో 744 కేసులు ఇప్పటివరకు నమోదైనట్లు పేర్కొంది. ఈ చికిత్సకు ఉపయోగించే యాంపోటెరిసిన్-B ఇంజక్షన్లను ఆయా రాష్ట్రాలకు అదనంగా సరఫరా చేస్తున్నట్లు కేంద్రమంత్రి సదానందగౌడ తెలిపారు. APకి ఇప్పటివరకు 1930, తెలంగాణకు 1890 వయల్స్ ను కేంద్రం అందించింది.
Read More »సీఎం స్టాలిన్ కు తలనొప్పిగా మారిన ఆ మంత్రి
తమిళనాడు మంత్రి పీకే శేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతదేశానికి చెందిన వారు, తమిళనాడులో ఉంటూ ధనవంతులుగా మారారని, దానికి కారణం తమపార్టీనే అని వ్యాఖ్యానించారు. కానీ, వారు బీజేపీకి ఓటు వేశారని మండిపడ్డారు. వారు EVMల ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవచ్చని బెదిరించారు. ఈ వ్యాఖ్యలు CM స్టాలిన్కు తలనొప్పులు తెచ్చిపెట్టేవేనని నిపుణులు అంటున్నారు.
Read More »విరాట్ నెంబర్ 2..రోహిత్ శర్మ నెంబర్ 3..
ఐసీసీ వన్డే బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా రెండు, మూడు స్థానాలను నిలబెట్టుకున్నారు. పాకిస్థాన్ బ్యాట్స్మన్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే ఆల్ రౌండర్ల జాబితాలో బంగ్లా ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు.
Read More »