ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాత్, ఆయన భార్య లావణ్య విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఆయన కుమారుడు, నటుడు ఆకాశ్ పూరీ స్పందించారు. ‘చోర్ బజార్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రులు విడిపోవడంపై ప్రశ్నించగా ఆకాశ్ పూరీ ఖండించాడు. అలాంటి వార్తలు వచ్చినట్లు తనకు తెలియదని.. అవన్నీ ఫేక్ అని చెప్పాడు. ఏం చేయాలో …
Read More »Blog Layout
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సింప్లిసిటీ..
ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము తన నిరాడంబరతను చాటుకున్నారు. తన స్వస్థలంలో ఓ ఆలయానికి వెళ్లిన ఆమె.. అక్కడ స్వయంగా చీపురు పట్టి ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ద్రౌపది ముర్ము స్వస్థలం ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా రాయ్‌రంగ్‌పూర్. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికైన నేపథ్యంలో ఆమె అక్కడి శివాలయానికి వెళ్లి ఆలయ పరిసరాలను ఊడ్చారు. ఇప్పటికే గవర్నర్, మంత్రి, ఎమ్మెల్యే పదవులు చేపట్టిన …
Read More »1998 డీఎస్సీ.. వైసీపీ ఎమ్మెల్యేకి టీచర్ జాబ్!
సీఎం జగన్ తీసుకున్న చొరవతో 1998 డీఎస్సీ అభ్యర్థుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. ఇటీవల ఎంపిక జాబితాను ప్రభుత్వం ప్రకటించగా అందులో వైసీపీకి చెందిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ఉన్నారు. అన్నామలై యూనివర్సిటీలో బీఈడీ చేసిన ఆయన.. సుమారు పాతికేళ్ల క్రితం డీఎస్సీ రాశారు. వివిధ కారణాలతో 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఇన్నాళ్లూ నిరీక్షణ తప్పలేదు. ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసిన జాబితాలో ధర్మశ్రీ పేరు ఉండటంతో …
Read More »రాష్ట్రపతి ఎన్నిక.. కేసీఆర్ మద్దతు ఆయనకేనా!
రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మద్దతు ఎవరికి ఉంటుంది? ఈ విషయంలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. టీఆర్‌ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని రాజకీయాలపై ఆసక్తి ఉన్న అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి, కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ మద్దతిస్తారని శరద్ పవార్ చెప్పారు. ముంబయిలో …
Read More »ఏపీలో చురుగ్గా రోడ్ల మరమ్మతు పనులు: సీఎం జగన్
రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలను వెంటనే పూర్తిచేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే పనులు చేపట్టాని స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కర్యాలయంలో ఆర్‌అండ్‌బీ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు చురుగ్గా సాగుతున్నాయని.. నాడు-నేడుతో చేపట్టే పనుల్లో పురోగతి కనిపిస్తోందని చెప్పారు. జులై 15 నాటికి గుంతలన్నీ పూడ్చాలని.. 20న ఫొటో గ్యాలరీలో పెట్టాలని సీఎం …
Read More »దేశంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు: కేటీఆర్
టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన ఈ 8 ఏళ్లలో హైదరాబాద్‌లో 30 ఫ్లైఓవర్లు నిర్మించిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. మరో 17 ఫ్లైఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి సూచిక ప్రజా రవాణా, రహదారులేనని చెప్పారు. కూకట్‌పల్లిలోని కైతలాపూర్ వద్ద రూ.84 కోట్లతో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. …
Read More »ట్రోలర్స్‌కి సమంత స్ట్రాంగ్ కౌంటర్..!
మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచారు సమంత, నాగచైతన్య. ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన ఈ జంట ప్రస్తుతం మూవీలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. ఇటీవల గూఢాచారి, మేజర్ సినిమాలతో మెప్పించిన నటి శోభిత ధూళిపాళతో చైతూ డేటింగ్‌లో ఉన్నాడంటూ గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో సమంతపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఆమే ఇలా చేయిస్తోందంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో సమంత …
Read More »“యోగా ఫర్ హ్యూమానిటీ”.. నేడు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం
ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా “యోగా ఫర్ హ్యూమానిటీ”అనే థీమ్‌తో ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మానసిక, శారీరక వికాసానికి యోగా చాలా ముఖ్యం. దేశ వ్యాప్తంగా ప్రముఖులు, సినీతారలు ప్రత్యేక సందేశాలను అందిస్తూ యోగా ఆసనాలు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మైసూర్‌లో యోగా దినోత్సవ వేడుల్లో పాల్గొన్నారు. కాశ్మీర్‌తో పాటు పలు చోట్ల ఆర్మీ అధికారులు, సిబ్బంది ప్రత్యేక ఆసనాలతో అలరించారు. క్రికెటర్లు …
Read More »కత్తి తీసినా.. ఎస్సై భయపడకుండా కుమ్మేశాడు!
ఓ ఎస్సై దుండగుడితో పోరాడి అతడిని నిలువరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన కేరళలో జరిగింది. అలప్పుజ జిల్లా కాయంకులమ్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడి ముందు పోలీసులు జీపు ఆపే ప్రయత్నం చేశారు. ఎస్సై అరుణ్‌కుమార్ కిందికి దిగుతుండగా.. దుండగుడు గమనించి వెంటన తన బైక్‌లో ఉంచి కత్తిని బయటకు తీసి ఎస్సైపైకి దాడికి యత్నించాడు. వెంటనే …
Read More »కేసీఆర్ సీఎం అయ్యాకే రైతులకు గౌరవం: హరీష్‌రావు
కేసీఆర్ సీఎం అయ్యాక రైతులకు గౌరవం దక్కడంతో పాటు భూముల ధరలు పెరిగాయని తెలంగాణ మంత్రి హరీష్‌రావు అన్నారు. అభివృద్ధి కేవలం కేసీఆర్ వల్లే సాధ్యమైందని చెప్పారు. కాళేశ్వరం నీళ్లు హైదరాబాద్‌కు తెచ్చిన ఘనత కూడా ఆయనదేనన్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌లో రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుతో 14 గ్రామాలకు తాగునీరు అందుతుందని చెప్పారు. రూ.37కోట్ల …
Read More »