Home / NATIONAL / శబరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

శబరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్‌ నగరం నుండి  తిరువనంతపురం వెళ్తున్న  శబరి ఎక్స్‌ప్రెస్‌కు ఏపీలోని గుంటూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. గుర్తుతెలియని దుండగులు గుంటూరు రైల్వేస్టేషన్‌కు సమీపంలోని కంకరగుంట గేటు వద్ద రైల్వేట్రాక్‌పై అడ్డంగా ఇనుపరాడ్‌ను కట్టారు.

ఎవరికి అనుమానం రాకుండా దానిపై అట్టముక్కలు పెట్టారు. పది నిమిషాల్లో శబరి ఎక్స్‌ప్రెస్‌ ఈ మార్గంలో వెళ్లే సమయంలో స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు.అక్కడ ఉన్న సీసీ ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. స్థానికులు ఇనుపరాడ్‌ను గమనించకపోతే పెను ప్రమాదం జరిగేదని పోలీసులు తెలిపారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat