Home / NATIONAL / ఉత్తరాఖండ్ సీఎంగా తీరత్ సింగ్ రావత్ రాజీనామా

ఉత్తరాఖండ్ సీఎంగా తీరత్ సింగ్ రావత్ రాజీనామా

ఉత్తరాఖండ్ సీఎంగా తీరత్ సింగ్ రావత్ రాజీనామా చేశారు. గవర్నర్ బేబీ రాణీ మౌర్యకు ఆయన తన రాజీనామా సమర్పించారు. CMగా తీరత్ సింగ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సెప్టెంబర్ 10 నాటికి 6 నెలలు ముగుస్తుంది.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 చోట్ల సెప్టెంబర్ 10 లోపు ఉపఎన్నికల నిర్వహణ సాధ్యం కానందునే ఆయన రాజీనామా చేశారు. తీరత్ బాధ్యతలు చేపట్టి 4 నెలలే కావడం గమనార్హం. రేపు ఉత్తరాఖండ్ బీజేపీ శాసనసభాపక్ష భేటీ జరగనుంది.