కరోనా కట్టడి, మహిళల రక్షణపై ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేసే మరో ఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగుచూసింది. స్టేట్ హోంలో ఆశ్రయం పొందుతున్న 57 మంది బాలికలకు కరోనా పాజిటివ్‌గా తేలడం.. వారిలో ఐదుగురు గర్భవతులు ఉండటం అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. వివరాలు.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో యూపీ ప్రభుత్వ షెల్టర్ హోంలో ఉంటున్న బాలికలకు ఇటీవల కోవిడ్ నిర్ధారణ టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో 57 మందికి …
Read More »చైనా వస్తువులను నిషేధాలు సాధ్యమా?
గల్వన్ లోయలో జరిగినదానికి ఆగ్రహం కట్టలు తెంచుకోవడం, ఆవేశపడడం, దేశభక్తితో ఉర్రూతలూగిపోవడం సహజమే కావచ్చు. ఆ మనోభావాలను అర్థం చేసుకోవచ్చును. కానీ, జనావేశాలను ఆధారం చేసుకుని యుద్ధాలు చేయడం కానీ, నిషేధాలు ఆంక్షలు విధించడం కానీ జరగవని ప్రజలకు అర్థంకావడానికి సమయం పడుతుంది. బహుశా ప్రభుత్వాలు కూడా, జనం ఆక్రోశం చల్లారనీ అన్నట్టుగా, ఆవేశకావేశాలను కొంత కాలం అనుమతిస్తాయి. ఫలితంగా, ప్రత్యేకంగా ఒక దేశంమీద, అక్కడి ప్రజలమీద, దానికి సంబంధించిన …
Read More »ఇప్పుడు రాజ్ నీతి కాదు రణ్ నీతి కావాలి -సీఎం కేసీఆర్
భారత-చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని, అదే సందర్భంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని ప్రధానమంత్రికి సూచించారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పుడు కావల్సింది రాజకీయం (రాజ్ నీతి) కాదని, యుద్ధనీతి (రణ్ నీతి) కావాలని చెప్పారు. …
Read More »సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి కేంద్ర హోం సహయక శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా నివారణకు అవసరమైన నియంత్రణ చర్యలు,కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తున్న పలు సూచనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆయన సీఎం కేసీఆర్ కు సూచించారు.రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్,సికింద్రాబాద్ జంట నగరాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.. ప్రజలకు భరోసా …
Read More »కొత్త విద్యాసంవత్సరంపై కేంద్ర కీలక ప్రకటన
దేశ వ్యాప్తంగా రాబోయే విద్యాసంవత్సరానికి పాఠ్యాంశాల కుదింపు, తరగతుల నిర్వహణ సమయాన్ని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ నిశాంక్ తెలిపారు. ఈ మేరకు ‘సిలబస్ ఫర్ స్టూడెంట్స్ 2020’ హ్యాష్‌ట్యాగ్ పేరుతో ట్విటర్, ఫేస్‌బుక్ ద్వారా ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, పాఠశాల నిర్వాహకులు వారి ఆలోచనలు, సూచనలు తనతో పంచుకోవాలని మంత్రి కోరారు. వాటిని తుది నిర్ణయంలో పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ‘‘ …
Read More »కేంద్రం సంచలన నిర్ణయం..కరోన కట్టడి కోసం ఆ రాష్ట్రాల్లో ఇంటింటి సర్వే
దేశవ్యాప్తంగా కొన్ని నగరాలు, పట్టణాల్లో కొవిడ్-19 పరిస్థితి దారుణంగా ఉండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇంటింటి సర్వే చేపట్టడం, వెంటనే పరీక్షలు నిర్వహించడం, వైరస్ వ్యాప్తి, మరణాలను కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలని సూచించింది. పది రాష్ట్రాల్లోని 38 జిల్లాల్లో 45 స్థానిక సంస్థలకు ఈ మేరకు దిశానిర్దేశం చేసింది. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్, వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్‌తో కేంద్ర ఆరోగ్యశాఖ …
Read More »బడి గంట మ్రోగేది అప్పుడేనా..
దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో బోధన ఆగస్టు తర్వాత ప్రారంభం కావచ్చని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ నిశాంక్ ప్రకటించారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హోంశాఖ అనుమతించిన మీదటే నూతన విద్యా సంవత్సరంలో కార్యకలాపాలు మొదలుపెడతామని ఆయన స్పష్టం చేశారు. కొవిడ్-19 పరిస్థితులను పూర్తిగా అంచనా వేసిన అనంతరం మాత్రమే.. ఈ అంశంపై నిర్ణయం సాధ్యమని మంత్రి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయాలలో బోధన కూడా ఆగస్టు తర్వాతనే …
Read More »కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి అర్జున్ చరణ్ సేథీ(78) కన్నుమూశారు. భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 2000-2004 మధ్య వాజ్‌పేయ్ ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా అర్జున్ చరణ్ సేథీ సేవలందించారు. 1971లో భద్రక్ లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 1980, 1991, 1998, 1999, 2004, 2009 ఎన్నికల్లో అర్జున్ చరణ్ సేథీ లోక్‌సభకు ఎన్నికయ్యారు. రెండు …
Read More »ప్రధాని మోదీ కంటే సీఎం కేసీఆర్ భేష్
లాక్‌డౌన్ మరో రెండు, మూడు వారాలు పొడిగించాలని రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. కరోనా మహమ్మారిని పకడ్బందీగా ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా పనిచేస్తున్నారని తెలంగాణ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. మే 7వ తేదీ తర్వాత తెలంగాణలో లాక్‌డౌన్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కరోనాను పూర్తిస్థాయిలో అంతం చేసేందుకు రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగించాలా? వద్దా? అని ప్రముఖ న్యూస్ ఛానల్ సర్వే నిర్వహించింది. ఏప్రిల్ 29 నుంచి …
Read More »మద్యం ప్రియులకు శుభవార్త
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించిన విషయం విదితమే. అయితే గ్రీన్ జోన్లలో మద్యం, పాన్ దుకాణాలను అనుమతి ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం, పాన్ షాపుల వద్ద 6 అడుగులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దుకాణాల వద్ద ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ రెండో దఫా ఈ …
Read More »