దేశంలో గత నెల రోజులుగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో యాక్టివ్ కేసులు కూడా అధికమవుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 10,093 మంది వైరస్ బారిన పడగా, 23 మంది మృతిచెందారు. తాజా కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 4,48,18,115కు చేరింది. ఇందులో 57,542 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,31,114 మంది మరణించారు. మరో 4,42,29,459 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రోజురోజుకు కరోనా కేసులు …
Read More »ఢిల్లీలో పెరిగిపోతున్న కరోనా కేసులు
దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనేఉన్నాయి. తాజాగా రోజువారీ పాజిటివ్ కేసులు వెయ్యికి చేరువయ్యాయి. మంగళవారం రాత్రి వరకు ఢిల్లీలో 980 మంది మహమ్మారి బారినపడ్డారు. దీంతో గతేడాది ఆగస్టు 20 తర్వాత ఒకే రోజు ఇన్ని కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. గత ఆగస్టు 20న ఢిల్లీ మహానగరంలో 1,190 కేసులు రికార్డయ్యాయి. మంగళవారం 3772 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ప్రతి నలుగురిలో ఒకరికి …
Read More »దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త కేసుల పెరుగుదలకు XBB 1.16 కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త వేరియంట్ పిల్లలపై ప్రభావం చూపడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వేరియంట్ బారిన పడుతున్న వారిలో కొత్త లక్షణాలు గుర్తిస్తున్నట్లు పిల్లల డాక్టర్లు చెబుతున్నారు. అధిక జ్వరం, జలుబు, దగ్గు వంటివాటితో పాటు కళ్లు పుసులు కట్టడం, దురదగా ఉండటం వంటి లక్షణాల గురించి ఫిర్యాదు వస్తున్నట్లు వెల్లడించారు.
Read More »దేశంలో కొత్తగా 3,016 కరోనా వైరస్ కేసులు
దేశంలో గత రెండు వారాలుగా కొద్దిరోజులుగా కరోనా విజృంభిస్తోంది. దేశంలో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఒక్కసారిగా 40% కేసులు పెరిగినట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో మొత్తంగా 3,016 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు 2,151గా ఉన్న కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపించింది. దీంతో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కేసులు దేశవ్యాప్తంగా 13,509కి చేరాయి. కొత్తగా 14 మరణాలు సంభవించినట్లు కేంద్రం ప్రకటించింది.
Read More »దేశంలో కరోనా వైరస్ మహమ్మారి అల్లకల్లోలం
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి కరోనా పాజిటీవ్ కొత్త కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే, నిన్నమొన్నటితోపోలిస్తే నేడు కొత్త కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. వరుసగా రెండు రోజులు 1,800లకు పైనే నమోదైన కొత్త కేసులు.. నేడు 1,500వేలకు పడిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖఅధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,20,958 మందికి వైరస్ నిర్ధారణ …
Read More »వామ్మో.. చైనాలో మరోసారి లాక్‌డౌన్..!
చైనా ప్రభుత్వం తన జీరో కోవిడ్ విధానంలో భాగంగా లాక్‌డౌన్, క్వారంటైన్లు విధిస్తోంది. సోమవారం ఒక్క రోజే చైనాలో 1,552 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఈ నెల 10 నుంచి 12 వరకు చైనాలో కొత్త ఏడాది సెలవులు రావడం వల్ల ఎక్కువ మంది రోడ్లెక్కి ప్రయాణాలు చేసి కొవిడ్ వ్యాప్తికి కారణమవుతారని లాక్‌డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. అయితే ఈ లాక్‌డౌన్ ప్రభావం ఆరున్నర కోట్ల …
Read More »తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా సోకడంతో ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడక ఈ రోజు చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని హాస్పిటల్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. అలసట, జ్వరంగా అనిపించడంతో కరోనా టెస్ట్‌లు చేయించుకోగా పాజిటివ్‌గా వచ్చిందని సీఎం ట్విట్టర్ ద్వారా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని, వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ప్రజలను …
Read More »కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ఇంట విషాదం
కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కూతురు యోగితా సోలంకి (42) కరోనా సోకి మరణించారు. గత వారం రోజులుగా ఆమె ఇండోర్లోని మెదంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల్లో 80 శాతం వరకు వైరస్ వ్యాపించిందని వైద్యులు తెలిపారు
Read More »దేశంలో మళ్లీ కరోనా కలవరం
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 32,080 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటికంటే 21 శాతం ఎక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న దేశంలో 26,567 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,35,850కి చేరాయి. ఇందులో 3,78,909 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారినపడినవారిలో ఇప్పటివరకు 92,15,581 మంది బాధితులు కోలుకున్నారు. ఇందులో గత 24 …
Read More »విజయవాడ కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు కరోనా రోగులు మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కొవిడ్ కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కొవిడ్ బాధితులు మృతి చెందినట్లు విజయవాడ సీపీ శ్రీనివాసులు స్పష్టం చేశారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని సీపీ చెప్పారు అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఆ సెంటర్‌లో …
Read More »