రక్షాబంధన్ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు ఆయన అక్కలు రాఖీ కట్టారు. ప్రగతిభవన్‌కు సోమవారం వచ్చిన సీఎం అక్కలు లలితమ్మ, సకలమ్మ, లక్ష్మీబాయి, వినోదమ్మ ఆయనకు స్వీట్లు తినిపించి రక్షాబంధన్ కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అన్నదమ్ములు అక్కాచెల్లెండ్ల ప్రేమ, అనురాగానికి గుర్తుగా నిలుస్తుందన్నారు.
Read More »27 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణపతి
వినాయక చవితి పండుగ అనగానే హైదరాబాదీలతో పాటు మిగతా ప్రాంతాల వారికి ఖైరతాబాద్ గణపతి గుర్తుకు వస్తాడు. ప్రతి ఏడాది ఈ భారీ వినాయకుడిని చూసేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహం చూపుతుంటారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది 27 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణపతిని ప్రతిష్టించాలని గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది. విగ్రహం ఎత్తు 27 అడుగులే కావడంతో పూర్తిగా మట్టి వినాయకుడిని ప్రతిష్టించాలని కమిటీ భావిస్తోంది. ఈసారి ధన్వంతరి …
Read More »చిలుకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్క..!
మేడారం జాతరలో మరో ప్రధాన ఘట్టం.. చిలకల గుట్ట నుంచి సమ్మక్క మేడారంలోని గద్దె పైకి బయల్దేరింది. చిలకలగుట్టపై కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొని పూజారులు మేడారానికి బయల్దేరారు. ములుగు జిల్లా పోలీస్ అధికారి సంగ్రామ్ సింగ్ పాటిల్ గాల్లోకి మూడు రౌండ్ కాల్పులు జరిపి సమ్కక్క ఊరేగింపును ప్రారంభించారు. ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం డప్పు వాయిద్యాలు,నృత్యాలు, కొమ్ము నృత్యాలతో గద్దెల పైకి ప్రతిష్ఠిచేందుకు పూజారులు తీసుకుని …
Read More »చిలుకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్క
మేడారం జాతరలో మరో ప్రధాన ఘట్టం.. చిలకల గుట్ట నుంచి సమ్మక్క మేడారంలోని గద్దె పైకి బయల్దేరింది. చిలకలగుట్టపై కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొని పూజారులు మేడారానికి బయల్దేరారు. ములుగు జిల్లా పోలీస్ అధికారి సంగ్రామ్ సింగ్ పాటిల్ గాల్లోకి మూడు రౌండ్ కాల్పులు జరిపి సమ్కక్క ఊరేగింపును ప్రారంభించారు. ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం డప్పు వాయిద్యాలు,నృత్యాలు, కొమ్ము నృత్యాలతో గద్దెల పైకి ప్రతిష్ఠిచేందుకు పూజారులు తీసుకుని వస్తున్నారు …
Read More »ఎవరు ఈ సమ్మక్క..?
రేపటి నుండి సమ్మక్క సారలమ్మ జాతర జరగనున్న సంగతి విదితమే. అయితే సమ్మక్క ఎవరు.. సారలమ్మ ఎవరు..? అనే విషయం ఎవరికి తెలియదు.. అయితే సమ్మక్క ఎవరో తెలుసుకుందామా..?. 13వ శతాబ్ధంలో కోయరాజ్యం (ప్రస్తుతం మేడారం) కాకతీయ రాజ్యంలో సామంత రాజ్యంగా ఉండేది. ఆ రాజ్యాన్ని కోయలే పాలించుకుంటూ ఉండేవారు. ఒకరోజు వేటకు వెళ్ళిన కోయలకు ఓ దృశ్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పాము పుట్టపై ఒక చిన్నారి పడుకుని ఉంటుంది. …
Read More »ఉన్నతాధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్
ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 8 వరకు మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్ హర్ మహేష్ దత్ …
Read More »తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు..!
సంక్రాంతి అనగా నూతన క్రాంతి . సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన కాలెండరులో ప్రతినెల ఒక …
Read More »అసలు భోగి పండుగ ఎలా వచ్చింది..పూర్తి వివరాల్లోకి వెళ్తే ?
భోగి పండుగ గురించి పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది. భుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ దినమే శ్రీ రంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భొగాన్నిపొందిందని దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది పురాణాలు తెలియజేస్తున్నాయి.శ్రీమహా విష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ గాథ మనందరికీ తెలిసిందే అయితే తరువాత బలి చక్రవర్తికి …
Read More »భోగిమంటల వెనుక ఓ పరమార్థం దాగి ఉందట..అదేంటో తెలుసుకుందాం !
భోగి పండుగ అనగానే పెద్దవాళ్లదగ్గర నుంచి చిన్నవాళ్ల వరకు ఎంతో ఉత్సాహంగా భోగిమంటలు వేస్తారు.ఈ భోగిమంటల్లో ఆవు పిడకలతో పాటు, ఇంట్లోని పాత వస్తువులను ఈ మంటల్లోకి విసిరేస్తారు. ఎవరు ఎక్కువ వస్తువులు తెచ్చి మంటల్లో వేస్తే వారు గొప్ప అన్న మాట.అయితే ఈ భోగిమంటల వెనుక ఓ పరమార్థం దాగి ఉంది. పనికి రాని చెడు పాత ఆలోచనలను వదిలించుకొని కాలంతో బాటు వచ్చే మార్పులను ఆహ్వానించేందుకు మనసును …
Read More »రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు…!
రేపు భోగి పండుగతో సంక్రాంతి సంబురాలు ప్రారంభం కానున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలోని చెడునంతా దహనం చేసి…జీవితంలోకి భోగ భాగ్యాల్నీ, కొత్త ఆశల్నీ, లక్ష్యాల్నీ ఆహ్వానించే పండుగదినం..భోగి అని సీఎం అన్నారు. ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విలసిల్లేలా దేవతలు దీవించాలని ముఖ్యమంత్రి ప్రార్ధించారు. ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ ఇంటా సుఖశాంతులు, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం …
Read More »