కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కౌసల్య కాలనీకి చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద స్థానిక కార్పొరేటర్ ఆగం రాజు గారి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న వర్షపు నీటి నాలా పనులు వేగంగా పూర్తి చేయాలని, కాలనీ ఎంట్రెన్స్ నుండి మొదలుకొని మియాపూర్ మెయిన్ రోడ్డు వరకు బాక్స్ నాలాను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారిని కోరారు.
దీంతో ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.