తెలంగాణ రాష్ట్ర రాజధాని పరిధిలో హైదరాబాద్ జంట నగరాల్లోని సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బోయిగూడలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓ ప్లాస్టిక్ గోదాంలో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా గోదాంలో మంటలు చెలరేగడంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే.. ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకున్న 11 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం …
Read More »RRR టికెట్ రేట్లు.. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఎంతంటే?
త్వరలో రిలీజ్ కానున్న RRR సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి మూడు రోజులపాటు సాధారణ థియేటర్లలో రూ.50 వరకు, తర్వాత మూడు రోజులు రూ.30 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్‌ల్లో తొలి మూడు రోజులు రూ.100 వరకు రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. మరోవైపు థియేటర్లలో ఐదో ఆటకు కూడా ప్రభుత్వం ఓకే చెప్పింది. ఉదయం 7 గంటల నుంచి …
Read More »గచ్చిబౌలిలో కారు బీభత్సం.. అతివేగమే కొంపముంచింది!
హైదరాబాద్: హోలీ పండగ వేళ భాగ్యనగరంలో విషాదం చోటుచేసుకుంది. అతివేగం ముగ్గురు ప్రాణాలను బలిగొంది. నగరంలోని గచ్చిబౌలిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎల్లా హోటల్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఎల్లా హోటల్ సమీపంలో రోడ్ల మధ్య చెట్లకు నీరు పెడుతున్న మహేశ్వరమ్మ అనే మహిళను కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు మహేశ్వరమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. అదే వేగంతో వెళ్తూ కారు కూడా …
Read More »అలా చేస్తే కిషన్‌రెడ్డిని మేమే సన్మానిస్తాం: కేటీఆర్
హైదరాబాద్: భాగ్యనగరం అభివృద్ధికి బీజేపీ నేతలు తమతో పోటీ పడాలని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో వరదముంపు సమస్య పరిష్కారానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రూ.10వేల కోట్ల నిధులు తేవాలని.. అలా చేస్తే ఆయన్ను సన్మానిస్తామని చెప్పారు. ఎల్బీనగర్ సర్కిల్ వద్ద జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించిన అండర్‌పాస్, బైరామల్ గూడలో ఫ్లైఓవర్‌లను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరదముంపు నివారణకు నగర వ్యాప్తంగా రూ.103 కోట్లతో నాలాలను అభివృద్ధి …
Read More »టీడీపీలో విషాదం
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకటరావు (102) కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని తన కూతురు నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. తెనాలి సమీపంలోని బోడపాడులో 1919లో జన్మించిన ఈయన.. 1967, 1978లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1978-80 మధ్య వ్యవసాయశాఖ మంత్రిగా చేశారు. 1983లో దివంగత మాజీ ముఖ్యమంత్రి …
Read More »హైదరాబాద్ లో భారీగా కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో కరోనా కేసులు భారీగానే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,645 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,670,866 కరోనా కేసులు నమోదయ్యాయి. ఓవైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు
Read More »బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఉగ్ర ముప్పు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఉగ్ర ముప్పు ఉందన్న హెచ్చరికలతో.. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో నాంపల్లి పార్టీ కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తం చేయాలని కార్యాలయం సిబ్బందికి పోలీసులు సూచించారు. జనవరి 26 వరకు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయంలో గస్తీని ముమ్మరం చేయాలని ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందిని ఆదేశించారు
Read More »హైదరాబాద్ నగరంలో కొత్తగా 294 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 294 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,47,235 కరోనా కేసులు నమోదయ్యాయి. నగరంలో ‘ఒమిక్రాన్’ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. టీనేజర్స్ ప్రతీ ఒక్కరూ వాక్సిన్ వేసుకోవాలని సూచించారు.
Read More »మహ్మద్ సిరాజ్ కి గవాస్కర్ చురకలు
దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ ఐదోరోజు ఆటలో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రవర్తించిన తీరును బ్యాటింగ్ దిగ్గజం గవాస్కర్ తప్పుపట్టాడు. సౌతాఫ్రికా వైస్ కెప్టెన్ బవుమా పరుగు కోసం ప్రయత్నించకున్నా..సిరాజ్ అతడివైపు బంతి విసరడమేమిటని సన్నీ ప్రశ్నించాడు. సిరాజ్ బౌలింగ్‌లో డిఫెన్సివ్‌గా ఆడిన బవుమా పరుగుకోసం ప్రయత్నించకున్నా.. ఫాలో అప్‌లో బంతిని అందుకున్న భారత పేసర్ దానిని బవుమాపైకి విసిరాడు. దాంతో బంతి ఎడమ పాదానికి తగిలి సౌతాఫ్రికా బ్యాటర్ …
Read More »హైదరాబాద్ ప్రజలకు న్యూ ఇయర్ కానుక
న్యూ ఇయర్ కానుకగా హైదరాబాద్ ప్రజల కోసం షేక్ పేట్ ఫ్లైఓవర్ ను ఈ రోజు మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు. రూ. 333.55 కోట్ల అంచనాతో నిర్మించిన 2.8కి.మీ ఈ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి JNTU జంక్షన్ వరకు 17 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్యలు లేకుండా సులభతరం చేయనుంది.
Read More »