Home / ANDHRAPRADESH / బాబు స్కిన్‌కు చన్నీళ్లు పడకుంటే..ఇంటి నుంచి తెచ్చుకోండి..!

బాబు స్కిన్‌కు చన్నీళ్లు పడకుంటే..ఇంటి నుంచి తెచ్చుకోండి..!

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే..ప్రతిపక్ష నేత అన్న గౌరవంతో కోర్టు జైలు భోజనంకు బదులుగా ఇంటి నుంచి మందులతో పాటు భోజనం తెప్పించుకునే సౌలభ్యం కల్పించారు..దీంతో హమ్మయ్య మాబాబుగారికి జైల్లో చిప్పకూడు తినే పరిస్థితి తప్పిందని తెలుగు తమ్ముళ్లు..ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా మంగళవారం సాయంత్రం ఆయన భార్య నారా భువనేశ్వరీ, కొడుకు లోకేష్, కోడలు బ్రాహ‌్మణి ములాఖత్ ద్వారా జైల్లో ఉన్న చంద్రబాబును కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు బాబుతో భేటీ అయిన కుటుంబసభ్యులు, చంద్రబాబు అరెస్ట్‌పై రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటున్నారు..బెయిల్ వస్తుందా రాదా…కుటుంబసభ్యుల యోగ క్షేమాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

తదనంతరం జైలు నుంచి బయటకు వచ్చిన భువనేశ్వరీ మీడియాతో మాట్లాడుతూ . చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని, ధైర్యంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు కట్టించిన బ్లాక్‌లోనే ఆయన్ని కట్టిపడేశారని ఆవేదన చెందారు..కానీ కావాలని అన్నారో లేక అమాయకత్వంతో అన్నారో కానీ భువనేశ్వరీ ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చారు…నిజంగా రాజమండ్రి సెంట్రల్ జైలులోని స్నేహా బ్లాక్..చంద్రబాబు కట్టించిన సంగతి పెద్దగా తెలియదు..ఇప్పుడు భువనేశ్వరీ కామెంట్స్‌తో సోషల్ మీడియాలో చంద్రబాబును చెడుగుడు ఆడేసుకుంటున్నారు..వాహ్..ఇది కదా ముందు చూపు అంటే..ఇది కదా విజన్ అంటే..భవిష్యత్తులో తాను జైలుకు వెళ్తానని ముందే గ్రహించిన మన విజనరీ చంద్రబాబు ముందుచూపుతో ఇలా స్నేహా బ్లాక్ లో జైలు గదిని ప్రత్యేకంగా కట్టించున్నాడు..ఇంత ఛాన్స్ ఎవరికీ రాదు అంటూ సెటైర్లు వేస్తున్నారు..ఇక జైల్లో చంద్రబాబుకు నంబర్‌ వన్‌ సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా, ఆ పరిస్థితి అక్కడ లేదన్నారు. బాబు భద్రతపై ఆందోళన కలిగిస్తోందంటూ వాపోయారు..పాపం మా ఆయన చన్నీళ్లతో స్నానం చేయాల్సి వస్తోందని భువనేశ్వరీ ఆవేదన చెందారు. ఆయన్ని విడిచి బయటకు వస్తుంటే తనలో ఏదో భాగం వదిలేసిన భావన కలుగుతోందని భార్యాభర్తల మధ్య ఉన్న అనురాగబంధాన్ని చాటుకున్నారు.

అయితే చంద్రబాబు చన్నీళ్ల స్నానంపై మంత్రి రోజా స్ట్రాంగ్ పంచ్ ఇఛ్చారు. నీ భర్త చంద్రబాబు ఎంత మంది మహిళల జీవితాలు నాశనం చేశాడు..ఎంత మంది మగవాళ్లను జైలుకు పంపించాడ…ఎంత మందిని పైకి పంపించి వాళ్ల భార్యల పసుపుకుంకుమలు తుడిచేసిన సంగతి అందరికీ తెలుసు..అయినా కూడా…నీ భర్త , మీరు కోరిన విధంగా జైల్లో చిప్పకూడు పెట్టకుండా..ఇంటి నుంచి భోజనం, మందులు పంపించే అవకాశం కల్పించారు..స్నేహా బ్లాక్ లో ప్రత్యేకంగా గది ఇచ్చారు..చన్నీళ్లు కాదు..వేడి నీళ‌్లు కావాలంటే..జైలు అధికారులను అడిగితే ఇస్తారు..లేదంటే స్నానానికి వేడి నీళ్లు కూడా ఇంటి నుంచి పట్టుకొచ్చి ఇవ్వండి …అంతే కాని సానుభూతి కోసం ఇలాంటి మాటలు మాట్లాడితే..ప్రజల్లో ఇంకా చులకన అయిపోతారంటూ భువనేశ్వరీకి మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

నారా భువనేశ్వరీ చన్నీళ్లు కామెంట్స్‌కు సోషల్ మీడియాలో కూడా సెటైర్లు పడుతున్నాయి..అమ్మా. నీ భర్త సీఎంగా ఉన్నప్పుడు సంక్షేమ హాస్టళ్లలో పిల్లలు చలికాలం కూడా చన్నీళ్లతో వణుకుతూ స్నానం చేస్తుంటే..అప్పుడు గుర్తుకు రాలేదా…జగన్‌ పై అక్రమాస్తులకేసులు పెట్టించి 16 నెలలు జైల్లోకి పంపించినప్పుడు ఆయన భార్య భారతి నీలా మా ఆయనకు భద్రత లేదు..చన్నీళ్లతో స్నానం చేస్తున్నారంటూ వాపోయిందా..అయినా చంద్రబాబు బొల్లి స్కిన్ కు చన్నీళ్లు పడకుంటే ఇంటి నుంచి వేడినీళ్లు పంపించండి..లేదా జైలు గదిలో గీజర్ పెడతామని కోర్టులో ఓ పిటీషన్ పడేయండి అంటూ నెట్‌జన్లు భువనేశ్వరీ వ్యాఖ్యలపై చెడుగుడు ఆడేసుకుంటున్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat