Home / ANDHRAPRADESH / చంద్రబాబుకు బిగ్ షాక్..మరో కేసులో సీఐడీ పీటీ వారెంట్..మళ్లీ జైలు తప్పదా..?

చంద్రబాబుకు బిగ్ షాక్..మరో కేసులో సీఐడీ పీటీ వారెంట్..మళ్లీ జైలు తప్పదా..?

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబు ను 14 రోజుల రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే..నిన్న సాయంత్రం వరకు గవర్నర్ అనుమతి లేదు..ఎఫ్‌ఐఆర్ లో పేరు లేదు…అంటూ పలు సాంకేతిక కారణాలు చూపుతూ… చంద్రబాబు రిమాండ్ పిటీషన్‌ ను కోర్టు కొట్టేస్తుందంటూ టీడీపీ అనుకుల పచ్చ మీడియా ఊదరగొట్టేసింది..అయితే అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో పాటు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించమంటూ తీర్పు ఇవ్వడంతో టీడీపీ వర్గాలు, పచ్చ మీడియా ఖంగు తింది…ఇక వెంటనే హౌస్ అరెస్ట్ పిటీషన్ తో పా ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తారని, 437(1) ప్రకారం మధ్యంతర బెయిల్ పిటిషన్ వేస్తారని, రెండు పిటిషన్లను న్యాయవాదులు ఒకేసారి దాఖలు చేయనున్నట్టు సమాచారం. ఇవాళ తొలుత చంద్రబాబును జైల్లో వద్దు, గృహ నిర్భంధంలో ఉంచండి అంటూ బాబు తరపు లాయర్లు వేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అయితే చంద్రబాబు హౌజ్‌ అరెస్ట్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసింది.ఏపీ సీఐడీ. సీఆర్‌పీసీలో హౌజ్‌ అరెస్ట్‌ అనేదే లేదు. బెయిల్‌ ఇవ్వలేదు కాబట్టే హౌజ్‌ రిమాండ్‌ కోరుతున్నారు. అరెస్ట్‌ సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు అని సీఐడీ కౌంటర్‌ కాపీలో పేర్కొంది.

మరోవైపు చంద్రబాబుకు మరో షాక్ ఇచ్చింది సీఐడీ…ఇవాళ ఏసీబీ కోర్టులో.. సీఐడీ మరో పిటిషన్‌ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో కూడా చంద్రబాబు అరెస్ట్‌ కోసం పీటీ వారెంట్‌(పీటీ వారెంట్ (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్) కోరింది. 2022లో నమోదైన కేసులో పీటీ వారెంట్‌పై బాబును విచారించేందుకు కోర్టు అనుమతి సీఐడీ కోరింది. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ6గా నారా లోకేష్‌ ఉన్నారు. చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని సీఐడీ తన పిటిషన్‌లో పేర్కొంది. మరి అమరావతి ఇన్నర్ రోడ్ స్కామ్‌లో చంద్రబాబు, లోకేష్ ల పాత్రపై సిట్ తరపు న్యాయవాదులు వేసిన పీటీ వారెంట్ పై ఏసీబీ కోర్ట్ ఇచ్చే తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది..ఒకవేళ ఇవాళ స్కిల్ కేసులో బెయిల్ వచ్చినా..అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో చంద్రబాబును మళ్లీ అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పర్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది..గతంలో చింతమనేనిపై వరుస కేసుల్లో దాదాపు 2 నెలలు జైల్లోనే తిప్పిన తరహాలో చంద్రబాబుపై కూడా అదే స్థాయిలో వరుస కేసుల్లో రిమాండ్ కోరే అవకాశాలు ఉన్నట్లు  టీడీపీ వర్గాలు,  పచ్చ మీడియా ఛానళ్లు భయాందోళన చెందుతుంటాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat