Breaking News
Home / ANDHRAPRADESH / చంద్రబాబుపై 9 క్రిమినల్ కేసులు..ఢిల్లీలో బాబు బండారం బట్టబయలు..!

చంద్రబాబుపై 9 క్రిమినల్ కేసులు..ఢిల్లీలో బాబు బండారం బట్టబయలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయి 10 రోజులు అయిపోయింది…ఈ రోజు చంద్రబాబు లాయర్ లూథ్రా వేసిన క్వాష్ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ రోజు అయినా చంద్రబాబు బెయిల్‌పై బయటకు వస్తారని..టీడీపీ శ్రేణులు, ఎల్లోమీడియా ఛానళ్లు ఎదురు చూస్తున్నాయి..ఇదిలా ఉంటే చంద్రబాబును బెయిల్‌పై బయటకు తీసుకురావడంలో విఫలమైన ఆయన కుమారుడు లోకేష్..ఢిల్లీకి వెళ్లిపోయాడు..అక్కడ చంద్రబాబును అక్రమంగా జగన్ సర్కార్ అరెస్ట్ చేయించి..వేధిస్తుందంటూ జాతీయ స్థాయిలో సానుభూతి కోసం లాబీయింగ్ చేస్తున్నాడు..బీజేపీ పెద్దలు మొహం చాటేయడంతో ఇండియా కూటమిలోని పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తూనే..తన తండ్రిని విడిపించేందుకు సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నాడు..కాగా చంద్రబాబు అవినీతి బాగోతాలను రాజ్యసభ వేదికగా వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బట్టబయలు చేశారు.

తాజాగా మొదలైన పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా విజయసాయిరెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ…. అవినీతికి, వెన్నుపోటుకు చంద్రబాబు కేరాఫ్‌ అడ్రస్‌ అంటూ సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. రాజకీయాల్లో వెన్నుపోట్లు అనేవి చంద్రబాబుతోనే మొదలయ్యాయని స్పష్టం చేశారు. అంతులేని అవినీతి, కుంభకోణాలు, వెన్నుపోట్లకు కేరాఫ్‌ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంటూ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళ చంద్రబాబు పాలన కారణంగానే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయిందని ధ్వజమెత్తారు.. అడ్డూఅదుపూ లేకుండా అవినీతి, స్కామ్‌లకు పాల్పడి చంద్రబాబు ఈరోజున 6 లక్షల కోట్లకు అధిపతి అయ్యారంటూ సంచలన ఆరోపణలు చేశారు.. తనపై తొమ్మిది క్రిమినల్‌ కేసులు ఉన్నట్లుగా చంద్రబాబు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిడ్‌లో పేర్కొనడాన్నిబట్టి ఆయన క్రిమినల్‌ నేపథ్యాన్ని అర్ధం చేసుకోవచ్చు అంటూ సాయిరెడ్డి తెలిపారు..

రాజకీయాలలో వెన్నుపోట్లు అనేవి చంద్రబాబుతోనే మొదలయ్యాయి. టీడీపితో పొత్తు పెట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ, కమ్యూనిస్టులను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. ఇదీ మన ప్రజాస్వామ్యం దుస్థితి. అలాంటి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పాల్పడిన కోట్లాది రూపాయల స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అవినీతి కేసులో నిందితుడిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్‌ సీఐడి ఆయను అరెస్ట్‌ చేసింది. ఈ కేసులో ప్రాధమిక ఆధారాలు ఉన్నట్లుగా నిర్ధారించకున్న తర్వాతే కోర్టు చంద్రబాబుకు జుడిషియల్‌ కస్టడీ విధించింది. దీనిపై ఒకవైపు న్యాయప్రక్రియ కొనసాగుతుండగానే మరోవైపు చంద్రబాబు అరెస్టుపై అఖిలపక్ష సమావేశంలో టీడీపీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలతో యాగీ చేయడానికి ప్రయత్నించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పార్లమెంట్‌ 75 ఏళ్ళ ప్రస్థానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ టీడీపీ పార్లమెంట్‌ సభ్యుల అనుచిత చర్యలకు సమాధానంగానే ఈరోజు చంద్రబాబు అవినీతి కుంభకోణాలు, నేర చరిత్ర గురించి సభలో ప్రస్తావించాల్సి వస్తోందని విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ..వైఎస్ఆర్‌సీపీని ఇరుకునపెట్టేందుకు లోకేష్ ఆదేశాల మేరకు టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో రచ్చ చేశారు. దీంతో విజయసాయిరెడ్డి రంగంలోకి దిగి…చంద్రబాబు అవినీతి బండారాన్ని రాజ్యసభ వేదికగా బట్టబయలు చేయడంతో లోకేష్ బ్యాచ్‌కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయినట్లైంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino