దేశవ్యాప్తంగా అన్నింటా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న తరుణంలో మోదీ సర్కార్ ఎన్నికలకు ముందు తన అస్త్రశస్త్రాలను ఒక్కొక్కటిగా వదులుతోంది.. మహిళల ఓట్ల కోసమో లేదా రాజకీయ లబ్ది కోసమో కానీ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లు అస్త్రాన్ని సరిగ్గా ఎన్నికలకు ముందు సంధించింది…తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం లోక్‌సభలో దీనిపై చర్చ జరుగుతోంది. . లోక్‌సభలో ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశముంది. అన్ని పార్టీలు మహిళా బిల్లుకు మద్దతు ఇస్తుండడంతో మహిళా బిల్లు వెంటనే ఆమోదం పొందే అవకాశం ఉంది…అయితే బిల్లు ఇప్పుడు ఆమోదం పొందినా వచ్చే ఎన్నికల్లోపు మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వచ్చే పరిస్థితి లేదు..దీనికి కారణం నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇంకా పెండింగ్‌లో ఉండడమే..నియోజకవర్గాల పునర్విభజనకు ఇంకా కసరత్తు జరుగుతోంది..ఈ ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన జరిగే పరిస్థితి లేదు.. 2029 సార్వత్రిక ఎన్నికల వరకు జనాభా దామాషా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది..అప్పుడే జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కోటా స్థానాల లెక్క తేలనుంది..దీంతో 2019 ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తే….తెలంగాణ, ఆంధరప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో 33 శాతం సీట్లు మహిళలకు దక్కనున్నాయి. ఆ ప్రకారం ఏపీలో 25 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అందులో 8 సీట్లు మహిళలకు కేటాయిస్తారు. ఇక 175 అసెంబ్లీ స్థానాల్లో 58 సీట్లు మహిళలకు దక్కుతాయి. ఇక తెలంగాణ విషయానికొస్తే.. మొత్తం 17 ఎంపీ సీట్లలో.. 5 నుంచి 6 సీట్లు మహిళలకు రిజర్వ్ చేస్తారు. ఇక తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లలో 40 సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. అటు దేశవ్యాప్తంగా చూసుకుంటే 543 లోక్‌సభ సీట్లలో 181 సీట్లు మహిళలకు రిజర్వ్ చేయనున్నారు. ఇందులో జనరల్ మహిళా అభ్యర్థులకు 138, ఎస్సీలకు 28, ఎస్టీలకు 15 సీట్లు దక్కుతాయని తెలుస్తోంది. కానీ..నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు అమల్లోకి రానుంది. సో..ఏపీ తెలంగాణలో ఇప్పుడు రాజకీయనాయకుల్లో .ఎవరి సీట్లు గల్లంతాయో.. అని గుబులు మొదలైంది. మరి కొందరు మాత్రం మహిళలకు దక్కే సీట్లలో తమ భార్యలను, కూతుళ్లను బరిలోకి దింపేందుకు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు..మొత్తంగా మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలుతో భారత రాజకీయ వ్యవస్థలో మహిళా ప్రాధాన్యం పెరగడం యావత్ దేశ మహిళలకు శుభసూచకమనే చెప్పాలి.