ఏపీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో కాల్పులు కలకలం రేపాయి.ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ మండలాధ్యక్షుడు బాల కోటిరెడ్డిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.
ఆయన ఇంట్లోకి వెళ్లిన ప్రత్యర్థులు కాల్పులు జరిపి పారిపోయినట్లు తెలుస్తోంది. కాగా కాల్పుల్లో గాయపడిన బాలకోటిరెడ్డిని ఆయన కుటుంబసభ్యులు వెంటనే నర్సారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.