బీహార్ రాష్ట్ర మాజీ మంత్రి,ఆర్జేడీ పార్టీకి చెందిన సీనియర్ ప్రముఖ నేత తేజ్ ప్రతాప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే ఆర్జేడీ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే దీని గురించి తన తండ్రి.. మాజీ ముఖ్యమంత్రి లాల్ ప్రసాద్ యాదవ్ తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. చర్చించిన తర్వాత తన రాజీనామా పత్రాన్ని ఆయనకు ఇవ్వనున్నట్లు కూడా ఈ …
Read More »దేశంలో కొత్తగా 2,541 కరోనా కేసులు
గడిచిన ఇరవై నాలుగంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,60,086కు చేరాయి. ఇందులో 4,25,21,341 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,22,223 మంది మృతిచెందగా, 16,522 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కొత్తగా 30 మంది మహమ్మారికి బలవగా, 1862 మంది వైరస్ నుంచి బయటపడ్డారు.
Read More »దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలవరం
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,094 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసులు 3,705కు చేరుకున్నాయి. పాజిటివిటీ రేటు 4.82 శాతానికి చేరింది. ఈనెల 11న 601గా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 3,705కి చేరింది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది.
Read More »పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం
పంజాబ్ రాష్ట్ర సీఎం భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలోని 184 మంది ప్రముఖుల భద్రతను వెనక్కి తీసుకుంటూ ఆదేశాలు జారీ చేయగా.. ఇందులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొందరు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారు. మాజీ సీఎం చన్నీ కుటుంబ సభ్యులకు సైతం భద్రతను ఉపసంహరించగా.. సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులున్న వారికి మాత్రమే భద్రతను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.
Read More »విరాళాల సేకరణలో బీజేపీ మరో రికార్డు
గత ఏడాది పార్టీలకు అందిన విరాళాల విషయంలో కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ మరో రికార్డు నెలకొల్పింది. దేశవ్యాప్తంగా ప్రధానమైన 12 పార్టీలకు రూ.258 కోట్ల వరకు విరాళాలు అందగా.. అందులో ఒక్క బీజేపీ కే రూ.212 కోట్లు డొనేషన్లు అందాయి. మొత్తం విరాళాలలో ఇది 82 శాతం కావడం విశేషం. రెండో స్థానంలో రూ.27 కోట్లతో (10.45 %) జేడీయూ నిలిచింది. ఇక కాంగ్రెస్, ఎన్సీపీ,ఏఐడీఎంకే, డీఎంకే, …
Read More »దేశంలో కరోనా డేంజర్ బెల్స్
దేశంలో రోజురోజుకు కొత్తగా కరోనా కేసుల నమోదు సంఖ్య పెరిగిపోతుంది. ఈ క్రమంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో మొత్తం కొత్తగా మరో 2451 మంది కరోనా బారినపడినట్లు దేశ వ్యాప్తంగా నిర్వర్తించిన కరోనా పరీక్షల్లో తేలింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా మొత్తం కేసుల సంఖ్య 4,30,52,425కు చేరాయి. ఇందులో నుండి మొత్తం 4,25,16,068 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,22,116 మంది కరోనా మహమ్మారిన పడి …
Read More »ఓబీసీలకు మోదీ సర్కారు శుభవార్త
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఓబీసీలకు శుభవార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం . ఇందులో భాగంగా ఓబీసీల ఆదాయపరిమితిని రూ.10 లక్షలకు పెంచేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు కసరత్తు చేస్తోంది. సరిగ్గా ఐదేండ్ల కిందట అంటే 2017లో రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచింది బీజేపీ ప్రభుత్వం. తాజాగా దేశంలో ఉన్న పలు వివిధ రాజకీయ పార్టీలు ఈ పరిమితిని …
Read More »PK కాంగ్రెస్ లో చేరనున్నారా…?
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరనున్నారా? .. దేశంలో రానున్న రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల్లో ఆ పార్టీ కోసం పీకే బృందం పనిచేయనుందా? ఈ ప్రశ్నలకు తాజా పరిణా మాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.నిన్న శనివారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా, రాహుల్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలతో పీకే సమావేశమయ్యారు. రెండేళ్ల తర్వాత అంటే …
Read More »BJP కి దిమ్మతిరిగే షాక్
దేశంలో నాలుగు రాష్ర్టాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో నాలుగు అసెంబ్లీ..ఒక ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికలకు ముందు హిజాబ్, హలాల్ వంటి వివాదాస్పద అంశాలను తెరపైకి తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న కమలదళానికి తమ ఓటుతో బుద్ధిచెప్పారు ఓటర్లు. ఒక లోక్‌సభ, నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో …
Read More »ప్రపంచ ఆకలి సూచీలో భారత్ కు 101 స్థానం
ప్రపంచ ఆకలి సూచీ-2021 ప్రకారం భారత్ 101వ ప్లేస్లో నిలిచింది. మొత్తం 116 దేశాల్లో సర్వే నిర్వహించగా.. మనకంటే పాకిస్తాన్ (92), నేపాల్, బంగ్లాదేశ్ (76), మయన్మార్(71) మెరుగైన స్థానాల్లో ఉండటం గమనార్హం. చైనా సహా 18 దేశాలు టాప్ ఉన్నాయి. ఇక 2020లో భారత్ 94వ స్థానంలో ఉండగా తాజాగా 7 స్థానాలు దిగజారింది. ఆకలి, పౌష్టికాహార లేమి తదితర అంశాల ఆధారంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఈ …
Read More »