ఉక్రెయిన్లపై రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. యుద్ధంపై భారత వైఖరిని క్వాడ్ సభ్యదేశాలు ( JAPAN, USA, AUS, IND) అంగీకరించినట్టు ఆస్ట్రేలియా వెల్లడించింది. తన కాంటాక్టుల ద్వారా. మోడీ యుద్ధాన్ని ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. యుద్ధంపై భారత్ తటస్థ వైఖరిని అనుసరిస్తోంది. నేటి మోడీ.. AUS ప్రధాని స్కాట్ మారిసన్ భేటీలో యుద్ధం అంశం ప్రస్తావనకు రానుంది.
Read More »మహిళలకు వచ్చే రుతుక్రమం ‘డర్టీ థింగ్ – బీజేపీ ఎమ్మెల్యేలు
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అసలు మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వటాన్ని ఆ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈక్రమంలో మహిళలకు వచ్చే రుతుక్రమాన్ని ‘డర్టీ థింగ్’ అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. నెలసరి సెలవులు కల్పించాలంటూ కాంగ్రెస్ సభ్యుడు అసెంబ్లీలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. దీనిపై చర్చిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఈ వ్యాఖ్యలు చేశారు. వీటిపై రాష్ట్రంలోని మహిళాసంఘాలు మండిపడుతున్నాయి.
Read More »హిజాబ్ పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
హిజాబ్ వివాదం ఎంతటి సంచలనం సృష్టించిందో యావత్ అఖండ భారతావనికి తెల్సిందే. ఈ వివాదంతోనే ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారాన్ని దక్కించుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా హిజాబ్ పై కర్ణాటక రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు అని స్పష్టం చేసింది. హిజాబ్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కోట్టేసింది.హిజాబ్ ధరించడం …
Read More »5రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి ఖాయమా..?
ఈ నెల పదో తారీఖున ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఇప్పటివరకు వెల్లడైన అన్ని ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో గట్టిగా పోటిస్తుందని.. ఇంకొన్ని రాష్ట్రాల్లో గెలుస్తుందని తేల్చి చెప్పింది. కానీ ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో మాత్రం ఓటమి ఖాయమని తేల్చేసింది. అయితే ఆ సంస్థ ఏంటి. ఆ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయో …
Read More »UP Exit Polls- 2022.. గెలుపు ఎవరిది..?
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిన్న సోమవారం ముగిసిన సంగతి తెల్సిందే. ఈ పోటీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ,మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీల మధ్యనే సాగింది ఎన్నికల ప్రచారం. నిన్న సోమవారం అఖరి విడత పోలింగ్ ముగిసిన తర్వాత కొన్ని జాతీయ ఛానెళ్లు,స్వచ్చంద సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. అయితే …
Read More »యూపీలో బీజేపీకి షాక్
యూపీలో చివరి దశ ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది. ప్రయాగ్జ్ బీజేపీ ఎంపీ రీటా బహుగుణ జోషి కుమారుడు మయాంక్ జోషి సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్.. మయాంక్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి, మహిళల భద్రత, యువతపై అఖిలేశ్ దృష్టి పెట్టారని, రాష్ట్ర భవిష్యత్తు ఆయన చేతుల్లోనే ఉందని, అందుకే ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు మయాంక్ తెలిపారు.
Read More »తొలిసారి చెన్నై నగరపాలక సంస్థ మేయర్‌గా దళిత మహిళ
చెన్నై నగరపాలక సంస్థ మేయర్‌గా తొలిసారి ఓ దళిత మహిళ ఎంపికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన అధికార పార్టీ డీఎంకేకి చెందిన 29 ఏండ్ల ఆర్ ప్రియ (Priya) మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మేయర్ అయిన తొలి దళిత మహిళగా, అతి పిన్నయస్కురాలిగా ఆమె రికార్డుల్లోకెక్కారు. మొత్తంగా చెన్నై మేయర్ అయిన మూడో మహిళగా నిలిచారు. అంతకుమందు తారా చెరియన్ , కామాక్షి జయరామన్ …
Read More »సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగాయి
శవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. 19 కేజీల సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 105, కోల్కతాలో రూ. 108 మేర పెరిగింది. అలాగే 5 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.27 ఎగబాకింది. పెరిగిన రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. డొమెస్టిక్ (గృహావసరాల) సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
Read More »దేశంలో కొత్తగా 15,102 కరోనా కేసులు
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15,102 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 278 మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,64,522కు చేరాయి. పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉంది. వైరస్ సోకిన వారిలో ఇప్పటి వరకు 4,21,89,887 మంది కోలుకున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా 176 కోట్లకు …
Read More »రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన నిర్ణయం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్లోని డోనెట్స్, లుహాన్క్ ప్రాంతాలను స్వతంత్ర స్టేట్స్ గా ప్రకటిస్తూ డిక్రీపై సంతకం చేశారు. దీంతో ఈ చర్యను పుతిన్ వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు పరిగణిస్తున్నారు. ఇక రష్యా నిర్ణయంపై మండిపడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. తమ దేశ భద్రతపై అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తో మాట్లాడారు.
Read More »