అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దూ అంటూ రాజధాని గ్రామాల్లో గత 18 రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో కొందరు రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళనలు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరీ కూడా ఎర్రుబాలెం గ్రామంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చంద్రబాబు ఎప్పుడూ అమరావతి, పోలవరం అంటూ తపించారు. ఇంత మంది మహిళలు బయటకు రావడం చూసి బాధేస్తుంది..అమరావతి రైతుల …
Read More »నవ్వుల పాలైన సేవ్ అమరావతి దీక్ష …!
చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌తో సహా టీడీపీ నేతలంతా ఒకటే..ఏదైనా ఇష్యూ వస్తే..సీరియస్‌గా పోరాడడం చేతకాదు..ఏదో ఓ రెండు రోజులు దీక్షల పేరుతో హడావుడి చేయడం..ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం బాబు బ్యాచ్‌కు పరిపాటిగా మారింది. ఇటీవల బాబుగారి పుత్రరత్నం లోకేష్ మంగళగిరిలో చేసిన ఇసుక దీక్ష అయితే మామూలు కామెడీ కాదు.. పొద్దున్నే కడుపు నిండా టిఫిన్ చేసి వచ్చిన లోకేష్..ఓ నాలుగు గంటలు దీక్షా శిబిరంలో కూర్చుని..వంధిమాగధులతో …
Read More »చంద్రబాబు క్షమాపణ చెప్పాకే బయటకు కదలాలి..!
బీసీజీ నివేదికను మున్సిపల్‌శాఖ కమిషనర్, ప్రణాళికా సంఘ కార్యదర్శి విజయ్‌కుమార్‌గారు ఒక ఐఏఎస్‌గా, ప్రభుత్వాధికారిగా, తన బాధ్యతల నిర్వహణలో భాగంగా వివరించడం జరిగింది. ఆ నివేదికమీద చంద్రబాబు నాయుడు చేసిన విమర్శుల చవకబారుగా ఉన్నాయనుకుంటే అంతకుమించి విజయ్‌కుమార్ గారిని, విజయ్‌కుమార్ గాడు అనడంద్వారా తన కుల దురహంకారాన్ని మరోసారి బయటపెట్టుకున్నాడు. ఎస్సీ కులాల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా? అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు వ్యాఖ్యానించిన చంద్రబాబు, బీసీల తోకలు కత్తిరిస్తానని, ఎస్టీ మహిళలమీద …
Read More »మూడు రాజధానులపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. భగ్గమంటున్న ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలు,,!
వచ్చేసారి టీడీపీ అధికారంలోకి వస్తే..మళ్లీ రాజధాని అమరావతే అంటూ టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు..ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి. ఏపీకి మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకించిన సోమిరెడ్డి ఒక వేళ రాజధానిని ఇప్పుడు అమరాతి నుండి మార్చినా..వచ్చేసారి టీడీపీ అధికారంలోకి వస్తే తిరిగి అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామంటూ..సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మారాల అంటూ సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు వాదిస్తున్నట్లుగానే రాజధాని తరలింపు …
Read More »అమ్మఒడి పధకంలో జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇదే..!
ప్రజా సంకల్ప పాదయాత్రలో నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అంటూ చెప్పిన ప్రతీ మాటను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజం చేస్తున్నారు. నవరత్నాల హమీలలో మరో కీలక హమీని నెరవేర్చేందుకు రంగం సిద్దమైంది. చదువుకు పేదరికం ఆటంకం కాకూడదన్న ఆలోచనతో జగన్ ప్రకటించిన అమ్మఒడి కార్యక్రమం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడిని ఈనెల 9న చిత్తూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి …
Read More »చంద్రబాబుకు ధీటైన కౌంటర్ ఇచ్చిన బొత్స..!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకు మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ గట్టి కౌంటర్ ఇచ్చాడు. రాజదాని విషయంపై నిర్ణయం తీసుకోవడానికి జగన్ ఎవరు ? బోస్టన్ గ్రూపు ఎవరూ అని చంద్రబాబు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఘాటుగా స్పందించిన బొత్స పదేళ్లపాటు హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు అది వదిలి రావడానికి ఎవరు అధికారమిచ్చరో ఆ ప్రజలే జగన్ కి అధికారం ఇచ్చారని చంద్రబాబు మర్చిపోయినట్టున్నారు …
Read More »వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబు..!
రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇలవైకుంఠంగా పేరుగాంచిన తిరుమల పుణ్యక్షేత్రం సిద్ధమైంది. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుందని…భక్తుల విశ్వాసం..వైకుంఠద్వార ప్రవేశంతో పాటు స్వామివారి గర్భాలయ ప్రాకారాన్ని స్పృశించే భాగ్యం భక్తులకు కలుగుతుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణ రథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శమిస్తారు. ద్వాదశి పర్వదినాన వేకువజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ద్వాదశి నాడు ముల్లోకాలలో …
Read More »బోస్టన్ కమిటీ నివేదిక తప్పుల తడక అంటున్న చంద్రబాబు మరి నారాయణ కమిటీ మాటేంటీ..!
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీజీ కమిటీ రిపోర్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. బోస్టన్ కమిటీ నివేదక తప్పుల తడక అని, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి ఏది చెబితే కమిటీ అది రాసి ఇచ్చిందని బాబు ఆరోపించారు. జీఎన్‌రావు కమిటీ కూడా అజయ్ కల్లాం ఇచ్చిన రిపోర్ట్‌నే నివేదికగా రాసిచ్చిందని బాబు వెల్లడించారు. గతంలో ఇలాంటి కన్సెల్టెంట్ కమిటీలు …
Read More »ఏపీని బీసీజీ ఆరు భాగాలుగా ఎలా విభజించిందంటే..!
హైకోర్టు, అసెంబ్లీలు మినహాయిస్తే ప్రభుత్వ విభాగాలను ఆరు భాగాలుగా వర్గీకరణ చేశారు.అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి బీసీజీ వర్గీకరించింది.లెజిస్లేచర్‌లో ఇక్కడ ఇప్పటికే కొన్ని ఏర్పాట్లున్నాయి. ఆప్షన్ 1: *విశాఖలో సెక్రటేరియెట్., గవర్నర్, సిఎం కార్యాలాయాలు , 7 శాఖలకు చెందిన హెచ్‌ఓడిలు., ఇండస్ట్రీ ఇన్ ఫ్రా., టూరిజం. ప్రజలతో సంబంధం లేని శాఖలతో మొత్తం 15 విభాగాలు అసెంబ్లీ, హైకోర్టు బెంచ్. *విజయవాడలో అసెంబ్లీ., ఎడ్యేకేషన్., లోకల్ గవర్నమెంట్., పంచాయితీ …
Read More »సీఎం జగన్ కు బీసీజీ ఇచ్చిన రిపోర్ట్ ఇదే..!
ఏపీ సీఎం జగన్‌కు బీసీజీ కమిటీ సమర్పించిన రిపోర్టులో ఆసక్తికర అంశాలున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రదేశాలు తిరిగిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్.. ఆయా ప్రాంతాల ప్రజలతో మాట్లాడి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. రాష్ట్రాన్ని 6 రీజియన్లుగా గుర్తించి.. అక్కడ ఏం వస్తే అభివృద్థి చెందుతుందో సవివరంగా వివరించారు. 13 జిల్లాల ఏపీని ఉత్తరాంధ్ర, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, దక్షిణాంధ్ర, ఈస్ట్ రాయలసీమ, వెస్ట్ రాయలసీమ ప్రాంతాలుగా గుర్తించాలని …
Read More »