సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. సీపీ గారు మామిడి, సపోటా, జామ చెట్లను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులకు అభినందనలు తెలిపారు. పర్యావరణహితం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ముందుగా నా హృదయపూర్వక …
Read More »జాతర కు హాజరై మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు
పెన్ పహాడ్ మండలం చీదేళ్ల గ్రామంలో ని గోపన్న సహిత తిరుపతమ్మ ఆలయ జాతర వైభవంగా జరుగుతుంది.. జాతర లో చివరి రోజు రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. మంత్రి కి పూర్ణ కుంభం తో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ జాతర లతో గ్రామాలలో భక్తి భావం తో పాటు …
Read More »సీఏఏకు అందుకే వ్యతిరేకం – మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ,ఎన్ఆర్సీ బిల్లులకు వ్యతిరేకం అని ప్రకటించిన సంగతి విదితమే. అయితే సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నామో మంత్రి కేటీఆర్ టైమ్స్ నౌ సమ్మిట్ లో వెల్లడించారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం. అన్ని ప్రాంతాలు ,మతాలు,కులాల కలయిక అని అన్నారు. అలాంటప్పుడు ఈ బిల్లుతో ఏమి అవసరం వచ్చింది అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సీఏఏ ప్రజల …
Read More »సీఏఏని వద్దన్నందుకు రూ.23లక్షలు జరిమానా
సీఏఏ వద్దు అన్నందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై మూడు లక్షల రూపాయలను జరిమానా వేసిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ముజాఫర్ నగర్,లక్నో జిల్లాల్లో గతేడాది డిసెంబర్ నెలలో ఇరవై తారీఖున సీఏఏకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేశారు. ఈ ఆందోళనల్లో రూ.1.9కోట్ల ప్రభుత్వ ఆస్తికి నష్టం చేకూరింది. దీంతో పోలీసులు ఆందోళన చేసినవారిపై కేసులు …
Read More »కాళేశ్వరంలో సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా శ్రీ ముక్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం ఆలయంలో పండితుల వేద మంత్రోచ్ఛారణలతో పూజలు చేశారు. అంతకుముమ్దు గోదావరిలో నాణేలు వదిలి.. చీర..సారె సమర్పించి ఉద్యమం నాటి మొక్కులను చెల్లించుకున్నారు. …
Read More »హైదరాబాద్ ను రెండో రాజధానిగా ఒప్పుకోరు
గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, ఇప్పుడు దేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన టైమ్స్ నౌ సమ్మిట్‌లో భాగంగా భారతదేశ నిర్మాణంలో రాష్ర్టాల పాత్ర అనే అంశంపై కేటీఆర్ మాట్లాడారు. ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తోంది అని కేటీఆర్ తెలిపారు. దేశాభివృద్ధిలో రాష్ర్టాల భాగస్వామ్యం కీలకమన్నారు. బలమైన …
Read More »అది చేస్తే మగవారు పుడతారు- మత బోధకుడు ఇందూరికర్ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ మరాఠా బోధకుడు ఇందూరికర్ మహరాజ్ సెక్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.సరి సంఖ్య ఉన్న రోజున శృంగారం చేస్తే మగ పిల్లాడు పుడతాడు. అదే బేసి సంఖ్య ఉన్న రోజున శృంగారం చేస్తే ఆడపిల్ల పుడుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రస్తుతం పెద్ద వివాదం చెలరేగుతుంది. మంచి సమయంలో సెక్స్ చేస్తే మంచి బిడ్డ పుడతారు. చెడు సమయంలో సెక్స్ చేస్తే పుట్టే బిడ్డ ఆ …
Read More »ఇషాంత్ రీఎంట్రీ
కివీస్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నెల పదిహేనో తారీఖున నేషనల్ క్రికెట్ అకాడమీలో జరగనున్న ఫిటినెస్ టెస్ట్ కు ఇషాంత్ శర్మ హజరు కానున్నాడు. ఒకవేళ ఈ టెస్ట్ లో ఇషాంత్ శర్మ నెగ్గుతాడు అని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడుతున్న ఇషాంత్ శర్మ జనవరి ఇరవై ఒక్కటో తారీఖున …
Read More »నక్సలైట్ గా రామ్ చరణ్ తేజ్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా హీరోగా ఎంట్రీచ్చి.. వరుస విజయాలతో.. వరుస సినిమాలతో ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎదిగిన స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం మనకు తెల్సిందే. ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ సినిమాలో …
Read More »ఢిల్లీకి సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్ళిన సంగతి విదితమే. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేందర్ మోదీని కలిశారు. ఈ భేటీలో విభజన హామీలపై.. మండలి రద్దు.. మూడు రాజధానుల అంశాలపై చర్చ జరిగింది. ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావాల్సి ఉండగా ఆయన బిజీ షెడ్యూల్ వలన కుదరలేదు. దీంతో ముఖ్యమంత్రి జగన్ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. …
Read More »