పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ కన్నుమూత
పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి గవర్నర్ గా పని చేసిన ఆ రాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత కేషరీనాథ్ త్రిపాఠి ఈ రోజు ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న తన నివాసంలో ఆదివారం ఉదయం 5 గంటలకు కన్నుమూశారు. ఆయన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మూడు పర్యాయాలు స్పీకర్‌గా పనిచేశారు. ఆయన మృతిపట్ల సీఎం యోగీ ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు.
Read More »బాచుపల్లి ఫ్లైఓవర్, రోడ్డు వెడల్పు పనులను అధికారులతో పర్యవేక్షించిన ఎమ్మెల్యే కెపీ…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి వద్ద హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో చేపడుతున్న ఫ్లైఓవర్ మరియు రోడ్డు వెడల్పు పనులను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, కమిషనర్ వంశీకృష్ణ గారు, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ గారు మరియు హెచ్ఎండిఏ, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు …
Read More »ప్రమాదానికి గురైన స్టార్ దర్శకుడు
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ప్రమాదానికి గురయ్యాడు. హైదరాబాద్ శివారులోని ఫిలింసిటీలో అతను డైరెక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే కారు ఛేజింగ్ సీన్ చిత్రీకరిస్తుండగా ప్రమాదంలో రోహిత్ శెట్టి గాయపడ్డాడు. అతడిని హుటాహుటిన ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »కాంగ్రెస్ పై బీజేపీ ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ‘ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ తో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉందని వాళ్ల నేతలే చెబుతున్నారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు ఓ డ్రామా. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు కాంగ్రెస్ వ్యవహారం ఉంది. …
Read More »ప్రభాస్ అభిమానులకు శుభవార్త
పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సలార్’ సినిమా షూటింగ్పై అప్డేట్ వచ్చింది. రేపటి నుంచి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సెట్స్ లో ప్రభాస్ షూటింగ్లో పాల్గొననున్నాడు. సుదీర్ఘకాలం పాటు షూటింగ్ షెడ్యూల్ ఉన్నట్లు సమాచారం. అయితే, సంక్రాంతికి ‘సలార్’ నుంచి అప్డేట్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
Read More »ఏపీలో సంక్రాంతి సెలవులు పెంపు
ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను మరోసారి మార్చింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 11 నుంచి 16వరకు సెలవులు ఉన్నాయి.. అయితే వీటిని 12నుంచి 17వ తేదీ వరకు మార్పు చేశారు. తాజాగా ఈ నెల 18వ తేదీ వరకు సెలవులు పొడిగించిన ప్రభుత్వం.. ఈ నెల 19న పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని పేర్కొంది.
Read More »రాహుల్ యాత్రలోఅనుకోని అతిథి..?
గత ఎనిమిదేండ్లుగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హర్యాణా రాష్ట్రంలో కొనసాగుతోంది.బీజేపీ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేయాలనే లక్ష్యంతో రాహుల్‌గాంధీ గత సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను ప్రారంభించిన సంగతి తెల్సిందే.. ఈ సందర్భంగా అక్కడ అనుకోని అతిథి ఈ యాత్రలో పాలుపంచుకుంది. విదేశీ జాతికి చెందిన …
Read More »రూ.56 కోట్లతో సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డులో ఫోర్ లేన్ స్టీల్ బ్రిడ్జ్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డులో ఎన్నో ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న తీవ్ర ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పలు మార్లు అసెంబ్లీ వేదికగా.. గౌరవ పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లగా.. అందుకు మంత్రి శ్రీ కేటీఆర్ గారు స్పందించారు. ప్రత్యేక జీఓ నెంబర్ 892 ద్వారా రూ.56 కోట్ల నిధులు మంజూరు …
Read More »బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఒంగోలు నుండి హైదరాబాద్‌కు బయల్దేరిన విమానం.. కాసేపటికే లోపం ఉన్నట్లు పైలెట్ గుర్తించాడు. దాంతో తిరిగి మళ్లీ ఒంగోలులోనే ల్యాండింగ్ చేశాడు. ప్రస్తుతం టెక్నీషియన్స్ లోపాన్ని సవరించేపనిలో ఉన్నారు. ఇక శుక్రవారం జరిగిన వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఇదే హెలికాఫ్టర్‌లో బాలయ్య ఒంగోలుకు వచ్చాడు.
Read More »