కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కాపీరైట్ యాక్ట్ కింద బెంగళూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రూపొందించిన వీడియోలో తమ సంస్థకు హక్కులున్న కేజీఎఫ్-2 హిందీ వర్షెన్ పాటను వాడుకున్నారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన ఓ సంస్థ రాహుల్ గాంధీ సహా ఇద్దరు కాంగ్రెస్ నేతలపై కేసు పెట్టింది.యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ పాదయాత్ర దృశ్యాలకు బ్యాక్ గ్రౌండ్‌గా కేజీఎఫ్-2 హిందీ సినిమా పాటలు, …
Read More »బీజేపీ నెక్స్ టార్గెట్‌గా జార్ఖండ్
కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి జార్ఖండ్‌లోని హేమంత్ సొరేన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. గత ఆగస్టులోనే ‘మనీ గేమ్’ ఆడినట్టు తాజాగా తేలింది. దీని కోసం అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఆశజూపి, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునేలా కమల నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే, బెంగాల్ పోలీసుల మెరుపు దాడితో ఈ కుట్ర భగ్నమైంది. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) …
Read More »కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు ఈడీ నోటీసులు
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు ఈడీ నోటీసులు జారీచేసింది. నవంబర్ 7న ఈడీ ఆఫీస్‌లో విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. శివకుమార్‌తోపాటు ఆయన సోదరుడు కనకపుర ఎంపీ డీకే సురేశ్‌కు కూడా తాఖీదులు ఇచ్చింది. ఇదే కేసులో సోదరులిద్దని గత నెల 7న ఈడీ విచారించింది. తాజాగా మరోసారి నోటీసులు జారీచేసింది.తనకు, తన సోదరునికి ఈడీ నోటీలు అందాయని శివకుమార్ చెప్పారు. …
Read More »డిసెంబర్ 4న హన్సిక వివాహం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ తార హన్సిక వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. బాల్య స్నేహితుడు సొహైల్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు ఇటీవల ప్రకటించింది. తనకు కాబోయే భర్తను కూడా అభిమానులకు పరిచయం చేసింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరికీ సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట దర్శనమిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సొహైల్, హన్సిక ఇద్దరూ కలిసి బోటులో షికారు చేస్తున్న ఫొటో ఒకటి …
Read More »దేశానికి అన్నం పెట్టే ధాన్యగారంగా తెలంగాణ
దేశానికి అన్నం పెట్టే ధాన్యగారంగా తెలంగాణ మారిందని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలో నంగునూరు మండలం సిద్దన్నపేట మార్కెట్‌యార్డులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో …
Read More »రేపే మునుగోడు ఉపఎన్నికల కౌంటింగ్
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఆసక్తిగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 6న నల్లగొండ శివారు ఆర్జాలబావి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములో లెక్కింపు జరుగనున్నది. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ, కౌంటింగ్ హాళ్లలో వసతుల కల్పన పూర్తయ్యాయి. ఒకే హాల్‌లో 21 టేబుళ్లపై 15 రౌండ్లలో లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు మొదలయ్యే కౌంటింగ్ మధ్యాహ్నం 1 గంటలోపు …
Read More »ఈనెల 12న తెలంగాణాకు ప్రధాని మోదీ
తెలంగాణలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని ఈనెల 12వతేదీన జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన దృష్ట్యా సీఎస్ సోమేశ్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖలు, పోలీసు అధికారులతో సమావేశమైన సీఎస్… ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరవుతారా..? లేదా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా …
Read More »బీజేపీని గద్దె దించాలి-ప్రియాంకాగాంధీ
హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్నది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా రోడ్‌షోలు, బహిరంగసభలతో ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇవాళ శుక్రవారం కాంగ్రాలో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రియాంకాగాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చాక మోదీ సర్కారు తెచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ హామీ …
Read More »పునీత్ రాజ్ కుమార్‌కు మరో అరుదైన గౌరవం
కన్నడ Super Star, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. తాజాగా మరో అరుదైన గౌరవం కూడా పునీత్‌కు దక్కింది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా కర్ణాటక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన కేజీఎస్-౩ శాటిలైట్‌కు ‘శాటిలైట్ పునీత్’ అని పేరు పెట్టారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, …
Read More »కోదాడ ప్రాంత ప్రజలకు ఫిజియోథెరపీ సేవలు అందించడం అభినందనీయం
కోదాడ ప్రాంత ప్రజలకు ఫిజియోథెరపీ సేవలు అందించడం అభినందనీయమని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ వీధి లో,ఎర్నేని టవర్స్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన పూర్ణ ఫిజియో థెరపీ క్లినిక్ ను ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రమాదాలు జరిగినప్పుడు శరీర భాగాలకు సరైన వైద్యం అందక జీవితాంతం అంగవైకల్యం తో బాధపడుతున్నారన్నారు. …
Read More »