గత ఎనిమిదేండ్లుగా సంక్షేమాభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం తాజాగా వైద్యరంగంలో నెంబర్ వన్ గా నిలవడానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కరోనా లాంటి మహమ్మారిని కట్టడీలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ వైద్యరంగ చరిత్రలో మరో అద్భుత ఘట్టం రేపు ఆవిష్కారం కాబోతున్నది. కొన్ని దశాబ్దాల తరువాత రాజధాని హైదరాబాద్ నలువైపులా అత్యాధునిక దవాఖానల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అల్వాల్ (బొల్లారం), సనత్‌నగర్ (ఎర్రగడ్డ ఛాతి దవాఖాన), …
Read More »దేశంలో కొత్తగా 2,541 కరోనా కేసులు
గడిచిన ఇరవై నాలుగంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,60,086కు చేరాయి. ఇందులో 4,25,21,341 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,22,223 మంది మృతిచెందగా, 16,522 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కొత్తగా 30 మంది మహమ్మారికి బలవగా, 1862 మంది వైరస్ నుంచి బయటపడ్డారు.
Read More »ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిన బుట్టబొమ్మ అందాలు
మరికొద్దిసేపట్లో యాదాద్రికి సీఎం కేసీఆర్….
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం రామలింగేశ్వర స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ప్రధానాలయ పునఃప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొంటారు.ఎర్రవల్లి నుంచి రోడ్డుమార్గంలో ఆలయానికి చేరుకుంటారు.ముందుగా స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకుంటారు.అనంతరం రామలింగేశ్వరస్వామివారి సన్నిధిలో జరిగే మహాకుంభాబిషేక మహోత్సవంలో పాల్గొని నూతనాలయాన్ని పునఃప్రారంభిస్తారు. ఉదయం 10.25 గంటలను ధనిష్ఠానక్షత్ర సుముహూర్తాన తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి చేతుల మీదుగా సపరివార రామలింగేశ్వర స్పటికలింగ ప్రతిష్ఠ, అష్టబంధం, ప్రాణప్రతిష్ఠ, …
Read More »మరో మైలురాయిని చేరుకున్న కల్యాణలక్ష్మి పథకం
తెలంగాణలో పేదింటి ఆడపిల్లల వివాహానికి అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం మరో మైలురాయిని చేరుకుంది. ఈ పథకానికి ప్రభుత్వం నిన్న రూ. 1850 కోట్లు విడుదల చేసింది. దీంతో 2014 అక్టోబరు 2న పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రూ.11,653 కోట్లు ఖర్చుచేసినట్లయ్యింది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 12,87,588 మందికి.. రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం …
Read More »తెలంగాణ ఆర్టీసీలో కొత్తగా 1,016 బస్సులు
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కొత్తగా 1,016 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కారుణ్య నియామకాలను చేపట్టాలని తీర్మానించారు. బస్టాండ్లలో ఫార్మసీ సేవలు తీసుకురావాలని నిర్ణయించారు. తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ స్థాయికి పెంచాలని తీర్మానించారు.
Read More »నాకు నాన్ననే స్ఫూర్తి-రామ్ చరణ్ తేజ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా.. అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ ,పూజా హెగ్డే హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ ఆచార్య. ప్రస్తుతం ఈ చిత్రం యూనిట్ ప్రమోషన్ల భాగంగా బిజీబిజీగా ఉంది. ఈ నేపథ్యంలో హీరో రామ్ చరణ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ …
Read More »దోమలు ఎవర్ని ఎకువగా కుడుతాయో తెలుసా..?
దోమలకు రాత్రివేళ కళ్లు బాగా కనిపిస్తాయి. దోమలు ఎక్కువగా డార్క్ కలర్ బట్టలు వేసుకున్న వాళ్లకు అట్రాక్ట్ అవుతాయట. నేవీ బ్లూ, బ్లాక్, రెడ్ కలర్ బట్టలు వేసుకున్నవారిని ఎక్కువగా కుడతాయి. దోమలు 160 అడుగుల దూరం నుంచి కార్బన్ డయాక్సైడ్ను గుర్తించి మనుషుల దగ్గరకు వస్తాయి. లావుగా, బరువు అధికంగా ఉన్నవారు, గర్భంతో ఉన్న మహిళలు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తారు. అందుకే వారినే దోమలు ఎక్కువగా …
Read More »మధుమేహంతో బాధపడేవారికి శుభవార్త
మధుమేహంతో బాధపడేవారు వ్యాయామంతో పాటు మంచి పౌష్టికాహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. పాత బియ్యం, గోధుమలు, పాలిష్ తక్కువగా చేసిన బియ్యం, సజ్జలు, జొన్నలు తీసుకోవాలి. కాయగూరలు, ఆకుకూరలు, పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఆహారం తినాలి. పాలు, పాలు పదార్థాలు, నిమ్మ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష, జామ, బొప్పాయి, ఆపిల్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. ఉప్పు, చక్కెర బాగా తగ్గించాలి. రాగి జావ, రొట్టె తింటే మంచిది.
Read More »బ్రష్ చేయడానికి ముందు నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..?
బ్రష్ చేయడానికి ముందు నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..?.. తెలియదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం..! బ్రష్ చేయడానికి ముందు నీరు త్రాగడం వల్ల రోగనిరోధక శక్తి మరింత బలంగా అవుతుంది. శరీరం హైడ్రేట్ అవుతుంది. దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు తగ్గుతాయి. అధిక రక్తపోటు తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కడుపులో పుండ్లు, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. చర్మం, జుట్టు మృదువుగా అవుతాయి.
Read More »