USAకు చెందిన మరిసా ఫొటియో అనే మహిళ షికాగో నుంచి ఐర్లాండ్ వెళ్లే విమానం ఎక్కింది. గొంతు నొప్పిగా ఉండటంతో.. బాత్రూంకు వెళ్లి స్వయంగా ర్యాపిడ్ టెస్ట్ చేసుకోగా పాజిటివ్ గా తేలింది. దీంతో అటెండెంట్కు విషయం చెప్పి.. విమానం ల్యాండ్ అయ్యేవరకు 3గంటల పాటు బాత్రూంలో ఐసోలేషన్లో గడిపింది. గత నెల 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకు రాగా.. తోటి ప్రయాణికులకు కరోనా సోకకుండా ఆమె …
Read More »ఆ వ్యాక్సిన్ బూస్టర్ డోసుగా వాడోచ్చు..!
హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు (పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ ఉద్యోగులు) జనవరి 10 నుంచి బూస్టర్ డోసులు ఇవ్వనున్నారు. దీర్ఘకాలిక వ్యాధులుండి, 60 ఏళ్లు దాటిన వారూ బూస్టర్ డోసు పొందేందుకు అర్హులు .. ఇందుకోసం రెండు డోసులు పొంది 9 నెలలు పూర్తికావాలి. ఇంతకుముందు ఏ వ్యాక్సిన్ పొందారో అదే వ్యాక్సిన్ బూస్టర్ డోసుగా ఇస్తారు. ఇందుకోసం కొవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Read More »ఏపీలో కొత్తగా మరో ఒమిక్రాన్ కేసు
ఏపీలో కొత్తగా మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 17కు చేరింది. UAE నుంచి బెంగళూరు ఎయిర్పోర్టులో దిగి ప్రకాశం జిల్లాకు వచ్చిన 52 ఏళ్ల మహిళకు డిసెంబర్ 24న కరోనా పాజిటివ్ గా తేలింది. ఆమె నమూనాలను HYD సీసీఎంబీలో పరిశీలించగా.. ఒమిక్రాన్గా నిర్ధారణ అయ్యింది. ఆమెకు సన్నిహితంగా ఉన్న 14 మందికి కరోనా టెస్టులు చేయగా.. నెగిటివ్ వచ్చినట్లు అధికారులు చెప్పారు.
Read More »ముంబైలో కరోనా కలవరం
ముంబైలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. గత 24 గంటల్లో 5,428 కోత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈ కేసుల 2,510 అధికం. అటు మహారాష్ట్రవ్యాప్తంగా 8,067 కేసులు నమోదయ్యాయి. 8 మంది కొవిడ్ వల్ల చనిపోయారు. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఆ రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించింది.
Read More »తెలంగాణలో కొత్తగా 311 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 36,759 టెస్టులు చేయగా.. 311 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,81,898కు చేరాయి. .. గడిచిన 24 గంటల్లో 222 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు విదేశాల నుంచి వచ్చిన 159 మందికి టెస్టులు చేయగా.. 7 మందికి పాజిటివ్ రాగా, వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు.
Read More »హైదరాబాద్ ప్రజలకు న్యూ ఇయర్ కానుక
న్యూ ఇయర్ కానుకగా హైదరాబాద్ ప్రజల కోసం షేక్ పేట్ ఫ్లైఓవర్ ను ఈ రోజు మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు. రూ. 333.55 కోట్ల అంచనాతో నిర్మించిన 2.8కి.మీ ఈ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి JNTU జంక్షన్ వరకు 17 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్యలు లేకుండా సులభతరం చేయనుంది.
Read More »పెరుగుతో లాభాలు మీకు తెలుసా..?
భోజనం చివర్లో ఒక్క ముద్దయిన పెరుగుతో తినాలంటారు. అది నిజమే ఎందుకంటే పెరుగు.. ఆహారం జీర్ణం కావడానికి దోహదపడుతుంది. అందుకే ప్రతిరోజూ పెరుగు తినాలి. అయితే ప్రస్తుతం చలికాలం కాబట్టి ఉదయం, మధ్యాహ్నం మాత్రమే పెరుగు తింటే మంచిది. సాయంత్రం, రాత్రివేళ దీన్ని తీసుకుంటే జలుబు చేసే అవకాశం ఉంది. ఇక పెరుగులో ఉండే రైబోఫ్లావిన్, విటమిన్ బి6, బి12, కాల్షియం వల్ల రోగనిరోధక శక్తి పెరగడం, ఎముకలు బలంగా …
Read More »హ్యాంగోవర్ అయిందా?.. అయితే ఇది మీకోసం..?
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హ్యాంగోవర్ అయిందా? అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీంతో డీహైడ్రేషన్, వికారం, తలనొప్పి, కండరాలు పట్టేయడం, అలసట, బద్ధకం వంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే వీటి నుంచి ఉపశమనం పొందాలంటే.. నిమ్మరసం, అల్లం-తేనె బ్లాక్ టీ, కొబ్బరి నీళ్లు, మజ్జిగలో ఏదైనా ఒకటి తీసుకోండి. అలాగే మంచినీళ్లు బాగా తాగితే డీహైడ్రేషన్ నుంచి రిలీఫ్ లభిస్తుంది.
Read More »బ్లాక్ టీ తాగడం వల్ల లాభాలెన్నో..?
బ్లాక్ టీ తాగడం వల్ల చర్మంపై వయసు ప్రభావం కనిపించదు. చర్మంపై వాపులు, మచ్చలు ఉంటే తగ్గుతాయి. చర్మవ్యాధులను నియంత్రిస్తుంది. బ్లాక్ టీ తయారీ కోసం.. 2 కప్పుల నీటిని 5ని. మరిగించాలి. అందులో టీ ఆకులను వేసి మూత క్లోజ్ చేసి మరో 2ని. మరిగించాలి. అప్పుడు ఆ నీటిని వడకట్టి తాగాలి. టేస్ట్ కోసం నిమ్మరసం, తేనే, అల్లం కలపుకోవచ్చు. చక్కెర వద్దు. చలికాలంలో ఈ టీ …
Read More »కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ
కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. వస్త్రాలపై అదనపు జీఎస్టీ ప్రతిపాదనలు విరమించుకోవాలని లేఖలో కోరిన ఆయన.. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించాలన్నారు. జీఎస్టీ పెంపుతో వస్త్ర పరిశ్రమ కుదేలవుతుందన్న మంత్రి కేటీఆర్ కోట్లాది మంది చేనేతల జీవితాలు దెబ్బతింటాయన్నారు. వస్త్రాల ధరలు పెరిగి సామాన్యులు కూడా ఇబ్బంది పడతారన్న మంత్రి.. రైతుల మాదిరిగా నేతన్నలు కూడా కేంద్రంపై తిరగబడతారన్నారు.
Read More »