మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడిగా మంచు విష్ణు ( Manchu Vishnu ) శనివారం ప్రమాణస్వీకారం చేశారు. మంచు విష్ణు, ఆయన ప్యానెల్ సభ్యుల చేత మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించిన ఈ వేడుకకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మోహన్ బాబు, నరేశ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం …
Read More »టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్
టీమిండియా ( Team India ) కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ( Rahul Dravid ) పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. 48 ఏండ్ల వయసున్న ద్రవిడ్ పేరును టీమిండియా కోచ్‌గా ఖరారు చేసినట్లు బీసీసీఐ అధికారి ద్వారా తెలిసింది. అయితే రాహుల్ ద్రవిడ్ ఎంపికను బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. టీమిండియా కోచ్‌గా వ్యవహరించేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేనప్పటికీ, ఆయనతో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జయ్ …
Read More »దేశంలో కొత్తగా 15,981 కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,981 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 17,861 మంది కరోనా నుంచి కోలుకోగా, 166 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,40,53,573 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 2,01,632 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి …
Read More »మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెంచారు. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.73 కాగా, డీజిల్ ధర రూ. 102.80గా ఉంది. పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వరుసగా ఇవాళ నాలుగో రోజు. అన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100పైనే ఉన్నది.
Read More »ఆర్కే అంత్యక్రియల ఫొటోలు విడుదల
అనారోగ్యంతో ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు పార్టీ అగ్ర నేత అర్కే అంత్యక్రియలు నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు ముగిశాయి. ఆర్కే అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను తాజాగా మావోయిస్టులు విడుదల చేశారు. తెలంగాణకు సమీపంలోని పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు జరిగినట్లు మావోయిస్టు పార్టీ తెలిపింది. ఆర్కే అంత్యక్రియలకు మావోయిస్టులు భారీ సంఖ్యలో హాజరయ్యారని, ఆయన భౌతిక కాయంపై ఎర్ర జెండా ఉంచి నివాళులు అర్పించామని వెల్లడించింది. …
Read More »5వేల కుటుంబాలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తా-గెల్లు శ్రీనివాస్‌యాదవ్
ఈటల నిర్లక్ష్య ధోరణివల్ల నియోజకవర్గంలో ఒక్క కుటుంబానికి కూడా డబుల్ బెడ్ రూం ఇల్లు రాలేదని, తనను గెలిపిస్తే సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఐదు వేల నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తానని హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. కమలాపూర్ మండలం దేశరాజ్‌పల్లెలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, పేర్యాల రవీందర్‌రావుతో కలిసి శనివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని ఎంఎన్ రెడ్డి నగర్ లో దాతలు పొన్నాల కిష్టమ్మ వీరయ్య గారు (రూ.10 లక్షలు), ఎంఎన్ రెడ్డి నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు సందిరి గోవర్ధన్ రెడ్డి గారు (రూ.3.50 లక్షలు), ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు (రూ.2 లక్షలు), బిజెపి నేత భరత్ సింహా రెడ్డి గారు (రూ.1.70 లక్షలు) మరియు ఇతర దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన పొన్నాల …
Read More »బతుకమ్మ ప్రత్యేక వీడియో సాంగ్‌ను విడుదల చేసిన ఎమ్మెల్యే
బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ జక్కుల శ్వేత ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ ప్రత్యేక వీడియో సాంగ్‌ను గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, సతీమణి జయతార విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని పేర్కొన్నారు. ఆనందోత్సహాల మధ్య ప్రజలు బతుకమ్మ వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో బుగ్గ …
Read More »‘మా’ ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ లేఖ!
‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికలు జరిగే వరకూ రెండు ప్యానెళ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత సడెన్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ఎన్నికైన 11 మంది సభ్యులూ రాజీనామాలు చేశారు. ఇప్పుడు తాజాగా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాశ్ రాజ్ లేఖ రాశారు. ‘మా’ పోలింగ్ సమయంలో మోహన్ బాబు చాలా దురుసుగా ప్రవర్తించారని ప్రకాశ్ రాజ్ …
Read More »పాకిస్థాన్ కు అమిత్ షా వార్నింగ్
పాకిస్థాన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. అతిక్రమణకు పాల్పడితే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ తప్పవన్నారు. దాడులను ఏమాత్రం సహించబోమని సర్జికల్ స్ట్రైక్స్ నిరూపించాయి. మీరు ఇలాగే అతిక్రమణకు పాల్పడితే మరిన్ని స్ట్రైక్స్ తప్పవు అని అమిత్ షా హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం ఈ సర్జికల్ స్ట్రైక్. ఇండియా సరిహద్దులను ఎవరూ చెరిపే ప్రయత్నం …
Read More »