Home / SLIDER /  టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్

 టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్

 టీమిండియా ( Team India ) కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ ( Rahul Dravid ) పేరు దాదాపు ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది. 48 ఏండ్ల వ‌య‌సున్న ద్ర‌విడ్ పేరును టీమిండియా కోచ్‌గా ఖ‌రారు చేసిన‌ట్లు బీసీసీఐ అధికారి ద్వారా తెలిసింది.

అయితే రాహుల్ ద్ర‌విడ్ ఎంపిక‌ను బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. టీమిండియా కోచ్‌గా వ్య‌వ‌హ‌రించేందుకు రాహుల్ ద్ర‌విడ్ సుముఖంగా లేన‌ప్ప‌టికీ, ఆయ‌న‌తో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌర‌వ్ గంగూలీ, సెక్ర‌ట‌రీ జ‌య్ షా స‌మావేశ‌మై ఒప్పించారు.

దీంతో టీమిండియా కోచ్‌గా వ్య‌వ‌హ‌రించేందుకు ద్ర‌విడ్ అంగీక‌రించిన‌ట్లు స‌ద‌రు అధికారి తెలిపారు. 2023 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ వ‌ర‌కు కోచ్‌గా ఉంటాన‌ని ద్ర‌విడ్ చెప్పిన‌ట్లు పేర్కొన్నారు.