Home / Tag Archives: slider (page 591)

Tag Archives: slider

ఎన్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బంఫర్ ఆఫర్లు

రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఎన్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో ఆఫర్లు ప్రకటించాయి. మంచి క్రెడిట్‌ స్కోర్‌ గల వారికి 6.70 శాతం వడ్డీ రేటుకే ఇంటి రుణాన్ని ఎస్‌బీఐ ఆఫర్‌ చేస్తుండగా సాధారణ వడ్డీ రేటు కన్నా 0.25 శాతం తక్కువ వడ్డీకే బీఓబీ ఇంటి, వాహన రుణాలు ఆఫర్‌ చేస్తోంది.  ఎంత రుణానికైనా ఒకే వడ్డీ : మంచి క్రెడిట్‌ స్కోర్‌ …

Read More »

హీరోయిన్ జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు జారి చేసినట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌లో సినీ ప్రముఖుల డ్రెగ్ కేసులో విచార‌ణ జరుగుతున్న సంగతి తెలిసిందే. మ‌రోవైపు బాలీవుడ్ మ‌నీలాండ‌రింగ్‌, డ్రెగ్ కేసులోనూ కొంద‌రిని విచారిస్తున్నారు. ఇటీవ‌లే హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు డ్రగ్స్, మనీ లాండరింగ్  కేసుల్లో భాగంగా సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. ఇందులో భాగంగా ఈనెల 25వ‌ తేదీన విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. …

Read More »

పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ కి బెదిరింపులు

హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ను ఓ వ్యక్తి బెదిరించాడు. అసభ్య పదజాలంతో దూషించాడు. దీనిపై హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం సీపీ అంజనీకుమార్‌ పోలీసు కంట్రోల్‌ రూం సిబ్బందికి వాట్సాప్‌ ద్వారా రెండు మొబైల్‌ నంబర్లను షేర్‌ చేశారు. సదరు వ్యక్తి సమస్య ఏమిటో కనుక్కోవాలని సూచించారు. దీంతో.. కంట్రోల్‌ రూం విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ …

Read More »

మాస్ట్రో హిట్టా ..? ఫట్టా..?

గత కొంతకాలంగా తెలుగు చిత్రసీమలో రీమేక్‌ సినిమాల సంస్కృతి పెరిగింది. ఇతర భాషల్లో విజయవంతమైన సినిమాల్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు అగ్రహీరోలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ బాటలో అడుగులు వేస్తూ నితిన్‌ నటించిన చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో విజయవంతమైన అంధాధూన్‌ చిత్రానికి రీమేక్‌ ఇది. కరోనా మహమ్మారితో పాటు థియేటర్స్‌లో నెలకొన్న సమస్యల మూలంగా ఓటీటీ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. శ్రేష్ట్‌ …

Read More »

ఎస్వీబీసీ ద్వారా అన్నమయ్య సంకీర్తనల విస్తృత ప్రచారం

శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి ప్రియ భక్తుడు శ్రీ తాళ్ళ పాక అన్నమాచార్యులు స్వామి వారిని కీర్తిస్తూ రాసిన కీర్తనలకు శ్రీ వేంకటేశ్వర భ‌క్తి ఛాన‌ల్ ద్వారా విస్తృత ప్ర‌చారం క‌ల్పించాల‌ని టీటీడీ నిర్ణయించిందని చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.తిరుమల అన్నమయ్య భవన్ లో శుక్రవారం ఆయన ఇందుకు సంబంధించిన ప్రోమో లను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌కు బ‌హుళ ప్రాచుర్యం క‌ల్పించేందుకు ” …

Read More »

దేశంలో కొత్తగా 30 వేల కరోనా కేసులు

దేశంలో వరుసగా రెండో రోజూ 30 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. నాలుగు రోజులపాటు తగ్గిన కేసులు.. గురువారం మళ్లీ ముప్పైవేలు దాటాయి. తాజాగా ఆ సంఖ్య 34 వేలకు చేరింది. ఇవి గురువారం నాటికంటే 12.5 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 34,403 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,33,47,325కు చేరింది. ఇందులో 3,49,056 కేసులు యాక్టివ్‌గా …

Read More »

మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు

సీఎం కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీ మేరకు, వచ్చే ఏడాది నుంచి మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. దళితబంధు అమలులో భాగంగా వైన్స్‌ దుకాణాల్లో కూడా దళితులకు రిజర్వేషన్‌ కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్సీలతోపాటు.. గౌడ కులస్థులు, ఎస్టీలకు కూడా రిజర్వేషన్‌ కల్పిస్తూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నది. ధరణి పోర్టల్‌లో …

Read More »

రేవంత్ కి దిమ్మతిరిగే కౌంటరిచ్చిన శశిథరూర్

కనకపు సింహాసనంపై కూర్చోబెట్టినంత మాత్రాన వెనకటి బుద్ధులేడికి పోతయన్నట్టు.. వదరుబోతు రేవంత్‌రెడ్డి లాంటి కురచ బుద్ధుల నేతను అందలమెక్కించినందుకు ఆ పార్టీ పాపపు ఫలితాన్ని అనుభవిస్తున్నది. నోరున్నది కదా అని ఎవరినైనా తిట్టించవచ్చుననుకొని పీసీసీ పీఠంపై కూర్చోబెట్టినందుకు అదే భస్మాసురహస్తంగా మారింది. ఇతరులను తిడతాడనుకొంటే.. తమ పార్టీ జాతీయ స్థాయి నాయకులనే అడ్డగోలుగా తిట్టించుకొనే పరిస్థితిని కోరి కొని తెచ్చుకొన్నది. భారతదేశంలో శశిథరూర్‌ ఒక మంచి స్కాలర్‌. ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు …

Read More »

ప్రధానికి సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు

ప్రధానమంత్రి నరేందర్ మోదీ 71వ పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని భవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఎక్కువ కాలం దేశానికి సేవలందించాలి’ అని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

Read More »

బాదం ఎందుకు నానపెట్టాలంటే..?

ఉదయాన్నే లేచిన తర్వాత నాలుగు బాదం పప్పులు, నాలుగు వాల్‌నట్స్‌ తినటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పౌష్టికాహార నిపుణులు చెబుతుంటారు. ఇవి ఎందుకు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఉదయాన్నే ఈ నట్స్‌ తినటం వల్ల హార్మోన్ల సమతౌల్యం బావుంటుంది. మొత్తం రోజంతా అలసిపోకుండా ఉంటారు. వీటిని 8 నుంచి 10 గంటలు నానపెట్టడం వల్ల వాటిలో ఉండే పోషకాలు బయటకు పోవు. బాదంలో ప్రొటీన్‌, విటమిన్‌ ఈ, మెగ్నీషియం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat