అనాథలకు బంగారు భవితను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని, వారికి కేజీ టు పీజీ విద్యనందించడంతోపాటు అదనంగా పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తామని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. అనాథల సంక్షేమం కోసం ఏర్పాటైన సబ్‌కమిటీ సభ్యులు బుధవారం సరూర్‌నగర్‌లోని వీఎం హోమ్‌ను సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న చిన్నారుల సమస్యలను, భవిష్యత్తులో వారికి కావాల్సిన వసతులను అడిగి …
Read More »రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
మొహర్రం సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. పాతబస్తీలో బీబీకా ఆలం ఊరేగింపు నిర్వహించనున్నారు. డబీర్‌పురాలోని బీబీకా ఆలం నుంచి చాదర్‌ఘాట్ వరకు ఊరేగింపు కొనసాగనుంది. ఈ సమయంలో ట్రాఫిక్ మల్లింపులు ఉంటాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
Read More »దేశంలో కొత్తగా 36,401 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,401 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజాగా 39,157 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల్లో 530 మంది బాధితులు మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,23,22,258కు పెరిగింది. ఇందులో 3,15,25,800 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,64,129 ఉన్నాయని చెప్పింది. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 4,33,049 …
Read More »తాలిబన్ల అరాచకం – ఇక మహిళలు సెక్స్ బానిసలుగా మగ్గుతారు!
ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో ఇక అక్కడి మహిళలు ఇండ్లలో సెక్స్ బానిసలుగా మగ్గాల్సిందేనని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాబూల్‌లోని గోడపై మహిళ చిత్రాన్ని ఓ వ్యక్తి చెరిపేస్తున్న ట్విటర్ ఫోటోపై కామెంట్ చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లు మహిళలను ఎక్కడా కనిపించకుండా చేస్తారని..మహిళలు ఇండ్లలోనే సెక్స్ బానిసలుగా మగ్గిపోతూ పిల్లల్ని కనే యంత్రాలుగా ఉండాలని వారు భావిస్తారని అన్నారు. ఇస్లాం …
Read More »ఏడేళ్లలో అగ్రగామిగా నిలిచింది తెలంగాణ
ఏడేళ్లలో అగ్రగామిగా తెలంగాణ మంత్రి కేటీఆర్ గారు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఏడేళ్లలో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు..!!మంగళవారం సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెర్వు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో జరుగుతున్న ‘కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ’ ఓరియంటేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన సమయంలో చాలా అనుమానాలుండేవన్నారు. రాష్ట్రం వచ్చిన …
Read More »బీజేపీ దరఖాస్తు ఉద్యమంపై మంత్రి కేటీఆర్ సెటైర్
బీజేపీ నేతలు తలపెట్టిన దరఖాస్తుల ఉద్యమంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ హామీ ఇచ్చిన రూ.15 లక్షల కోసం దరఖాస్తులు ఆహ్వానించడాన్ని స్వాగతిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అర్హులైన తెలంగాణ వాసులంతా బీజేపీ నేతలకు దరఖాస్తులు పంపాలని.. జన్‌ధన్ ఖాతాల్లోకి ధనాధన్ డబ్బులు వస్తాయంటూ సెటైర్ వేశారు.
Read More »రవితేజతో గోవా బ్యూటీ స్పెషల్ సాంగ్
మాస్ మాహారాజ రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఇందులో ‘మజిలీ’ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, మలయాళ నటి రాజేష్ విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా లేటెస్ట్ సినీ వర్గాల సమాచారం మేరకు..ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ గోవా బ్యూటీ ఇలియానాను సంప్రదించారట. ‘కిక్, ఖతర్నాక్, …
Read More »దుమ్ములేపుతున్న ‘క్రేజీ అంకుల్స్’ మరో పాట
‘క్రేజీ అంకుల్స్’ మూవీ నుంచి తాజాగా ‘అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి’ అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజైంది. యాంకర్ కం నటి శ్రీముఖి ప్రధాన పాత్రలో ఈ సినిమాను ఇ. సత్తి బాబు తెరకెక్కించారు. ఇందులో క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, సింగర్ మనో, భరణి నటించారు. ఈ చిత్రం ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్రం ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి …
Read More »భయపెడుతున్న ‘భూమిక’ ట్రైలర్
టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్ మూవీ ‘భూమిక’. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ విడుదలైంది. రతీంద్రన్ ఆర్.ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 23 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో తాజగా ట్రైలర్ విడుదల చేసింది చిత్ర బృందం. దట్టమైన అడవి లొకేషన్, భూమి గురించి వివరించే సంభాషణతో ప్రారంభమయిన ఈ ట్రైలర్.. ఓ రోడ్డు …
Read More »దేశంలో కొత్తగా 25,166 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 25,166 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 154 రోజుల తర్వాత అతి తక్కువగా కేసులు రికార్డయ్యాయని పేర్కొంది. తాజాగా 36,830 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 24 గంటల్లో మరో 437 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,50,679కు …
Read More »