ఇన్నాళ్లూ మైక్రోసాఫ్ట్ కార్ప్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్లను కొత్త చైర్మన్‌గా ప్రకటించింది ఆ సంస్థ. ఇన్నాళ్లూ ఆ స్థానంలో ఉన్న జాన్ థాంప్సన్‌ను తప్పించి నాదెళ్లకు ఆ పదవి కట్టబెట్టడం విశేషం. 2014లో కంపెనీ సీఈవో అయిన తర్వాత మైక్రోసాఫ్ట్ బిజినెస్ బాగా వృద్ధి చెందింది. ఆయన ఆధ్వర్యంలోనే లింక్డిన్, న్యువాన్స్ కమ్యూనికేషన్స్, జెనిమ్యాక్స్‌లాంటి కంపెనీలను మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంది. 2014లో బిల్ గేట్స్ నుంచి చైర్మన్ పదవిని …
Read More »దర్శకుడు శంకర్ పై మరో కేసు
ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్‌కు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య నడుస్తున్న న్యాయవివాదం కొత్త మలుపు తిరిగింది. కమల్‌హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రం షూటింగ్ పూర్తి చేసేదాకా శంకర్ ఇతర చిత్రాలకు దర్శకత్వం వహించకుండా నిలువరించాలంటూ లైకా ప్రొడక్షన్స్ గతంలో చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. అయితే న్యాయస్థానం స్టేకు నిరాకరించింది. అక్కడ విచారణ కొనసాగుతుండగానే లైకా ప్రొడక్షన్స్ స్టే కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిదట. …
Read More »గ్రామాల వారిగా కలెక్టర్ తనిఖీలు నిర్వహించాలి
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు,ఆశలు నెరవేర్చడంలో ఉద్యోగులు ముందుండాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణం ఆ దిశగా సాగుతోందని అందుకు అనుగుణంగా ఉద్యోగులు పనిచేస్తే కొట్లాడి సాధించుకున్న తెలంగాణా రాష్ట్రం అభివృద్ధి లో అద్భుతమైన విజయాలు నమోదు చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో సమాజానికి సవాల్ విసురుతున్న పర్యావరణ పరిరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం బిగించారని అందులో భాగంగానే …
Read More »ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ ఫైర్
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాకలో ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్-బీజేపీకి దమ్ముంటే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నారా అని నిలదీశారు. బీజేపీ-కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో రైతుబంధు ఇచ్చే సంస్కారం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను ఎంత తిట్టినా ఎంత దూషించిన తమకు పోయేది ఏమీ లేదన్నారు. …
Read More »రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం
తెలంగాణలో వ్యవసాయాన్ని పండగ చేయాలని, రైతును రాజు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ గారు అకుంఠిత దీక్షతో కొనసాగిస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా నేడు మహబూబాద్ జిల్లా, ములుగు నియోజకవర్గం, ఏటూరు నాగారం ఐటిడిఏ పరిధిలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న కొత్తగూడ, పొగుళ్లపల్లిల్లో రైతు వేదికలను రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ప్రారంభించారు. కరోనా కష్టకాలంలోనూ రైతుకి ఇచ్చే …
Read More »అధికారులకు మంత్రి ఎర్రబెల్లి పిలుపు
తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు గ్రామాల్లో నిద్రచేసి అక్కడికక్కడే పరిష్కరించాలని పంచాయతీరాజ్‌శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. పల్లెప్రగతి విజయవంతానికి అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. బుధవారం వరంగల్ నుంచి పల్లెప్రగతిపై అదనపు కలెక్టర్లు, డీపీవోలు, జడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు తప్పనిసరిగా నెలలో కొన్నిరోజులు పల్లెల్లో నిద్రచేయాలని, గ్రామంలో పర్యటించి పరిశుభ్రత, గ్రీనరీ ఇతర అంశాలను పరిశీలించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించాలని …
Read More »పెళ్లైతే ఏంటి అంటూ రెచ్చిపోతున్న కాజల్
సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు చాలా పద్ధతిగా కనిపిస్తుంటారు. అంతకు ముందులా ఏ క్యారెక్టర్ పెడితే ఆ క్యారెక్టర్ ఒప్పుకోరు. కచ్చితంగా తమకంటూ కొన్ని ఆంక్షలు పెట్టుకుంటారు. అయితే కొందరు ముద్దుగుమ్మలు మాత్రం పెళ్లి, కెరీర్ వేరు అంటున్నారు. రెండూ వేటికవే ప్రత్యేకం అంటున్నారు. దేనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఉంది అంటూ హితబోధ చేస్తున్నారు. అందులో కాజల్ అగర్వాల్, సమంత అక్కినేని లాంటి వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. …
Read More »దేశంలో కొత్తగా 67,208 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 67,208 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,00,313కి చేరాయి. ఇందులో 2,84,91,670 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 3,81,903 మంది మరణించారు. మరో 8,26,740 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో 71 రోజుల తర్వాత యాక్టివ్ కేసులు కనిష్టస్థాయికి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న ఉదయం నుంచి …
Read More »ఈ నెల 21న వరంగల్ కు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌లో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానకు ఈనెల 21న శంకుస్థాపన చేయనున్నారు.అందులో భాగంగా సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కలెక్టర్ భవనాన్ని ప్రారంభిస్తారు. తర్వాత జిల్లాలోని గ్రామాల్లో అకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. వరంగల్ నుంచే జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. హాస్పిటల్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాలను మంత్రి …
Read More »షర్మిల హుజూర్ నగర్ పర్యటనలో ట్విస్ట్
తెలంగాణలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో వైఎస్ షర్మిల పర్యటించారు. బంగారుగడ్డలో ఎండీ సలీం కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం హుజూర్‌నగర్‌లో పర్యటించారు. అయితే షర్మిల హుజూర్ నగర్ పర్యటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. మేడారం గ్రామంలో ఇంటికి తాళం వేసి నీలకంఠ సాయి కుటుంబం బయటకు వెళ్లిపోయింది. షర్మిల వస్తున్నారని.. కావాలనే నీలకంఠ కుటుంబాన్ని టీఆర్ఎస్ నేతలు తరలించారని వైఎస్సార్‌టీపీ నేత పిట్టా రాం రెడ్డి ఆరోపించారు. తాళం వేసిన నీలకంఠ …
Read More »