గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం టికెట్‌తో గెలిచిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్… ‘అనధికారికం’గా వైసీపీలో చేరిపోయారు. ఆయన శనివారం తన ఇద్దరు కుమారులతో కలిసి సీఎం జగన్‌ను కలిశారు. వాసుపల్లి కుమారులకు జగన్ వైసీపీ కండువాలు కప్పారు. ఆ పక్కనే వాసుపల్లి నిలుచున్నారు. ఈ కార్యక్రమం ముగించుకుని బయటకు వచ్చాక.. ‘‘నా కుమారులు వైసీపీలో చేరడం ఆనందంగా ఉంది. జగన్ గట్స్ ఉన్న నాయకుడు’’ అని ప్రశంసించారు. …
Read More »రాయుడు విజృంభణ
ఐపీఎల్-13వ సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఘనంగా ఆరంభించింది. కీలక ఆటగాళ్లు లేకపోయినా.. జట్టుకు తగిన ప్రాక్టీస్ లభించకపోయినా ఏమాత్రం ఒత్తిడికి లోను కాని ఎంఎస్ ధోనీ సేన 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై నెగ్గింది. దీంతో వరుసగా ఐదు పరాజయాల తర్వాత ముంబైపై ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. అంబటి రాయుడు (48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71), డుప్లెసి (44 బంతుల్లో 6 ఫోర్లతో 58 …
Read More »యూవీ 6సిక్సర్లకు పదమూడేళ్లు
2007 టీ20 వరల్డ్‌క్‌పలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వీరవిహారం క్రికెట్ అభిమానుల మదిలో చెదరని జ్ఞాపకం. ఇంగ్లండ్‌తో లీగ్ మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో యువీ ఆరు సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ అద్భుతం జరిగి శనివారానికి పదమూడేళ్లు. ఆ సందర్భాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యువీ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ సందర్భంగా తన స్టిల్ ఫొటోను పోస్ట్ చేసిన యువీ.. ‘సమయం …
Read More »24 ఏండ్ల తర్వాత రాజ్యసభకు మాజీ ప్రధాని దేవే గౌడ
మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవే గౌడ 24 ఏండ్ల తర్వాత రాజ్యసభలోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో రాజ్యసభ్యుడిగా గెలుపొందిన ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటకకు చెందిన నలుగురు సభ్యుల పదవీకాలం జూన్ 25తో ముగిసింది. దీంతో జూన్ 12న జరిగిన దైవార్షిక ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. మొత్తం 61 మంది సభ్యులు కొత్తగా ఎన్నికవగా, అందులో 45 మంది జూలై 22న ప్రమాణ …
Read More »అసెంబ్లీలో నేతన్నల గొంతు వినిపించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వరంగల్ తూర్పు చేనేతల వాయిస్ ను వినిపించారు.. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. – రాష్ట్ర చేనేత రంగాన్ని,నేతన్నలను ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ గార్లు కొత్త పుంతలు తొక్కిస్తూ వారికి ఉపాది మార్గాన్ని చూపిస్తున్నారు.. – వరంగల్ కొత్తవాడలోని చేనేత కార్మికులు తయారు చేస్తున్న 50వేల దుప్పట్లు,40 వేల కార్పేట్లు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.. – ప్రభుత్వానికి బారం అయినా నేతన్నల క్షేమం,ఉపాది …
Read More »హరిత ప్రేమికుడు కేసీఆర్
దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రీన్ బడ్జెట్ సీఎం దార్శనికతవల్లే ఉద్యమంలా హరితహారం రాష్ట్రంలో 29 శాతానికి పెరిగిన అటవీ విస్తీర్ణం అసెంబ్లీలో ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి హరితప్రేమికులు ప్రపంచంలోనే లేరని, దేశంలో ఎక్కడా లేనివిధంగా బడ్జెట్‌లో 10 శాతాన్ని పచ్చదనం పెంపుకోసం కేటాయించడమే ఇందుకు నిదర్శనమని ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం అర్బన్ …
Read More »తెలంగాణలో యూరియా కొరత లేదు
– ఫోన్ చేస్తే ఆరుగంటల వ్యవధిలో యూరియా అందుబాటులో ఉంచుతాం – శాసనసభ్యులు తమ నియోజకవర్గాలలో యూరియా కొరత ఉంటే కాల్ చేయండి – గత ఏడాదికన్నా 33.06 శాతం సాగువిస్తీర్ణం పెరిగినా ఎక్కడా యూరియా కొరత లేకుండా చేశాం – ఈ వానాకాలంలో ఇప్పటి వరకు 9.12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచాం .. ఇంకా లక్ష టన్నుల పై చిలుకు యూరియా కేంద్రం నుండి రావాల్సి ఉంది – …
Read More »తెలంగాణ అసెంబ్లీ వర్షకాలం సమావేశాల కుదింపుపై చర్చించిన మండలి చైర్మన్, స్పీకర్
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. సమావేశాలకు వస్తున్న సభ్యులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో వర్షాకాల సమావేశాలు కొనసాగించే అంశంపై చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో మండలి చైనర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. సమావేశాల కుదింపుపై చర్చించినట్లు సమాచారం. ఈ విషయంపై మరోమారు పార్టీల అభిప్రాయం తీసుకువాలని నిర్ణయించారు.*
Read More »ఎనిమిదోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఎనిమిదో రోజు సభాకార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు జీహెచ్ఎంసీ సహా నగరపాలికలు, శివారు మున్సిపాలిటిల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇక శాసనసమండలిలో విద్యుత్ అంశాలపై చర్చ జరగనుంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మండలిలోనూ తీర్మానం చేయనున్నారు.
Read More »త్వరలో వార్డు ఆఫీసర్ పోస్టుల భర్తీ: మంత్రి కేటీఆర్
త్వరలోనే మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ నియామకాలు చేపడతామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మొదటి మూడేండ్లు ప్రొబేషనరీ కాలపరిమితి ఉంటుందని చెప్పారు. వార్డు ఆఫీస్ కార్యాలయాలు కూడా నిర్మిస్తామని తెలిపారు. కార్పొరేటర్, వార్డు ఆఫీసర్ కలిసి పనిచేస్తారని వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు శాసనమండలిలో మంత్రి సమాధానమిచ్చారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకున్నా, రాష్ట్రప్రభుత్వం …
Read More »