Home / Tag Archives: slider (page 941)

Tag Archives: slider

హైద‌రాబాద్ నుంచే క‌రోనాకు టీకా-మంత్రి కేటీఆర్

తెలంగాణ నుంచే క‌రోనా వైర‌స్‌కు తొలి టీకా వ‌స్తుంద‌ని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్‌లో ఉన్న భార‌త్‌బ‌యోటెక్ సంస్థ నుంచే ఆ టీకా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. హైద‌రాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భార‌త్ బ‌యోటెక్ వ్యాక్సిన్ ప్రొడ‌క్ష‌న్ సెంట‌ర్‌ను రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇవాళ సంద‌ర్శించారు. మంత్రి కేటీఆర్‌తో పాటు డాక్ట‌ర్ ఎల్లా, శ్రీమ‌తి సుచిత్రా ఎల్లా కూడా పాల్గొన్నారు. భార‌త్ బ‌యోటెక్ …

Read More »

కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనా వైరస్‌ సోకి మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు కుటుంబీకులు కరోనా పరీక్షలు చేయించారు. ఫలితాల్లో పాజిటివ్‌గా రావడంతో విజయవాడ దవాఖానకు తరలించగా, అక్కడే కన్నుమూశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014లో మూడుసార్లు ఆయన సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన త‌ర్వాత ఏపీలోని తన సొంత గ్రామంలోనే …

Read More »

తెలంగాణలో కొత్తగా 1,286 కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,286 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 391, రంగారెడ్డి జిల్లాలో 121 నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 68,946 కేసులు నిర్ధారణ కాగా, ఇందులో 18,708 యాక్టివ్‌ కేసులు ఉండగా, 49,675 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 12 మంది వైరస్‌ ప్రభావంతో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 563కు …

Read More »

దేశంలో ఒకే రోజు 6.6లక్షల కరోనా టెస్టులు

గత 24 గంటల్లో కరోనా వైరస్‌ నిర్ధారణ కోసం 6.6లక్షలకుపైగా పరీక్షలు నిర్వహించడం ద్వారా భారత్ ఒకే రోజు అత్యధిక పరీక్షలను నమోదు చేసిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కోవిడ్-19కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారతదేశం గత 24 గంటల్లో 6,61,715 పరీక్షలను చేసిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 2,08,64,206 నమూనాలను పరీక్షించినట్లు …

Read More »

ముఖ్యమంత్రి కేసీఆర్ కి రాఖీ కట్టిన సోదరీమణులు

రక్షాబంధన్‌ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు ఆయన అక్కలు రాఖీ కట్టారు. ప్రగతిభవన్‌కు సోమవారం వచ్చిన సీఎం అక్కలు లలితమ్మ, సకలమ్మ, లక్ష్మీబాయి, వినోదమ్మ ఆయనకు స్వీట్లు తినిపించి రక్షాబంధన్‌ కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ రక్షా బంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అన్నదమ్ములు అక్కాచెల్లెండ్ల ప్రేమ, అనురాగానికి గుర్తుగా నిలుస్తుందన్నారు.

Read More »

సర్కారు దవాఖానల్లో సేవలు భేష్‌

కరోనా బాధితులకు సర్కారు దవాఖానల్లో గొప్ప సేవలు అందుతున్నాయని, అక్కడి డాక్టర్లు బాగా పనిచేస్తున్నారని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ కితాబిచ్చారు. సర్కారు దవాఖానల్లో నమ్మకంగా చికిత్స తీసుకోవచ్చని చెప్పారు. సోమవారం రాఖీ పండుగ సందర్భంగా కరోనా నుంచి కోలుకుని, ప్లాస్మా దానం చేసిన 13 మందికి గవర్నర్‌ రాఖీలు కట్టి, స్వీట్లు అందించారు. సర్కారు దవాఖానల్లో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది అంకితభావంతో సేవలు చేస్తున్నారని అభినందించారు. ప్రైవేటు దవాఖానలుసైతం …

Read More »

మంత్రి హారీష్ రావు పిలుపు

అందరం కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొందాం అని ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు పిలుపు ఇచ్చారు. బేగంపేటలోని మానస సరోవర్‌ హోటల్‌లో మహావీర్‌, జితో అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జితో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. 100 పడకల ఈ సెంటర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కరోనా రోగులకు సహనం, మానవత్వంతో చికిత్సలు అందించాలని సెంటర్‌లోని వైద్యులకు, నర్సులకు సూచించారు. ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టడంలో జైనుల సంస్థ ఎప్పుడూ ముందుంటుందన్నారు. …

Read More »

సోనూ సూద్ బాటలో సుకుమార్

కరోనా సమయంలో మానవత్వం ఉన్న మనిషిగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన పేరు ఇప్పుడు ప్రతిచోటా మారుమోగుతోంది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడందరూ సోనూసూద్‌ని రియల్ హీరోగా చూస్తున్నారు. ఇప్పుడాయన ఎందరికో స్ఫూర్తి నింపుతున్నారు. ముగ్గురు అనాథల కథనం సోనూసూద్ వరకు వెళ్లడం, ఆయన వారి బాధ్యత తీసుకుంటానని చెప్పడం తెలిసిన విషయాలే. అయితే నిర్మాత దిల్ రాజు ఆ ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని …

Read More »

మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన జీవితాంతం కృషి చేసిన రాజయ్య, అత్యంత నిరాడంబర రాజకీయ నాయకుడిగా పనిచేశారు. ప్రజల హృదయాల్లో నిలిచి పోతారని సిఎం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read More »

వంగపండు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల బాధలు- సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతి వృత్తంగా పాటలు రాశారు.. రాసి పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జీవితాంతం పాటుపడ్డారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat