Home / Tag Archives: telangana assembly (page 2)

Tag Archives: telangana assembly

తెలంగాణలో విప్లవాత్మక ప్రజా చట్టం

తెలంగాణ రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం అన్నది ఆరంభం మాత్రమేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. అన్ని వర్గాలవారికి భూ సంబంధిత ఇబ్బందులు తొలిగించేలా దశలవారీగా మరిన్ని మెరుగైన విధానాలను తీసుకొని రానున్నామని శుక్రవారం శాసనసభ వేదికగా ప్రకటించారు. శతాబ్దాలుగా ఉన్న భూముల సమస్యలకు సమగ్ర డిజిటల్‌ సర్వే ఉత్తమ పరిష్కారమని పేర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో వీలైనంత త్వరగా రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్‌ సర్వే చేస్తామని చెప్పారు. రికార్డులన్నీ పలు సర్వర్ల …

Read More »

న‌గ‌రాభివృద్ధికి రూ. 30 వేల కోట్లు : మ‌ంత్రి కేటీఆర్

హైద‌రాబాద్  నగరంలో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి) కింద చేపట్టిన పనులను రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి స‌భ ముందు ఉంచారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఈ అంశంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. ఎస్ఆర్‌డీపీ కింద 9 ఫ్లై ఓవ‌ర్లు, 4 అండ‌ర్‌పాస్‌లు, 3 ఆర్‌యూబీ, ఒక వంతెన‌తో పాటు ఒక కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసిన‌ట్లు మంత్రి …

Read More »

పంచాది లేకుండా పంపకాలు

తాతల నుంచి వచ్చిన భూములు పంచుడంటేనే పంచాదిలు. తిట్టుకునుడు, కొట్టుకునుడు దాకా పోతయి. కానీ, అట్లోంటి పంచాయితీలకు కొత్త రెవెన్యూ చట్టంతో సర్కారు చెక్‌ పెట్టింది. వంశపారంపర్య భూమిని (ఫౌతీ) పంచుకొనే హక్కును కుటుంబానికే అప్పగించింది.వారసులంతా కూర్చొని, మాట్లాడుకొని పంపకాలు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నది. లొల్లి.. కొట్లాటలు వారసత్వంగా వచ్చే భూమి పంపకాల్లో గొడవలకు కొదవేలేదు. ప్రస్తుత విధానంలో వారసులు ముందుగా అడంగల్‌, పహాణీ, పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్‌డీడ్‌ తదితర …

Read More »

రెవిన్యూ చట్టం దేశంలోనే సంచలనం

తెలంగాణ వచ్చిన రోజున ఎంత సంతోషంగా ఉన్నానో.. ఇవాళ అంతే సంతోషంగా ఉన్నా. తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడి, రైతులకు, నిరుపేదలకు, నోరులేనివారికి అండగా నిలిచే చట్టాన్ని తీసుకొస్తున్నాం. సరళీకృతమైన, అవినీతిరహితమైన ఇంత గొప్ప చట్టాన్ని శాసనసభలో ప్రతిపాదిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నది’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం రాష్ట్ర శాసనసభలో చరిత్రాత్మకమైన రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌ భావోద్వేగానికి …

Read More »

ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనాను తెస్తాం

తెలంగాణ రాష్ట్రంలో  కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీనిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే కరోనా చికిత్స పొందిన పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ కింద సాయం చేస్తామని తెలిపారు. వాటికి సంబంధించిన బిల్లులుంటే తనకు పంపాలని కోరారు. కరోనాపై బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ పక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్‌ …

Read More »

నేడు స‌భ ముందుకు నూత‌న‌ రెవెన్యూ చ‌ట్టం

తెలంగాణ  రాష్ట్రంలో త్వ‌రలో నూత‌న రెవెన్యూ చ‌ట్టం అమ‌ల్లోకి రానుంది. లోప‌భూయిష్టంగా ఉన్న ప్ర‌స్తుత చ‌ట్టం స్థానంలో స‌రికొత్త రెవెన్యూ చ‌ట్టాన్ని ప్ర‌భుత్వం రూపొందించింది. అవినీతి రహిత వ్యవస్థే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం భూ యాజ‌మాన్య హ‌క్కుల చ‌ట్టం-2020 (ఆర్ఓఆర్‌) ఈరోజు అసెంబ్లీ ముందుకు రానున్నది. ప‌రిపాల‌న‌తో సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌..  అనేక చ‌ట్టాలు, క్లిష్ట‌మైన‌ నిబంధనలతో కూడిన రెవెన్యూ వ్యవస్థను …

Read More »

క‌లం వీరుడు రామ‌లింగారెడ్డి: మ‌ంత్రి కేటీఆర్

ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో రామ‌లింగారెడ్డి లాంటి నాయకులు అరుద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. క‌లం వీరుడిగా ఉద్య‌మానికి మ‌ద్ద‌తునిచ్చిన వ్య‌క్తి రామ‌లింగారెడ్డి అని పేర్కొన్నారు. దివంగ‌త ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రామ‌లింగారెడ్డిది గొప్ప వ్య‌క్తిత్వ‌మ‌ని, నిరాడంబ‌ర‌మైన జీవ‌న విధానంతో ఉండేవార‌ని చెప్పారు. అంద‌రితో క‌లుపుగోలుగా ఉండేవారని తెలిపారు. 2004లో జ‌రిగిన‌ ఎన్నిక‌ల సంద‌ర్భంగా దొమ్మాట నియోజ‌క‌వ‌ర్గానికి రామ‌లింగారెడ్డి …

Read More »

అసెంబ్లీ వ‌ర్షాకాల‌ స‌మావేశాలు ప్రారంభం

‌తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభం అయ్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లిని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డికి స‌భ నివాళుల‌ర్పించింది. వారి సేవ‌ల‌ను స‌భ్యులు గుర్తు చేశారు. కొవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో స‌భ్యుల‌తో పాటు అసెంబ్లీ సిబ్బంది భౌతిక దూరం పాటిస్తూ, విధిగా మాస్కు ధ‌రించారు. కరోనా …

Read More »

ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల తెలంగాణ శాస‌న‌స‌భ సంతాపం

భార‌త‌ర‌త్న, మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతి ప‌ట్ల తెలంగాణ శాస‌న‌స‌భ సంతాపం తెలిపింది. ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల సంతాప తీర్మానాన్ని రాష్ర్ట సీఎం కేసీఆర్ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల తెలంగాణ శాస‌న‌స‌భ ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నామ‌ని తెలిపారు. భార‌త‌దేశం శిఖ‌ర స‌మాన‌మైన నాయ‌కుడిని కోల్పోయింది. 1970 త‌ర్వాత దేశ అభివృద్ధి చ‌రిత్ర‌లో ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ పేరుకు …

Read More »

హ్యాపీ బర్త్‌డే చిచ్చా.. మీ చిరునవ్వు నన్ను ఆశ్చర్యపరుస్తోంది.

 శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ట్విట్టర్‌ వేదికగా పద్మారావు గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌డే చిచ్చా అంటూ సంతోష్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. మీ చిరునవ్వు, సరళత, ప్రజల పట్ల మీరు చూపిస్తున్న దయ తనను ఎప్పుడూ ఆశ్చర్య పరుస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆకలితో పోరాడుతున్న …

Read More »