ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈరోజు జరిగిన జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కోవా లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా కలెక్టర్ హేమంత్ భోర్ఖడే, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డి. వేణు, ఎస్పీ కే. సురేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.