Home / SLIDER / ముంపు సమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం..

ముంపు సమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం..

కూకట్ పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ పరధిలోని దీన్ దయాల్ నగర్, అమృత్ నగర్ తాండలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, స్థానిక కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ తో కలిసి బుధవారం ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యలకు శాశ్వతంగా పరిష్కరించేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ పర్యటనలో జోనల్ కమీషనర్ మమతా, డీసీలు ఇతర అధికారులు ఉన్నారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశాబ్దాల వరద ముంపు సమస్యలకు స్ట్రాటెజిక్‌ నాలా డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(ఎస్‌ఎన్‌డీపీ) కార్యక్రమంతో త్వరలోనే శాశ్వత పరిష్కారం కానుందని అన్నారు. ఇటీవల చేపట్టిన పాదయాత్రలో స్థానికులు ప్రస్థావించిన సమస్యలపై నిరర్తరం కృషి చేస్తున్నామన్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలలో ఉన్న కాలనీలను పరిశీలించి వాటిపై సత్వరమే పరిష్కారం చూపాలని అధికారులను కోరారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక కూకట్పల్లి నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయలతో నాలా వ్యవస్థ డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేశామని అందువల్ల నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలలో 50% లోతట్టు ప్రాంతాలలో ఉన్న కాలనీలో నీళ్లు ఉండకుండా రిటర్నింగ్ వాళ్ళు సైతం ఏర్పాటు చేశామన్నారు.

పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో నగరంలో ఇప్పటికే ముంపు నివారణ పనులు జరుగుతున్నాయని, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో సుదీర్ఘకాలంగా ఉన్న ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని తెలిపారు. అంతేకాక దీన్ దయాల్ నగర్ లో బ్రిడ్జి ఏతూ పెంచడం విష్యంపై కూడా జిహెచ్ఎంసి కమిషనర్ తో ప్రస్తావించారు. వీలైనంత త్వరలో ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని స్థానికులకు ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగింది.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat