Home / Tag Archives: telangana (page 34)

Tag Archives: telangana

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వార్తిక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2.20లక్షల మందికి ఈ స్టడీ మెటీరియల్ ఫ్రీగా ఇవ్వనున్నారు త్వరలో స్కూళ్లకు చేరనున్నాయి. ఇప్పటికే ఇంటర్ విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ ప్రకటించారు. tsbie.cgg.gov.inలో ఇంటర్ మెటీరియల్ పొందొచ్చు

Read More »

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

తెలంగాణలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల గ్రాముల బంగారం ధర రూ.210 పెరిగి రూ.46,040కు చేరింది. ఇక 22 క్యారెట్ల గ్రాముల బంగారం ధర రూ.190 పెరిగి రూ.42,200కు చేరింది. ఇక వెండి కేజీపై రూ.900 పెరిగి రూ.72,500గా ఉంది

Read More »

తెలంగాణలో కొత్తగా 313 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 313 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా నుంచి 142 మంది బయటపడగా, మరో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,360కి చేరుకోగా, 2,98,262 మంది కోలుకున్నారు. ఇప్పటిరకు మహమ్మారివల్ల 1664 మంది మృతిచెందారు. మరో 2434 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇందులో 943 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, రాష్ట్రంలో కరోనా మృతుల రేటు 0.55 …

Read More »

తెలంగాణ బడ్జెట్ 2021-22- రైతుల రుణాలు మాఫీకి 5,225 కోట్లు

గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా రూ. ల‌క్ష లోపు రుణాలున్న రైతుల‌కు రుణ‌మాఫీ చేస్తామ‌ని ఇచ్చిన హామీని నిల‌బెట్టుకుంటామ‌ని మంత్రి హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా మంత్రి ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే రూ. 25 వేల లోపు ఉన్న రుణాల‌ను మాఫీ చేశామ‌ని తెలిపారు. క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో మిగ‌తా రుణాలను మాఫీ చేయ‌డంలో కొంత ఆల‌స్యం జ‌రిగింద‌న్నారు. త్వ‌ర‌లోనే ఈ రుణాల‌ను మాఫీ …

Read More »

తెలంగాణలో కొత్తగా 157 కరోనా కేసులు

తెలంగాణలో గత రాత్రి గం.8 వరకు కొత్తగా 157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,01,318కు పెరిగింది. ఇక నిన్న కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,654కు చేరింది. నిన్న కరోనా నుంచి 166 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 1,983 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

అందరికి ఆదర్శంగా నిలిచిన నవ వధువు

మరి కొద్దిసేపట్లో పెళ్లి ఉండగా.. తన ఓటు హక్కును వినియోగించుకొని ఆదర్శంగా నిలిచింది ఓ నవ వధువు. మహబూబ్‌నగర్‌ జిల్లా మల్కాపూర్‌ గ్రామానికి చెందిన ఫిర్దోస్‌ బేగం పెళ్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో ఆదివారం ఉదయం 10గంటలకు ఏర్పాటు చేశారు. మరో వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో వధువు ఉదయం 8.30గంటలకు కోయిలకొండ మండల కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటుహక్కును వినియోగించుకుంది. ఆ తర్వాత …

Read More »

జీహెచ్ఎంసీలో తగ్గని కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటల్లో మరో 46 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 81,257 కరోనా కేసులు నమోదయ్యా యి. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు

Read More »

వీ-హ‌బ్’ దేశానికే రోల్ మోడ‌ల్ : మ‌ంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని ఐటీసీ కాక‌తీయ‌లో అప్‌స‌ర్జ్ పేరుతో ప్రీ ఇంక్యూబేష‌న్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఆస్ర్టేలియా భాగ‌స్వామ్యంతో అప్‌స‌ర్జ్ కార్య‌క్ర‌మాన్ని వీ-హ‌బ్ నిర్వ‌హిస్తోంది. ఈ కార్య‌క్ర‌మానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, భార‌త్‌లోని ఆస్ర్టేలియా హైక‌మిష‌న‌ర్ హెచ్ఈ బారీ ఓ ఫ‌ర్రెల్, సౌత్ ఇండియాలోని ఆస్ర్టేలియా కాన్సూల్ జ‌న‌ర‌ల్ సారా కిర్ల్యూ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మూడేండ్ల క్రితం ప్రారంభ‌మైన వీ-హ‌బ్ దేశానికే రోల్‌మోడ‌ల్‌గా నిలిచింద‌న్నారు. వీ-హ‌బ్‌తో …

Read More »

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి కేటీఆర్

జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వ కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చనిపోయిన జర్నలిస్టుల పిల్లలను రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదివిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఆదివారం నగరంలోని జలవిహార్‌లో టీయూడబ్ల్యూజే సభ్యులతో జరిగిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తానే తీసుకుంటున్నానని అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు అడ్డుంకులున్నాయని వాటిని కూడా చూస్తానని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ లేనిదే టీకాంగ్రెస్‌, టీబీజేపీ ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. …

Read More »

జీహెచ్ఎంసీలో 29 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంగళవారం రాత్రి 8 గంటల వరకు 29 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 80,878 కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat