నవంబర్ మూడో తారీఖున జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్‌రావుకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేసే అంశంపై ఆ రెండు పార్టీల్లో చర్చ జరుగుతోంది. పవన్ ప్రచారానికి వస్తే, తమకు మరింత అనుకూలిస్తుందని దుబ్బాక సెగ్మెంటు బీజేపీ నాయకులు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ-జనసేన పార్టీల మధ్య ఇప్పటికే పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి …
Read More »1978లోనే చరిత్ర సృష్టించిన నాయిని
నాయిని నర్సింహారెడ్డి తొలిసారిగా 1978 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నాయిని.. టంగుటూరి అంజయ్యను ఓడించారు. మూడు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన నాయిని.. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణ ఉద్యమం తర్వాత 1975లో ఎమర్జెన్సీ సమయంలో సోషలిస్టు పార్టీ నాయకులందర్నీ పోలీసులు అరెస్టు చేశారు. నాయినితో పాటు పలువురిని 18 నెలల పాటు చంచల్‌గూడ జైల్లో పెట్టారు. ఆ …
Read More »జొన్న రొట్టే, కోడి మాంసం అంటే నాయినికి మస్త్ ఇష్టం
మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి జొన్నరొట్టే, కోడి మాంసం అంటే భలే ఇష్టం. ఈ రెండింటి కాంబినేషన్ చిన్నప్పటి నుంచే ఆయనకు అలవాటు. అది ఇప్పటి వరకూ కొనసాగింది. ఆదివారం వచ్చిందంటే ఇంట్లో జొన్నరొట్టె, కోడి మాంసం వండాల్సిందే. ఈ వంటకాన్ని నాయిని అతి ఇష్టంగా తినేవారు. బేగంబజార్ జిలేబీ అంటే మహా ఇష్టం. ఇక పాతబస్తీలోని బేగంబజార్‌కు నాయినికి ఎంతో అనుబంధం ఉంది. సోషలిస్టు ఉద్యమాలు చేసిన సమయంలో …
Read More »తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మంత్రి హరీష్ దిమ్మతిరిగే షాక్
బీడీ కార్మికులకు ఇచ్చే రూ.2వేల పింఛన్‌లో కేంద్రప్రభుత్వమే రూ.1,600 ఇస్తున్నదంటూ కమలనాథులు గోబెల్స్‌ను మించి ప్రచారం చేస్తున్నారని ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రప్రభుత్వం అందించే పింఛన్లతోపాటు, కేసీఆర్ కిట్లకిచ్చే డబ్బంతా కేంద్రానిదే అన్నట్టు వారు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దుబ్బాకలో ఎన్నికల పేరుతో బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. ‘బీజేపీనేతలు చేస్తున్న ప్రచారం వాస్తవమైతే, వారు దుబ్బాక బస్టాండ్ సెంటర్‌కు వచ్చి ప్రజల మధ్య నిరూపిస్తే మంత్రి, ఎమ్మెల్యే …
Read More »గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త
వారం రోజులుగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు, ముంచెత్తుతున్న వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుండటంతో బాధితులను ఆదుకొనేందుకు నేనున్నానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభయమి చ్చారు. భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన సోమవారం తెలిపారు. వరద ప్రభావానికి గురైన కుటుంబాలకు ఇంటికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. వర్షాలు, వరదల …
Read More »పటిష్ఠంగా సఖీ కేంద్రాలు
మహిళల సమస్యలన్నింటికి ఒకే కేంద్రంగా పరిష్కారం చేస్తున్న సఖీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేశామని, ఈ నెలాఖరు నుంచి అమలు చేయనున్నట్లు రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలిపారు. సఖీ కేంద్రాలను పటిష్టం చేయడం, మహిళా పాలిటెక్నిక్ కాలేజీ అడ్మిషన్లు, ప్రైవేట్ ఎన్జీవోలలోని బాలికలకు భద్రత, భవిష్యత్ కల్పించడం వంటి అంశాలపై నేడు మహిళాభివృద్ధి, …
Read More »భార్యపై అనుమానంతో..!
అనుమానం పెనుభూత మైంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని భార్యను అతి కిరాతకంగా నరికి చంపాడో భర్త. శరీరం నుంచి తలను వేరు చేసి.. వివాహేతర సంబంధం కలిగి ఉన్న వ్యక్తి ఇంటి గుమ్మం ఎదుట పడేశాడు. ఈ దారుణం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జుర్రు సాయిలు, అనుషమ్మ (35) దంపతులు. తన భార్యఅనంతసాగర్ గ్రామానికి చెందిన …
Read More »తెలంగాణలో కరోనా బాధితుల రికవరీ రేటు 88.45%
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల రికవరీ రేటు రోజురోజుకూ పెరుగుతున్నది. సోమవారం 88.15 శాతం రికవరీ రేటు ఉండగా, మంగళవారానికి 88.45 శాతానికి పెరిగింది. దేశంలో రికవరీ రేటు 87 శాతంగా నమోదైందని వైద్యారోగ్యశాఖ బుధవారం విడుదలచేసిన బులెటిన్‌లో పేర్కొన్నది. ఇప్పటివరకు మొత్తం 36.64 లక్షల వైరస్ నిర్ధారణ పరీక్షలు పూర్తిచేయగా, 2.16 లక్షల మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో 1.91 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 23,728 మంది …
Read More »తెలంగాణలో కొత్తగా 1,021 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,021 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఆరుగురు మృతి చెందారు. తెలంగాణలో కరోనా కేసులు 2,13,084కి చేరుకుంది. అయితే కరోనా కారణంగా ఇప్పటి వరకూ 1,228 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 24,514 యాక్టివ్ కేసులుండగా.. 1,87,342 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు తెలంగాణలో 35.77 లక్షల కరోనా టెస్టులను నిర్వహించారు. జీహెచ్ఎంసీ 228, మేడ్చల్ 84, రంగారెడ్డి 68 …
Read More »నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకి చెందిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఆరు టేబుళ్లపై రెండు రౌండ్‌ల పాటు కౌంటింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 823 ఓట్లు పోలవగా, మొదటి రౌండ్‌లో 600 ఓట్లను లెక్కించనున్నారు. రెండో రౌండ్‌లో 223 ఓట్లను లెక్కిస్తారు. పోలైన ఓట్లలో వాలిడ్ ఓట్లు తీయగా సగానికంటే ఒక ఓటు ఎక్కువ పోలైన అభ్యర్థిని …
Read More »