తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,021 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఆరుగురు మృతి చెందారు. తెలంగాణలో కరోనా కేసులు 2,13,084కి చేరుకుంది.
అయితే కరోనా కారణంగా ఇప్పటి వరకూ 1,228 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 24,514 యాక్టివ్ కేసులుండగా.. 1,87,342 మంది రికవరీ అయ్యారు.
ఇప్పటివరకు తెలంగాణలో 35.77 లక్షల కరోనా టెస్టులను నిర్వహించారు. జీహెచ్ఎంసీ 228, మేడ్చల్ 84, రంగారెడ్డి 68 కరోనా కేసులు నమోదు అయ్యాయి.