తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలోమూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఒక రెగ్యులేటరీ గేట్ విరిగిపోయిన సంగతి మనకు తెలిసిందే. గేట్ విరగడంతో ప్రాజెక్టులోని నీరు వృథాగా పోతుంది. ఈ నేపథ్యంలో మూసీ డ్యామ్ వద్దకు చేరుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, ఈఎన్‌సీ మురళీధర్‌రావు.. గేట్ విషయమై నీటిపారుదల అధికారులతో సమీక్ష …
Read More »అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ శరన్నరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు సద్దుల బతుకమ్మ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.అందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. స్టేడియంలో ఆడపడుచులంతా తీరొక్క పూవులతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ.. నృత్యాలు చేశారు. మహిళలంతా ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు …
Read More »జీ హుజూర్ అందామా?.. జై హుజూర్ నగర్ అందామా..?
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి,అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి లను నిలిపింది. ఎన్నికల ప్రచారంలో పలు పార్టీలు దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ తరపున మంత్రి,ఆ పార్టీ వర్కింగ్ …
Read More »హుజూర్ నగర్ ఉప ఎన్నిక.. సీఈసీ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈనెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నిక జరగనున్న సంగతి విధితమే. ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి,అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి లను నిలిపింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంచలన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఎస్పీగా …
Read More »హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ అవుట్..ఉత్తమ్ కు ఆ పార్టీ నాయకులే చుక్కలు చుపిస్తున్నారా..?
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత రాజకీయాలకు అద్దం పడుతోందని ప్రచారం జరుగుతోంది. పట్టుబట్టి తన సతీమణికి టికెట్ ఇప్పించుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ పార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారు. పార్టీ సీనియర్ లీడర్లు ప్రచారం వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎన్నికలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి వ్యవహారం అయినట్టు.. దూరంగా ఉండిపోతున్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి.. ప్రచారం చేసేది లేదంటూ.. తన వర్గీయులతో …
Read More »టీఆర్ఎస్ కే మా మద్దతు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి విదితమే. అందులో భాగంగానే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఎన్నికలు జరగనున్నాయి. ఇరవై నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించింది. నామినేషన్ల పర్వం కూడా ముగియడంతో ప్రచారంలో …
Read More »తెలంగాణలోని విద్యావాలంటర్లకు సర్కారు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రభుత్వ బడుల్లో విద్యావాలంటర్లుగా పనిచేస్తోన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న గౌరవప్రద జీతాలను విడుదల చేస్తూ ఆదేశాలను జారీచేసింది . అందులో భాగంగా సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు దాకా ఉన్న మొత్తం 75.17 కోట్ల రూపాయలను వాలంటర్లకు జీతాలను చెల్లించడానికి విడుదలయ్యాయి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ తెలిపారు . విద్యాశాఖ …
Read More »రాజభవన్ ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
బతుకమ్మ సంబురాలను రాజభవన్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దిన మహిళలు పాటలు పాడుతూ ఈ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా గవర్నరు తమిళసై సౌందరరాజన్ తెలుగులో తెలంగాణాలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు బంగారం, దుస్తులతోపాటు పూలను బాగా ఇష్టపడతారని, శరత్ రుతువు ఆగమనాన్ని తెలియజేసే చక్కని పూల పండుగ బతుకమ్మ పండుగ అని ఆమె అభివర్ణించారు. బతుకమ్మ బతుకమ్మ …
Read More »ప్రతిపక్షాలకు సుప్రీం కోర్టు షాక్
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని ఆత్మహత్యలు చేసుకున్న ఇంటర్ విద్యార్థుల గురించి దాఖలైన పిటిషన్‌పై విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆత్మహత్యలకు ఫలితాలే కారణమని చెప్పలేమని ధర్మాసనం వెల్లడించింది. ఇదే తరహా పిటిషన్‌ను గతంలోనూ కొట్టేసినట్లు సుప్రీంకోర్టు తెలిపింది.అయితే ఈ పిటిషన్లు ప్రతిపక్షాల ప్రోద్భలంతో వేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
Read More »రేపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి వర్గం భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రేపు అక్టోబర్ ఒకటో తారీఖున మంత్రి వర్గం భేటీ కానున్నది. రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రగతిభవన్ ముఖ్యమంత్రి కార్యాలయంలో సాయంత్రం నాలుగంటలకు ఈ భేటీ జరగనున్నది. ఈ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకొనున్నట్లు సమాచారం. ఇందులో చర్చించి కొత్త రెవిన్యూ చట్టం గురించి కీలక నిర్ణయం తీసుకుంటారని అధికారక వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి రెవిన్యూ …
Read More »