ఆపదలో ఉన్న వారికి ఆపద్భాందవుడిలా నిలుస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ప్రతి రోజు ట్విట్టర్‌లో కేటీఆర్ సాయం కోరుతూ ఎన్నో ట్వీట్లు వస్తుంటాయి. వాటికి కేటీఆర్ వెంటనే స్పందిస్తూ వారికి కావల్సిన సాయం చేస్తూనే ఉంటారు. తాజాగా సౌదీ అరేబియా నుంచి ఓ మహిళ కేటీఆర్‌కు ట్వీట్ చేసింది. మా నాన్న చనిపోయారు. ఇండియా రావాలనుంది. నాకు మీ సహకారం కావాలి’అంటూ రంగారెడ్డి జిల్లా కర్మన్‌ఘాట్‌లోని భూపే ష్‌గుప్తా నగర్‌కు …
Read More »కొత్త అసెంబ్లీ కడితే తప్పేంటీ…పిటీషనర్లకు హైకోర్ట్ చివాట్లు…!
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాలను చేపట్టిన సంగతి తెలిసిందే. అసెంబ్లీని ఎర్రమంజిల్‌లో నిర్మిస్తుండడంతో పురాతనమైన ఎర్రమంజిల్ బిల్డింగ్‌ను ప్రభుత్వం కూల్చివేస్తుందంటూ ప్రతిపక్షాలు రాగాలు మొదలుపెట్టాయి. చారిత్రక భవనాలను కూల్చి వేతపై కొందరు హైకోర్ట్‌కు వెళ్లగా ఈ రోజు హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటీషనర్లకు న్యాయమూర్తుల బెంచ్ కొత్త అసెంబ్లీని ఎందుకు …
Read More »సిద్ధార్థ స్నేహపూర్వకమైన వ్యక్తి.. కేటీఆర్
కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ మృతి చెందిన తీరు తనను షాక్‌కు గురిచేసిందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్థ.. మంగుళూరు వద్ద ఉన్న నేత్రావతి నదిలో పడి ఆత్మాహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతని మృతదేహాన్ని ఇవాళ ఉదయం జాలర్లు గుర్తించారు. సిద్ధార్థ చనిపోయిన తీరు తనను బాధకు గురిచేసిందని కేటీఆర్ అన్నారు. …
Read More »కేంద్రానిది రహస్య ఎజెండా… మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
కేంద్రప్రభుత్వం రూపొందించిన జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ)-2019 ముసాయిదాలో స్పష్ట త లేదని, ఇందులో కుట్రలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. దీని వెనుక రహస్య ఎజెండా దాగి ఉన్నదని, విద్యావిధానం ప్రగతిశీలకంగా ఉండాలే తప్ప ప్రమాదకరంగా ఉండకూడదని సూచించారు. విద్యావిధానంపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాలని, కానీ కేంద్రానికి ఆ ఉద్దేశం ఉన్నట్టుగా కనిపించడం లేదని చెప్పారు. విద్యను వికేంద్రీకరణ నుంచి కేంద్రీకరణ …
Read More »యాదాద్రిలో మహా సుదర్శన యాగం! సీఎం కేసీఆర్ నిర్ణయం.. చినజీయర్ స్వామితో చర్చ
యాదాద్రిలో మహా సుదర్శన యాగం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. యాగం నిర్వహణ ఏర్పాట్లపై త్రిదండి చినజీయర్ స్వామితో చర్చించారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అభివృద్ధి పనులు ముగింపు దశలో ఉన్న నేపథ్యంలో యాదాద్రిలో మహాసుదర్శన యాగం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం శంషాబాద్ …
Read More »తెలంగాణలో అద్భుత జల దృశ్యం… సంద్రంలా.. సుందిల్ల…!
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మంథని మండలం సిరిపురంలో నిర్మించిన సుందిల్ల బరాజ్ సంద్రాన్ని తలపిస్తున్నది. కాసిపేటలోని అన్నారం పంపుహౌస్‌లో నాలుగు మోటర్లు రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఎత్తిపోస్తుండడంతో సోమవారం సాయంత్రానికి బరాజ్‌లో నీటినిల్వ 5.82 టీఎంసీలకు చేరుకున్నది. దిగువన మేడిగడ్డ బరాజ్‌లో సోమవారం సాయంత్రం 4 గంటల సమయానికి 4.584 టీఎంసీల నీటినిల్వ ఉన్నది. అన్నారం బరాజ్‌లో 7.77 టీఎంసీలుగా నమోదైంది. సుందిల్ల బరాజ్ బ్యాక్‌వాటర్ గోలివాడ పంప్‌హౌస్‌కు …
Read More »గోదావరిఖనిలో కాళేశ్వరం జలజాతర ..జనసంద్రమైన జలజాతర
డబ్బు ఖర్చుపెట్టకుండా ఏదైనా జరుగుతుందా.. వంద రూపాయల ప్రయోజనం కలగాలంటే పది రూపాయలయినా ఖర్చుపెట్టొద్దా.. కుండల అన్నం కుండలే ఉంటే పిల్లాడు ఎట్ల పెరుగుతడు.. కాంగ్రెస్ నాయకులు మూర్ఖంగా మాట్లాడుతున్నరు అని సంక్షేమశాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గోదావరి తీరంలో నిర్వహించిన కాళేశ్వరం జలజాతర కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రాణహిత జలాలను ఒడిసిపట్టి తెలంగాణను …
Read More »జయహో కేసీఆర్… తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చనున్న కాళేశ్వరం..!
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తర్వాతే ఎవరైనా. ఆయన ఏదైనా అనుకుంటే సాధించే వరకు పట్టు విడువరు. లక్ష్యాన్ని చేరుకునే దాకా విశ‌్రమించరు. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, నేడు బంగారు తెలంగాణ సాధనలో ఆయన ఎన్నో అడ్డంకులు అధిగమిస్తూ అజేయుడిగా నిలుస్తున్నారు. ఎవరైనా అనుకున్నారా…తెలంగాణ రాష్ట్రం వస్తుందని..ఎవరైనా అనుకున్నారా..బీడు వారిన తెలంగాణ మాగాణుల్లో గోదావరి జలాలు పారుతాయని, అసలు ఎవరైనా ఊహించారా…పల్లానికి ప్రవహించే నీటిని పైకి …
Read More »సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు కీలక ఆదేశాలను జారీచేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వలన.. పైనుండి వస్తున్న వరదల వలన ఆల్మట్టి,నారాయణ్ పూర్ నుంచి కృష్ణానది పరవళ్లు తొక్కుతూ వస్తుంది. దీంతో జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద నీళ్లు వస్తున్నాయి.దీనివలన జూరాల నిండిన వెంటనే నెట్టెంపాడు,బీమా,కోయిల్ సాగర్ లిప్టులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీచేశారు. భారీగా వరద వచ్చే అవకాశమున్నందున పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం …
Read More »తెలంగాణలో ఐఐఐటీ క్యాంపస్
తెలంగాణలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) క్యాంపస్ ఏర్పాటు కానుంది. సంగారెడ్డి ఐఐటీ ప్రాంగణంలో ఈ ఏడాది నుంచే దీన్ని ప్రారంభించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ (హెచ్‌ఆర్‌డీ) నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ఐఐఐటీ కౌన్సిల్ అడ్మిషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది. వచ్చే నెల నుంచి 30 మంది విద్యార్థులతో సంగారెడ్డి ఐఐటీ ప్రాంగణంలో తరగతులు ప్రారంభించనుంది. ఫలితంగా దీన్ని తాత్కాలికంగా సంగారెడ్డిలోని ఐఐటీ ప్రాంగణంలో …
Read More »