Home / Tag Archives: trs (page 56)

Tag Archives: trs

తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ గుడ్‌ న్యూస్‌

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ కానుక ప్రకటించారు. స్వాతంత్య్ర  వజ్రోత్సవాలను పురస్కరించుకుని 57 ఏళ్లు నిండిన వారికి ఆగస్టు 15 నుంచి కొత్తగా పెన్షన్లు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 36లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. కొత్తగా మరో 10లక్షల మందికి ఇస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధిగ్రస్తులు, డయాలసిస్‌ చేయించుకుంటున్న కిడ్నీ రోగులుకు …

Read More »

దేశవ్యాప్తంగా చర్చ జరగాలి.. అందుకే బాయ్‌కాట్‌ చేస్తున్నా: కేసీఆర్‌ ఫైర్‌

సమాఖ్య, సహకార స్ఫూర్తిని భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని.. మహాత్మాగాంధీ చరిత్రను మలినం చేయాలని చూస్తున్నారని టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ విమర్శించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేంద్ర ప్రభుత్వం, భాజపా వైఖరిపై తీవ్రస్థాయిలో కేసీఆర్‌ మండిపడ్డారు. గాంధీకి లేని అవలక్షణాలను ఆయనకు అంటగట్టి హేళన చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. గత ఆర్థిక సంవత్సరంలో పథకాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.1.90లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్ర ప్రభుత్వం …

Read More »

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో దోమతెరల్లో నిద్రపోయిన ఎంపీలు

నిత్యవసర వస్తువుల ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేసిన విప‌క్ష ఎంపీలను వారం రోజుల పాటు స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. 24 మంది ఎంపీల‌పై విధించిన స‌స్పెన్ష‌న్‌ను ఎత్తివేయాల‌ని విప‌క్ష ఎంపీలు పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో 50 గంట‌ల ధ‌ర్నా చేస్తున్నారు. అయితే పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద‌ టెంటు వేసుకునేందుకు విప‌క్ష ఎంపీల‌కు అనుమ‌తి ల‌భించింది. దీంతో వాళ్లు ఓపెన్‌గానే నిద్ర‌పోయారు. వ‌ర్షం ప‌డ‌డంతో పార్ల‌మెంట్ …

Read More »

ఆ స్టిక్కర్‌ ఎవరో పెట్టుకుంటే నాకేం సంబంధం?: మంత్రి మల్లారెడ్డి

క్యాసినో కేసులో నిర్వాహకులు మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్‌ ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. అయితే ఈడీ తనిఖీల సమయంలో మాధవరెడ్డి కారుకు మేడ్చల్‌ ఎమ్యెల్యే, మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్‌ ఉన్న అంశం చర్చనీయాంశమైంది. బోడుప్పల్‌లో ఓ స్కూల్‌కు వెళ్లి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ మాధవరెడ్డి కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్‌ అంశంపై స్పందించారు. అది మార్చి 2022 నాటి స్టిక్కర్‌ అని.. దాన్ని మూడునెలల క్రితమే …

Read More »

మూసీ వరద.. మంత్రి కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాలికి గాయమైన కారణంగా ప్రగతి భవన్‌ నుంచే ఆయన సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, పురపాలక శాఖ అధికారులతో ఆయన రివ్యూ చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. మూసీ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాలని.. …

Read More »

ఆగస్టు 1 నుండి ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం..

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల ఆగస్టు ఒకటో తారీఖు నుండి ఓటరు కార్డుకు ఆధారం అనుసంధానం చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు. నిన్న మంగళవారం హైదరాబాద్ మహానగరంలోని సీఈఓ కార్యాలయం నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి .. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా …

Read More »

కేసీఆర్‌ నిప్పు.. ఆయన్ను ఎవరూ టచ్‌ చేయలేరు: జగదీష్‌రెడ్డి

కేసీఆర్‌ సీఎం అయ్యాకే రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలతో దేశం తలసరి ఆదాయం తగ్గిపోయిందని విమర్శించారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీష్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో బాధ్యతా రాహిత్యమైన, విచిత్ర ప్రతిపక్షాలు ఉన్నాయని మండిపడ్డారు. వార్తల్లో ట్రెండింగ్‌ అయ్యేందుకు ప్రతిపక్ష నేతలు పోటీపడుతున్నారని విమర్శించారు. ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు …

Read More »

బీజేపీలో ఈటలది బానిస బతుకు: బాల్క సుమన్‌

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్‌ అన్నారు. తిన్నింటి వాసాలను ఆయన లెక్కబెడుతున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, కేపీ వివేకానంద్‌తో కలిసి సుమన్‌ మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్‌విశ్వాసఘాతకుడని తీవ్రస్థాయిలో ఆయన ఆరోపించారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఈటల అవినీతికి పాల్పడ్డాడని.. రాబోయే ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమని చెప్పారు. …

Read More »

డాక్టర్లు 3 వారాలు రెస్ట్‌ తీసుకోమన్నారు: కేటీఆర్‌

మంత్రి కేటీఆర్‌ స్వల్ప గాయమైంది. ప్రమాదవశాత్తూ జారిపడటంతో ఆయన ఎడమ కాలికి గాయమైంది. ఈ విషయాన్ని తన ట్విటర్‌ ద్వారా తెలిపారు. మూడు వారాల పాటు రెస్ట్‌ అవవసరమని వైద్యులు సూచించినట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. ‘‘ఇవాళ ప్రమాదవశాత్తూ జారి పడటంతో ఎడమకాలు చీలమండ వద్ద స్వల్పంగా ఫ్రాక్చర్‌ అయ్యింది. 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ సమయంలో ఓటీటీలో మంచి షోలు ఉంటే చెప్పండి’’ అని …

Read More »

భారీ వర్షాలు.. అలెర్ట్‌గా ఉండండి: కేసీఆర్‌ ఆదేశం

మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగమంతా అలెర్ట్‌గా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం పెరిగే అవకాశముందని.. నీరుపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని రివ్యూ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలపై జీహెచ్‌ఎంసీ సిబ్బంది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat