తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్ జారీచేయనున్నది. డిగ్రీ లెక్చరర్ 491, సాంకేతిక విద్యలో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నియమ నిబంధనలతో కూడిన వివరాలను అధికారులు టీఎస్‌పీఎస్సీకి ఇటీవలే అందజేశారు. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, ఆర్థిక శాఖ వేర్వేరుగా రెండు జీవోలను జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 132 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిల్లో 4,098 …
Read More »బాసరకు మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈ రోజు సోమవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10 గంటలకు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని దీపాయిగూడకు చేరుకుంటారు. ఇటీవల ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాతృమూర్తి జోగు భోజమ్మ మరణించారు. దీంతో ఆయన కుటుంబ …
Read More »ఈ నెల 25న హైదరాబాద్ లో ట్రాఫిక్ అంక్షలు.. ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో ఈ నెల 25న (ఆదివారం) ఆసీస్ టీమిండియా మధ్య టీట్వంటీ మ్యాచ్ జరగనున్న సంగతి విదితమే. అంతేకాకుండా ఆ రోజు హైదరాబాద్ మహా నగరంలో గ్యాథరింగ్ సైక్లింగ్ కమ్యూనిటీ మారథాన్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 5 నుంచి 8 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు …
Read More »ఉప ఎన్నికలకు ముందే మునుగోడు ప్రజలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాక్
తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఆసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరిన సంగతి విదితమే. దీంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఉప ఎన్నికలకు ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ ప్రజకలే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకు షాకిచ్చారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటు …
Read More »కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో కాలనీలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం-ఎమ్మెల్యే Kp
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని ఎంఎన్ రెడ్డి నగర్ ఫేస్-1 లో రూ.1.5 కోట్లతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం రూ.10 లక్షలతో నూతనంగా చేపడుతున్న కమిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే …
Read More »అటవీ సంపదను కాపాడుకోవలిసిన బాధ్యత మనందరిది
తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ కలెక్టరేట్ లో జరిగిన పోడు వ్యవసాయ భూముల జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర గిరిజన,స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ అటవీ సంపదను కాపాడుకోవలిసిన బాధ్యత మనందరి మీద …
Read More »బీజేపీ పార్టీ పాలిత రాష్ట్రాలలో అతి తక్కువ పెన్షన్లు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ విలేజ్ లోని కమ్యూనిటీ హాలు నందు, నూతనంగా మంజూరు అయినటువంటి తెలంగాణ ప్రభుత్వ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కార్డులను గౌరవ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ అరికెపూడి గాంధీ గారు, గౌరవ కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ హమీద్ పటేల్ గారితో కలసి లబ్ధిదారులకు పంపిణీ చేయుట జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ గారు మాట్లాడుతూ …
Read More »బీజేపీ ప్రభుత్వ తీరుపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ తీరుపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ సాక్షిగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డాలర్‌తో రూపాయి మారకంవిలువ నానాటికీ పడిపోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రూపాయి విలువ అత్యంత కనిష్ఠానికి పడిపోతున్న వేళ.. కేంద్ర ఆర్థిక మంత్రి రేషన్ దుకాణాల్లో ప్రధాని మోదీ ఫొటో వెతుకుతూ బిజీగా ఉన్నారన్నారు. రూపాయి విలువ సాధారణంగానే పడిపోయిందని చెబుతున్నారని …
Read More »అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఈనెల 26న అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఉత్సవ కమిటీ చైర్మన్‌గా అక్కరాజు శ్రీనివాస్‌ను, కొండూరు సత్యనారాయణతోపాటు మరో 25 మంది వైస్‌చైర్మన్లు, 30 మంది కన్వీనర్లు, 19 మందిని కోకన్వీనర్లుగా నియమించింది. ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ వాషర్‌మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ …
Read More »తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు ఎప్పుడంటే..?
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 9 వరకు దసరా సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ప్రైవేట్, ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలన్నింటికీ ఇవే సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. మరోవైపు స్కూళ్లకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. స్కూళ్లు, కాలేజీలు అక్టోబర్ 10న పునఃప్రారంభం కానున్నాయి.
Read More »